యవ్వనం 375

ఇద్దరమూ ఆమె ఇంటి ముందు ఆగాము. ఆమె నన్ను ఇన్వైట్ చేస్తుందా అని ఆశగా చూసాను. ఆమె నా వైపు చూసి, “వస్తావా, లేకపోతె ఇంటికి వెళ్ళిపోతున్నావా?” అని అడిగింది. నేను నిరాశ పడ్డాను. ఇది పూర్తి ఆహ్వానం కాదు. వస్తాను అంటే కొంచెం లోకువవుతాను అనిపించింది. ఆమెకి నేను దాసోహమవ్వడమా? అదే సమయంలో నేను వేల్లిపోతానంటే ఆమె నాకు తనమీద పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకుంటుంది. అది మొదటికే మోసమవ్వచ్చు. ఆడవాళ్ళు ఎంత తెలివిగా మగవాళ్ళని తమ కంట్రోల్ లో పెట్టుకుంటారో అర్ధం అయ్యింది. రెండవ ఆప్షన్ కంటే మొదటిదే మంచిదనిపిచింది. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళను ఎంతో కాలం తమ గుప్పిటలో బంధించలేరు. మగవాళ్ళు నీళ్ళలా వేళ్ళ సందుల నుండి జారిపోతారు. కాలం గడిచే కొద్దీ ఆడవాళ్ళు మగవాళ్ళ ఆధీనం లోకి రాక తప్పదు. అంతవరకు ఓపికగా ఉండాలి. “నువ్వు నన్ను రాకూడదని అనుకుంటే వెళ్ళిపోతాను” అని బంతిని ఆమె కోర్టు లోకి పంపేసాను. “హే, నువ్వు రావడమే నాకు ఆనందం. రా మరి, ఆలస్యం ఎందుకు?” నవ్వుతూ ఆహ్వానం పలికింది. నేను కూడా నవ్వి బండి సైడ్ స్టాండ్ వేసి, లోపలకి వచ్చాను. కావ్య అమ్మ ఎదురొచ్చి మమ్మల్ని చూసి నవ్వుతూ , “ఈ రోజు క్లాసులు జరిగాయా?” అని అడిగింది. “అవునమ్మా, ఈ రోజు నుండి క్లాసులు చాలా రెగ్యులర్గా జరుగుతాయంట. సిలబస్ షెడ్యూల్ కూడా ఇచ్చారమ్మా”అంటూ, నా వైపు తిరిగి, “హరీ, నువ్వు నా రూం లో కూర్చో, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను.” అంటూ తన బేగ్ ని కూడా నాకు ఇచ్చింది. నేను ఆ బేగ్ అందుకొని ఒక్క క్షణం ఆగాను, ఆమె అమ్మ నన్ను అనుమానంగా చూస్తుందా అనుకుంటూ చూసాను. నేను ఆమె వైపు చూడడం గమనిచి “వేళ్ళు బాబూ, నాకు లోపల పని ఉంది. మీరు మీ చదువులు చూసుకోండి.” అంది. నేనిక ఆలస్యం చెయ్యకుండా కావ్య రూం వైపు వెళ్లి లోపల కూర్చున్నాను. కావ్య ఒక అయిదు నిముషాల తర్వాత వచ్చింది. చేతిలో వేడిగా ఉన్న బజ్జీలు ప్లేట్. “హరీ, తీసుకో.” అంటూ చేతికిచ్చింది. ఇద్దరమూ బజ్జీలు తింటూ క్లాస్ లెక్చరర్స్ గురించి మాట్లాడుకున్నాము. మేథ్స్ లెక్చరర్ చాలా ముసలాయన. కానీ చాలా బాగా చెప్తున్నాడు. ఫిజిక్స్ పర్లేదు. కేమిస్ట్రీకి మాత్రం కొత్తగా జాయిన్ అయిన ఒక అమ్మాయి మాకు టీచ్ చేస్తోంది. ఆమె టీచింగ్ కి కొత్త అని ఇట్టే అర్ధం అయిపోతోంది. కొంచెం బెరుకుగా, కొంచెం అనుమానాలతో మొదటి లెస్సన్ స్టార్ట్ చేసింది. ఆమె చామన చాయతో చాలా ఆకర్షనీయంగా ఉండడంతో స్టూడెంట్స్ మాత్రం అల్లరి చెయ్యకుండా క్లాస్ వింటూ కూర్చున్నారు. చీర కట్టుకొని తన వయసు కంటే ఎక్కువ హుందాతనాన్ని తెచ్చిపెట్టుకుంటూ లెస్సన్ చెప్తోంది. నేను ఆమెని చూస్తూ శ్రద్దగా క్లాస్స్ వింటుంటే కావ్య మధ్యలో నా తోడ మీద గట్టిగా గిల్లింది. ఆడవాళ్ళకు పోజేసివ్ నేచర్ చాలా కామన్ మరి. ఆమె గురించి ప్రస్తావన వచ్చినపుడు “ఏంటీ, కెమిస్ట్రీ మేడం ని అలా తినేసేలా చూస్తున్నావు? అయినా ఆమె నాకన్నా బాగుందా? నల్లగా లేదూ?” అంటూ కళ్ళు ఎగర వేస్తూ నన్ను ఆట పట్టించింది. నేను నవ్వి, “అదేమీ కాదు. కెమిస్ట్రీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్. అందుకే నేను శ్రద్దగా వింటున్నాను. అయినా మేడంని చూస్తె నీకెందుకు కుళ్ళు? అబ్బ ఎంత గట్టిగా గిల్లావో! ఆల్ మోస్ట్ నేను అరిచేవాడిని” అంటూ సమాధానం ఇచ్చాను. “అదేమీ కాదులే. చీర కట్టుకోచింది కదా. నడుము, వీలయితే ఇంకా పైన చూడాలని నీ ప్రయత్నంలా కనిపిచింది. అయినా చీర కంటే సెక్సీ డ్రెస్ ఈ ప్రపంచంలో లేదులే. అవకాశం దొరికితే అబ్బాయలు ఏమాత్రం విడిచిపెట్టారు కదా” అంది. “ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకోవడం తప్పు కాదు కదా” అన్నాను ఒక పాట తెలుగు డైలాగ్ జ్ఞాపకం చేసుకుంటూ. ఆమె నవ్వింది. ఇంతలో బజ్జీలన్నీ అయిపోయాయి. టిష్యూ పేపర్ ఇచ్చింది. నేను చేతులు తుడుచుకున్నాను. “మరి నీ పరిశోధన మొదలు పెట్టావా? ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ” నవ్వుతూ అడిగింది. “నిన్న కొంచెం తెలిసింది. ఈ రోజు ఇంకొంచెం తెలుసుకోవాలని అనుకుంటున్నా” అన్నాను. కావ్య సిగ్గుగా నవ్వింది. “అమ్మా ఆశ, దోస, అప్పలం, వడ” అంది. నేను నిరాశగా ఆమె వైపు చూసాను.

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.