యవ్వనం 375

హాయ్,
తెలుగులో మంచి రొమాంటిక్ కథలు రావడం లేదు. అందుకే నేను మీ కోసం ఒక మంచి కథను రాస్తున్నాను.
రసవత్తరమైన ఈ కథను చదివి మీ అభిప్రాయాలను నాకు తప్పక చెప్పండి. ఎందుకంటే మీ నుండి వచ్చే ప్రశంసే నన్ను మరింత మంచి కథ రాయడానికి ప్రేరణ అవుతుంది.
ఇంక ఆలస్యం ఎందుకు?
చదవండి, ఆనందించండి.

కావ్య
ఈ పేరు వినగానే నా యవ్వన తోలి ప్రేమ జ్ఞాపకం వస్తుంది. ఎంత అందమైన పేరో అంతకంటే అందమైన అమ్మాయి కావ్య.
నేను అప్పుడే కాలేజీలో అడుగుపెట్టిన రోజు. మొదటిసారిగా ఒక హీరోలా ఫీల్ అయిన రోజు. నేను చిన్నపిల్లాడిని కాను అని భావం కలిగిన రోజు. సహజంగానే కొంచెం అంతర్ముఖుడిని కావడంతో ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కొంచెం ముభావంగా ఉండడం నాకు చిన్నప్పటి నుండి అలవాటు. కానీ నా మనసు మాత్రం ఉరుకలు వేస్తుంటుంది ఒక అంతర్వాహినిలా. నేను ఏమి చెయ్యాలనుకున్నా రాముడు మంచి బాలుడు అనే టైటిల్ నన్ను కట్టిపడేస్తుంది. నేను మంచి స్టూడెంట్ నే. సాధారణంగా క్లాసుల్లో ముందు వరుసలలోనే కూర్చుంటాను. కానీ మొదటి రోజు కావడంతో నేను కొంచెం చివరివరుసలో కూర్చున్నాను. మిగిలిన అబ్బాయలు అమ్మాయలు గలగలా మాట్లాడుకుంటూ స్నేహాలు కలిపేసుకుంటున్నారు. నేను నిశాభంగా ఒక చైర్ లో కూర్చున్నాను. నా పక్కనున్న చైర్ ఖాళీగానే ఉంది. క్లాస్ అంతా ఒక సారి పరిశీలించి చూసాను. నా పక్కనున్న చైర్ మాత్రమె ఖాళీగా ఉండడంతో ఇంకా ఒకరు రావాలన్నమాట అనుకున్నాను.

క్లాసులో అందరూ అల్లరిగా బిగ్గరగా మాట్లాడుకుంటూ ఉండడంతో చాలా గందరగోళంగా ఉంది. ఇంతలో ఒక్కసారిగా నిశ్శబ్దం. మేధామేటిక్స్ లెక్చరర్ వచ్చారు. అటెండెన్స్ రిజిస్టర్ చూస్తూ పేర్లు పిలుస్తున్నారు. నా పేరు వచ్చినపుడు నేను ఎస్ సర్ అని కూర్చున్నాను. ఇంతలో సర్ “కావ్యా” అని పిలిచారు. ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఆయన మళ్ళీ పేరు రిపీట్ చేసారు. ఇంతలో ఒక అమ్మాయి పరుగున క్లాస్ రూం దగ్గరకు వచ్చి “సర్, ఐ యాం కావ్య. మే ఐ కమిన్?” అడిగింది. క్లాస్స్ అంతా ఒక్కసారిగా ఆమెవైపు తలతిప్పి చూసారు. అబ్బాయల కళ్ళు బయటకు వచ్చాయి. అమ్మాయల కళ్ళు అసూయతో రగిలిపోయాయి. ఒక మెరుపుతీగలాంటి అమ్మాయి నిలబడి ఉంది. బంగారు వన్నెతో, ఆ మేని చాయకి సరిపడే అందమైన స్కై బ్లూ స్కర్ట్ , వైట్ షర్ట్ టక్ చేసుకొని ఒక ఆధునిక దేవకన్యాలా నిలబడింది. బహుశా ఇంతవరకూ ఎవ్వరూ ఇంత అందమైన కావ్యాన్ని రచ్చిన్చాలేదేమో. అందుకే అందరికన్నా పెద్ద రచయిత, శిల్పి భ్రహ్మే మరి. మొదటి రోజే క్లాసుకు లేట్ వస్తే ఎలా? డోంట్ రిపీట్ దిస్ అగైన్ అండ్ కం ఇన్ నౌ” సర్ ఆమెకి పెర్మిషన్ ఇచ్చారు. ఆమె క్లాసులోకి వస్తూ ఒక్కసారి అంతా చూసింది. ఎక్కడా చైర్స్ ఖాళీగా లేవు నా పక్కన తప్పితే. ఆమె సరాసరి వచ్చి నా పక్కన కూర్చుంది. ఒక్కసారిగా నా మనసు లయ తప్పింది.

7 Comments

  1. Super story bro continue madyalo apoddu plz

  2. సూపర్ గా ఉంది బ్రో నీ స్టొరీ

  3. Great writing

  4. Bro emo anukunna kani nijam ga bagundhi e story madhylo appodhu andarila complete chyndi

  5. Good litarature

  6. Super u r very intelligent boy

Comments are closed.