రాత్రి జరిగిన సంగతి 285

అనుకున్నానేగానీ సాయంత్రం ఇంటికొచ్చాక ఆ సంగతే మర్చిపోయాను. ఆఖరి యూనిట్ పరీక్ష రాసిన ఆనందంలో రాత్రి సంగతి వెంటనే గుర్తుకురాలేదు. భోజనాల సమయంలో దిలీప్ మామయ్యని చూస్తే గుర్తుకొచ్చిందా సంగతి. వెంటనే చెప్పేశా.

అప్పుడు ముగ్గురం కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్ చేస్తున్నాం. ‘మమ్మీ, రాత్రి మనింటికి దెయ్యాలొచ్చాయి’ అంటే అమ్మ ఆశ్చర్యపోయింది. మామయ్యేమో ఏ భావమూ కనబడకుండా నాకేసిచూశాడు. ‘దెయ్యాలెంట్రా, కలగన్నావా’ అంది అమ్మ ఆశ్చర్యం నుండి తేరుకుని నవ్వుతూ.

‘లేదు మమ్మీ. నిజం. అర్ధరాత్రప్పుడు లేచి చూస్తే నువ్వు లేవు. బయటికెళ్లావేమోనని చూస్తే అక్కడా లేవు. అప్పుడు భయమేసి పైకెళ్లి మామయ్యని లేపుదామని వెళ్లా. పెంట్ హౌస్ లోపల్నుండి దెయ్యాల శబ్దం వినిపిస్తే పరిగెత్తుకొచ్చేసి బెడ్ రూం లో పడుకున్నా’, గుక్క తిప్పుకోకుండా చెప్పాను.

అమ్మ షాక్ తిన్నట్లుగా అయిపోయింది ముందు. కానీ వెంటనే తేరుకుని మామయ్య కేసి చూసింది. నేనూ అటే చూశా. ఆయన ఇంకా ఏ భావమూ లేకుండా చూస్తున్నాడు. అంతలో నాకనుమానమొచ్చింది. వెంటనే అడిగా, ‘మమ్మీ, ఇంతకీ నువ్వెక్కడికెళ్లావు రాత్రి?’.

అమ్మ మంచి నీళ్ల గ్లాసందుకుని రెండు గుక్కలు తాగి చెప్పింది. ‘ఇంటి వెనకున్నా. అక్కడేదో శబ్దం వినపడితే చూద్దామనెళ్లా. ఇంతకీ నీకేం శబ్దాలు వినపడ్డాయి?’.

‘ఏదో కిర్రు కిర్రు శబ్దం వినపడింది. దాంతో పాటే ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్లు, ఇంకెవరో కోపంగా అరుస్తున్నట్లు అనిపించింది. గాజుల శబ్దం కూడా వినపడింది. నాకు చాలా భయమేసింది’.

అమ్మ రెండు క్షణాలు ఆలోచిస్తున్నట్లుగా ఆగి, తర్వాత ‘అయితే నే వినింది కూడా వాటి శబ్దాలేనేమో’ అంటూ మామయ్య వంక చూసి, ‘నువ్వేమంటావ్ దిలీప్? దెయ్యాలేనంటావా?’ అనింది. ఆ మాటంటూ ఎందుకో తమాషాగా నవ్వింది.

‘అయ్యుండొచ్చు జానూ. నా కిచెన్ లో చేరాయేమో? ఇంకా నయం నేను బెడ్ రూం లోపల గడె పెట్టుకుని పడుకున్నా. లేకపోతే నా మీద పడేవేమో’ అన్నాడు మామయ్య కూడా తమాషాగా నవ్వి.

‘ఇక నుండీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంది అమ్మ వెంటనే కళ్ల చివర్ల నుండి నావైపు చూస్తూ.

‘నిజమే’ అన్నాడు మామయ్య నవ్వు ఆపుకుని సీరియస్ గా మొహం పెట్టి.

‘అవును మమ్మీ. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అన్నాను నేను కూడా పెద్ద మేధావిలా. ఇద్దరూ నవ్వేశారు నాకేసి చూసి.

అంతలో నాకో అనుమానం వచ్చింది. ‘మమ్మీ, అవి పెంట్ హౌస్ లో ఉన్నాయి కదా. మరి మామయ్యనేమన్నా చేస్తే?’ అన్నాను వెంటనే గాభరాగా.

‘నిజమే రాముడూ’ అంటూ అమ్మ దీర్ఘాలోచనలో పడ్డట్టు కాసేపు మౌనంగా ఉంది. తర్వాత ‘ఒక పని చేద్దాం. మామయ్యనొచ్చి మనతో పాటు పడుకోమందామా’ అంది నాకేసి చూస్తూ.

1 Comment

  1. కన్న (( రాముడు)) నిజమేరా నాన్న లు అమ్మలకు దూరంగా ఉండటం వల్ల అదికూడా మామయ్య లాంటి వాళ్లు మన ఇంట్లో ఉంటే (దయ్యాలు భూతాలు) మన ఇంట్లో ఏవేవో శబ్ధాలు చేస్తాయి అవి మనం ఎవ్వరికీ చెప్పొద్దు ముఖ్యంగా నాన్న గారికి అస్సలు చేపొద్దు చెపితే దయ్యాలు మనని ఎత్తుక పోతాయి.. జాగ్రత్త రాముడు ఇంకా కొన్ని రోజుల తరువాత ఆ దయ్యాలు అమ్మను మామయ్యనూ మామయ్య లేకపోతే వేరే ఇంకో మామయ్య ను రాత్రి పూట బట్టలు కూడా వేసుకొనియ్యావు..

Comments are closed.