రాములు ఆటోగ్రాఫ్ – Part 21 91

“ఏంటి మేడమ్….నా ఐడియా నచ్చలేదు…నేను ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పాను,” అంటూ రాజన్న జరీనా కోపంగా తన వైపు చూసి మాట్లాడటం చూసి భయపడుతూ అడిగాడు.
ఇక జరీనాకి ఇరిటేషన్ పెరిగిపోయింది.
కాని అతికష్టం మీద తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, “ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు,” అని కొంచెం గట్టిగానే అన్నది.
దాంతో రాజన్నకి తాను ఏం తప్పు మాట్లాడానో అర్ధం కాక అక్కడనుండి తల గోక్కుంటూ వెళ్ళిపోయాడు.
******
ఇక ఇక్కడ క్లాసులో ఉన్న ముగ్గురూ (రాము, రవి, మహేష్) క్లాసు ఎప్పుడు అయిపోతుందా అన్నట్టు చాలా ఇరిటేషన్ గా చూస్తున్నారు.
నిన్నటి నుండి ఎంత ట్రై చేసినా జరీనా చూడటానికి కుదరకపోయేసరికి వాళ్ళకి చాలా అసహనంగా ఉండి…మాటి మాటికి చేతికి ఉన్న వాచీ వైపు చూసుకుంటూ ఎప్పుడు బయటకు వెళ్దామా అన్నట్టు చూస్తున్నారు.
జరీనా తప్పకుండా వాళ్ళ క్లాసు తీసుకుంటుందని వాళ్ళు ముగ్గురికి తెలుసు.
కాని అప్పటి దాకా ఆమెను చూడకుండా ఉండటం అనేది వాళ్ళ వల్ల కావడం లేదు.
అలా కొద్దిసేపటికి ఫస్ట్ హవర్ అయిపోయినట్టు బెల్ మోగింది.
ఆ కొద్దిసేపు కూడా ముగ్గురికి ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడిచినట్టు ఉన్నది.
బెల్ మోగిన వెంటనే మహేష్ తన సీట్ లోనుండి లేచి అక్కడ నుండి బయటకు వెళ్ళబోయాడు.
కాని రవి మహేష్ ని ఆపి, “ఒరేయ్….ఇప్పుడు క్లాస్ ఉన్నది….ఎక్కడకు వెళ్తున్నావు,” అని అడిగాడు.
మహేష్ : వెళ్ళరా బాబు….నాకు ఇప్పుడు క్లాస్ వినే మూడ్ లేదు….అదీకాక నిన్న ఇచ్చిన వర్క్ చేసారా లేదా అని నన్నే ముందు అడుగుతానన్నాడు….నేను ఆయన చెప్పిన వర్క్ చేయలేదు.
రాము : మరీ అంత కంగారు పడకురా…ఇవ్వాళ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆమెను తప్పకుండా చూస్తాము….మరీ అంత ఇరిటేషన్ అవద్దు.
రవి కూడా రాము చెప్పింది కరెక్ట్ అన్నట్టు తల ఊపి…నిన్న వర్క్ చేసుకోవడంలో మునిగిపోయాడు.
దాంతో మహేష్ కూడా మళ్ళి తన సీట్లో కూర్చుని పక్కన కూర్చుని ఉన్న రాము బ్యాగ్ లో నుండి బుక్ తీసుకుని వర్క్ మొత్తం తన నోట్ బుక్ లోకి కాపి చేసుకున్నాడు.

తన నోట్ బుక్ లో చూసి రాసుకుంటున్న మహేష్ ని చూసిన రాము చిన్నగా నవ్వుతూ, “అది కూడా రాయడం ఎందుకురా…..చక్కగా ఆ పేజీ వరకు జిరాక్స్ తీసుకోవచ్చు కదరా,” అన్నాడు.
మహేష్ : మరీ అంత వెటకారం వద్దురా బాబు…నాకు ముందే ఐడియా వచ్చింది….కాని నీ రైటింగ్ చూసి సార్ వెంటనే గుర్తు పడతాడు కదరా…
రాము : అయ్యగారికి తెలివి బాగా ఎక్కువయినట్టున్నది….నీకు అవకాశం రాక ఇలా ఉన్నావు కాని…..అవకాశం వస్తే లెక్చరర్ ప్లేసులో మాకు పాఠాలు చెబుతానంటావురా…..
ఆ మాట అనగానే పక్కనే ఉన్న రవి కూడా ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు.
మహేష్ కూడా ఇక వాళ్ళ మాటలను పట్టించుకోకుండా వర్క్ తన బుక్ లోకి కాపి చేసుకుని రాముకి బుక్ ఇచ్చేసాడు.
అంతలో సెకండ్ అవర్ మొదలైనట్టు బెల్ మోగింది.
కాని క్లాసులోకి maths లెక్చరర్ బదులు రాజేశ్ సార్ వచ్చారు.
రాజేష్ క్లాసులోకి వచ్చి స్టూడెంట్ల వైపు చూస్తూ, “హాయ్….ఈ రోజు మీ క్లాసు టైం టేబుల్ లో చిన్న మార్పు జరిగింది….అది చెప్పటానికి నేను వచ్చాను….ఇప్పుడు మీకు maths క్లాస్ మధ్యాహ్నం సెషన్ లోకి మార్చారు….ఇప్పుడి ఈ క్లాసు ప్లేసులో కొత్తగా సైకాలజీ క్లాసు జరుగుతుంది,” అన్నాడు.
రాజేష్ నోటి వెంట ఎప్పుడైతే సైకాలజీ క్లాసు జరుగుతుంది అని వినేసరికి క్లాసు మొత్తం ఆనందంగా ఉన్నది.
అందరితో పాటు రాము, మహేష్, రవి కూడా జరీనా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు.
“సరె…ఈ సబ్జెక్ట్ కోసం కొత్త లెక్చరర్ జాయిన్ అయ్యారు…ఆమె పేరు జరీనా…ఆమెకు టీచింగ్ కూడా కొత్త…..అందుకని మీరందరు గొడవ చేయకుండా ఆమెతో జాగ్రత్తగా ఉండండి….నేను వెళ్ళి ఆమెను పంపిస్తాను….అప్పటి వరకు గొడవ చేయకుండా సైలెంట్ గా ఉండండి,” రాజేష్ క్లాసులో నుండి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిన కొద్దిసేపటికి జరీనా క్లాసులోకి వచ్చింది.
జరీనాని చూసి క్లాసులో ప్రతి ఒక్కరు ఆమె అందాన్ని కన్నార్పకుండా అలానే చూస్తున్నారు.
మహేష్ అయితే నోరు తెరుచుకుని అలానే చూస్తున్నాడు.
రాముకి తన గుండె శబ్దం తనకే వినిపిస్తున్నది.
రవి కూడా కనురెప్పవేస్తే అందం చూడటం ఎక్కడ మిస్ అవుతామో అన్నట్టు అతను కూడా కన్నార్పకుండా చూస్తున్నాడు.
జరీనా క్లాసులోకి వస్తూ అందరి వైపు చూసి నవ్వు తూ లోపలికి అడుగు పెట్టింది.
రెడ్ కలర్ చీర….యెల్లో కలర్ వేసుకుని చాలా అందంగా ఉన్నది జరీనా.
“గుడ్ మార్నింగ్…..నా పేరు జరీనా….కొత్తగా సైకాలజీ చెప్పటానికి జాయిన్ అయ్యాను…” అన్నది జరీనా.
ఆమె మాటలకు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు…..అందరు ఆమెను మైమరచి పోయి చూస్తున్నారు.
మహేష్ ఆమెను పైనుండి కింద దాకా కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.

జరీనా క్లాసులోకి వస్తూ అందరి వైపు చూసి నవ్వు తూ లోపలికి అడుగు పెట్టింది.
వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ బార్డర్ ఉన్న చీరలో, దానికి గ్రీన్ కలర్ మ్యాచింగ్ జాకెట్ వేసుకుని చాలా అందంగా ఉన్నది జరీనా.
“గుడ్ మార్నింగ్…..నా పేరు జరీనా….కొత్తగా సైకాలజీ చెప్పటానికి జాయిన్ అయ్యాను…” అన్నది జరీనా.
ఆమె మాటలకు ఎవరు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు….అందరు ఆమెను మైమరచి పోయి చూస్తున్నారు.
మహేష్ ఆమెను పైనుండి కింద దాకా కన్నార్పకుండా అలానే చూస్తున్నాడు.
క్లాసులో అందరు తన వైపు కన్నార్పకుండా చూడటం గమనించిన జరీనా తనలో తాను నవ్వుకుంటూ, “హలో….నేను గుడ్ మార్నింగ్ చెప్పాను….అందరు ఎక్కడ ఆలోచిస్తున్నారు,” అనడిగింది.

దాంతో అందరు ఒక్కసారిగా సృహలోకి వచ్చి ఆమెను విష్ చేసారు.
కాని క్లాసులో ఇంకా కొంతమంది మాత్రం ఆమె అందాన్ని ఇంకా కన్నార్పకుండా చూస్తునే ఉన్నారు.
“సరె….ఇక విషయానికి వద్దాము….నేను ఇక మీ అందరికి వారంలో రెండు మూడు క్లాసులు తీసుకుంటాను….మీకు సైకలాజికల్ గా ఏమైనా డౌట్లు ఉంటె అడగండి….నేను మీకు నాకు చేతనైనంత వరకు హెల్ప్ చేస్తాను….క్లాసులో అడగటం మొహమాటం అనుకుంటే నా క్యాబిన్ కి వచ్చి అడగొచ్చు,” అని ఒక్కసారి క్లాసులో అందరి వైపు చూసి, “ఇప్పుడు అందరు….ఒక్కొక్కరుగా వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పండి….” అంటూ క్లాసులో లెఫ్ట్ సైడ్ నుండి మొదలుపెట్టమన్నట్టు చూసింది జరీనా.
దాంతో స్టూడెంట్లు అందరు తమ పేర్లు చెప్పి ఆమెను పరిచయం చేసుకున్నారు.
కాని రాము, రవి, మహేష్ మాత్రం జరీనాని అలానే చూస్తూ మైమరిచిపోతున్నారు.
అందరు అయిపోయిన తరువాత మహేష్ వంతు వచ్చింది.
కాని మహేష్ లేవకపోయే సరికి జరీనా అతని వైపు చూసి, “హలో నువ్వే….నీ పేరు చెప్పు….” అంటూ దగ్గరకు వచ్చి తన వైపు కన్నార్పకుండా చూస్తున్న మహేష్ కూర్చున్న చైర్ మీద గట్టిగా కొట్టింది.
క్లాసు మొత్తం ఆమెనే చూస్తూ వెనక్కి తిరిగి చూస్తున్నారు.
“ఓయ్….ఏంటి నువ్వు కళ్ళు తెరిచి నిద్ర పోతున్నావా…నీ పేరు చెప్పు,” అన్నది జరీనా.
దాంతో మహేష్ ఈ లోకంలోకి వచ్చాడు.
కాని జరీనా ఏం అడిగిందో తెలియక ఆమె వైపు చూస్తూ, “ఏంటి మేడమ్,” అని అడిగుతూ తన చూపుని ఆమె ఒంటి మీద నుండి మొహం మీదకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు.
మహేష్ అలా అడగగానే క్లాసులో అందరు ఒక్కసారిగా నవ్వారు.
జరీనా కూడా నవ్వుతూ, “అంటే నువ్వు క్లాసులో మాట్లాడుతున్నది వినలేదన్నమాట….పట్టపగలే కలలు కంటున్నావా…అందరు తమ పేర్లు చెప్పి పరిచయం చేసుకున్నారు….నువ్వు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కలలు కంటున్నావా….నీ పేరేంటో చెప్పు,” అన్నది.
“నా పేరు మహేష్ మేడమ్,” అన్నాడు మహేష్ తన సీట్ లోనుండి లేచి నిల్చున్నాడు.
మహేష్ పేరు వినగానే ప్రిన్స్ పాల్ చెప్పిన వాళ్ళల్లో వీడు ఒకడని అర్ధమయింది….కాని జరీనా తన మొహంలో చిరునవ్వు మాత్రం చెరిగిపోలేదు.
“ఓహ్….నువ్వేనా మహేష్ అంటే….కాలేజీలో నీ పేరు మార్మోగిపోతుంది…నేను జాయిన్ అవగానే ముందుగా నీ పేరే విన్నాను. నీ మిగతా ఇద్దరు ఫ్రండ్స్ రాము, రవి ఎక్కడా,” అని అడిగింది జరీనా.
ఆమె అలా అనగానే పక్కనే కూర్చుని ఉన్న రాము, రవి తమ పేర్లు ఆమెకు ఎలా తెలిసాయో తెలియక ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
రవి వెంటనే తల గోక్కుంటూ, “మేడమ్….మా పేర్లు మీకు ఎవరు చెప్పారు,” అనడిగాడు.

జరీనా కొంచెం గట్టిగానే నవ్వుతూ, “మీరు ముగ్గురూ ఈ కాలేజీలో బాగా గొడవ చేసేవాళ్ళంట కదా…నిజమేనా,” అన్నది.
అది వినగానే రాము కొంచెం సిగ్గుపడుతూ, “అదేం లేదు మేడమ్….మేము బాగా చదువుతాము….మీకు ఎవరో మా గురించి తప్పుగా చెప్పారు,” అన్నాడు.
ఆ మాట వినగానే క్లాసులో అందరు మళ్ళీ ఒక్కసారిగా నవ్వారు.
జరీనా కూడా నవ్వు ఆపుకోలేక నవ్వుతూ, “అవునవును….నేను మీ గురించి చాలా విన్నాను….వీళ్ళ ముగ్గురిలో నువ్వు ఒక్కడివే బాగా చదువుతాను….కాని వీళ్ళతో తిరిగి ఎక్కడ చెడిపోతావో అని భయంగా ఉన్నది….గొడవలకు బాగా వెళ్తారంట కదా,” అనడిగింది.
క్లాసు మొత్తం తమ వైపు చూసి నవ్వుతుండె సరికి ముగ్గురూ సిగ్గు పడుతూ తల వంచుకుని బలవంతంగా నవ్వుతున్నారు.
దాంతో జరీనా వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ, “హే….అలా తప్పుగా నేనేమీ వినలేదు….కాకపోతే కొంచెం గొడవ ఎక్కువ చేస్తారని విన్నాను….” అని రాము వైపు చూసి, “నువ్వు బాగానే చదువుతావు కదా…మరీ నీ ఫ్రండ్స్ ని కూడా చదివించొచ్చుకదా,” అన్నది.

2 Comments

  1. I hate that story bro

  2. Sir mee story starting chala bavundi kani ippudu baledu konchem human values tho rayandi ugly cheyyakandi

Comments are closed.