రాములు ఆటోగ్రాఫ్ – Part 3 177

దాంతో రాము ఒక నిర్ణయానికి వచ్చినట్టు వెంటనే ఫోన్ చేసి రంగను, అనసూయను పిలిచాడు.
వాళ్ళు రాము ఫోన్ చేసిన పది నిముషాలకు రంగ, అనసూయ ఇద్దరూ ఒబెరాయ్ విల్లాకు వచ్చారు.
వచ్చిన వెంటనే రంగ కంగారుగా లోపలికి వస్తూ, “అయ్యా….రాము గారు,” అంటూ పిలుస్తూ వచ్చాడు.
రంగ మాట విని బెడ్ రూమ్ లో ఉన్న రాము బయటకు వచ్చాడు.
రాము బాగానే ఉండటం చూసి రంగ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు.
రంగ : ఏంటయ్యా…అర్జంట్ గా రమ్మని పిలిచారు…మీరు అలా పిలిచేసరికి మీకు ఏం జరిగిందో అని కంగారు పడుతూ వచ్చాము.
రాము : అంత కంగారు పడాల్సిన విషయం ఏం లేదు రంగ….కూర్చో నీతో మాట్లాడాలి….
రంగ : కంగారు లేకుండా ఎలా ఉంటుందయ్యా….నిన్న జరిగింది అనసూయ చెప్పగానే నాకు కాళ్ళూ చేతులు ఆడలేదు. అందుకనే అయ్యగారు….మీరు ఈ విల్లాలో నుండి వెళ్లిపోండి….మీ ఊరికి వెళ్ళిపోండి….
రాము : రంగా….కంగారు పడాల్సింది ఏమీ లేదని చెప్పానా…..
అంటూ లెటర్ దొరికిన విషయం, అందులో రేణుక రాసిన విషయాలు మొత్తం వివరంగా రంగకు, అనసూయకు చెప్పి….
రాము : ఇప్పుడు మీరంతా అనుకున్నట్టు ఈ ఇంట్లో ఒక దెయ్యం కాదు….మూడు దెయ్యాలు ఉన్నాయి….ఒకటి లెటర్ రాసిన రేణుక ఆత్మ, ఇంకొకటి ప్రొఫెసర్ సుందర్ ఆత్మ, ఇక మూడోది పేరు తెలియదు….సుందర్ ప్రేతాత్మకి హెల్ప్ చేస్తున్నది.….ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా సుందర్ ఆత్మ వింటూ ఉండొచ్చు…..
రాము చెప్పిన విషయాలు విన్న రంగకి, అనసూయకు వెన్నులొ చలి పుట్టుకొచ్చింది.
వాళ్ళిద్దరి కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తున్నది.
కొద్దిసేపటికి రంగ తేరుకుని చుట్టూ భయంగా చూస్తూ….
రంగ : అయ్యా…ఇప్పటిదాకా ఒక దెయ్యమే అంటేనే హడలి చస్తున్నాము….ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం రెండో దెయ్యం కూడా ఉన్నదంటున్నారు….పైగా మనతో పాటే మన మాటలు కూడా వింటుందంటున్నారు….ఏంటయ్యా మీరు చెప్పేది….
రాము : అవును రంగ….నేను చెప్పేది నిజం…..అందుకని మీరు భయపడకుండా ఉండాలి అంటే…..మనం ఇక్కడ కాదు….మీ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం….పదండి…
రాము అలా అనడంతో రంగ, అనసూయ అదురుతున్న గుండెలతో విల్లా నుండి బయటకు వచ్చి కారులో కూర్చున్నారు.
వాళ్ళిద్దరూ కూర్చున్న తరువాత రాము నేరుగా కారుని డ్రైవ్ చేస్తూ అనసూయ వాళ్ళింటి ముందు ఆపాడు.
మూడు గదుల చిన్న ఇల్లు వాళ్ళది.
లోపలికి వెళ్ళిన తరువాత రంగ ఒక కుర్చీ తీసుకొచ్చి వేసి రాముని కూర్చోమని…..వాళ్ళిద్దరూ అతనికి ఎదురుగా గోడకు ఆనుకుని రాము ఏం చెబుతాడాని అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
రంగ : సార్….ఇప్పుడేం చేద్దాం….
అనసూయ : ఏంటయ్యా చేసేది….ఆ బాబుని అలా ఆ విల్లాలో ఒంటరిగా వదిలేస్తామా….(అంటూ రాము వైపు తిరిగి) బాబూ మీరు ఆ బంగ్లా నుండి మీ ఊరికి వెళ్ళిపోండి….
అనసూయ రాముతో అలా గట్టిగా ఆర్డర్ వేస్తున్నట్టు మాట్లాడుతుండే సరికి రాము ఎక్కడ కోప్పడతాడేమో అని రంగ భయపడుతూ అతని వైపు చూస్తున్నాడు.
కాని రాము మాత్రం రంగ చూపులను పట్టించుకోకుండా అనసూయ వైపు చూస్తూ….
రాము : రాత్రి రేణుక రాసిన లెటర్ చదివిన తరువాత చాలా భాధేసింది అనసూయా….రాత్రిళ్ళు ఆమె కేకలు కూడా వినిపిస్తున్నాయి ఆ కేకల్లో చాలా బాధ ఉన్నది….ఏం చేయాలో నాకేమీ అర్ధం కావడం లేదు…..
అనసూయ : అందుకని…..ఏం చెయ్యాలనుకుంటున్నారు….
రాము : నాకు ఏదైనా హెల్ప్ చేయాలని ఉన్నది…..(అంటూ రంగ, అనసూయ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు)
రాము ఏం అన్నాడో ఒక్క క్షణం వాళ్ళిద్దరికీ అర్ధం కాలేదు….కాని రంగ వెంటనే తేరుకుని….
రంగ : ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు…..పోయి పోయి దెయ్యానికి హెల్ప్ చేస్తానంటవేంటి….
రాము : అవును రంగ….నాకు ఇక్కడకు రాక ముందు ఈ ఒబెరాయ్ విల్లా గురించి కొంచెం కూడా తెలియదు….కాని ఇప్పుడు నాకు విషయం తెలిసింది….ఏదో జరుగుతుంది….అది నాకు తెలుస్తుంది….కాని రేణుక ఆత్మ నాతో ఏం చెప్పాలనుకుంటుందో నాకు అర్ధం కావడం లేదు….
రంగ : తెలిస్తే మాత్రం…..మనం ఏం చెయ్యగలుగుతాం సార్….మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు….ఈ రోజుల్లో అయిన వాళ్ళే పక్కన వాళ్ళకు సాయం చేయడం లేదు…..అలాంటిది మీరు దెయ్యానికి సాయం చేస్తానంటున్నారు…..మీకు ఏదైనా అయితే మీ నాన్నగారు, అమ్మగారు ఏమవుతారో ఆలోచించండి రాము : లేదు రంగ….నేను ఏదో ఒకటి చేయాలి….నాకు ఒక్క హెల్ప్ చేస్తావా…..
రంగ : చెప్పండి బాబు…నాకు చేతనైనంత వరకు చేస్తాను….కాని మీరు చేస్తున్న పనిలో మీ ప్రాణాలకు చాలా ప్రమాదం ఉన్నది. ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి….

3 Comments

  1. Nice and Erotic updated story of Haunted movie

  2. Pls continue part 4

  3. Nice bro.. Baga hindi movie story ni copy kotesav

Comments are closed.