రాములు ఆటోగ్రాఫ్ – Part 3 176

రాము : అవును….ఒబెరాయ్ విల్లా నుండి వచ్చింది నేనె….
దాంతో అందరు రాము వైపు చూసారు.
మేడమ్ రాము వైపు చూసి….
మేడమ్ : మీరు నా ఆఫీస్ రూమ్ లో కూర్చోండి….నేను ఐదు నిముషాల్లో వచ్చేస్తాను….(అంటూ స్టూడెంట్ల వైపు తిరిగి) ఇవ్వాళ్టికి చాలు….రేపు సేమ్ టైంకి కలుసుకుందాం…..
అని వాళ్లందరిని పంపించి….ఆఫీస్ రూమ్ లోకి వచ్చింది.
అప్పటికే ఆమె అసిస్టెంట్ రాముని ఆఫీస్ రూమ్ లో కూర్చోబెట్టి వెళ్లింది….
రాము అలా కూర్చుని రూమ్ లో ఉన్న ఫోటోలను చూస్తూ ఉండగా ఆమె వచ్చేసరికి లేచి నిలబడ్డాడు.
ఆమె తన చైర్ లో కూర్చుంటూ….రాముని కూడా కూర్చోమన్నట్టు సైగ చేసింది.
రాము కూడా కుర్చిలో కూర్చున్నాడు….అంతలో ఆమె అసిస్టెంట్ ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.
ఆమె కాఫీ తాగుతూ రాము వైపు చూసి…
మేడమ్ : ఇప్పుడు చెప్పండి….మీ పేరు ఏంటి….ఇక్కడకు ఎందుకొచ్చారు…
రాము : నేను వచ్చింది తెలుసుకున్నప్పుడు….నా పేరు….నేను ఎందుకొచ్చానో మీకు తెలియదా….
అని నవ్వుతూ అడిగాడు.
దానికి ఆమె కూడా అందంగా నవ్వుతూ రాము వైపు చూసి….
మేడమ్ : అన్నీ తెలిస్తే మేము నేల మీద ఎందుకుంటాము….కొన్ని కొన్ని విషయాలు మాత్రం తెలుస్తాయంతే….
రాము : సరె మేడమ్….నా పేరు రాము…..నేను ఒబరాయ్ విల్లా నుండి వచ్చాను….ఆ విల్లా గురించి నాకు కొన్ని నమ్మలేని విషయాలు కొన్ని తెలిసాయి…..అవి మీకు చెబితే మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని వచ్చాను.
మేడమ్ : నా పేరు సుమిత్ర…..నేను ఇక్కడ ఆత్మలు వాటి గురించి క్లాసులు చెబుతాను….
రాము : మేడమ్…ఈ ఆత్మలు అలాంటివి నిజంగా ఉన్నాయా….
సుమిత్ర : అవి లేకపోతే మీరు నన్ను వెతుక్కుంటూ ఇంత దూరం రారు కదా రాము….
రాము : మీరు చాలా తెలివైన వారు మేడమ్….మీతో మాట్లాడటం కష్టమే….
అంటూ సహజంగా ఆడవాళ్ళను పొగుడుతూ వాళ్లను బుట్టలో పడేయడంలో ఆరితేరిన రాము ఆమె మీద కూడా పొగడ్త బాణాన్ని ఉపయోగించాడు.
దాంతో సుమిత్ర నవ్వుతూ….
సుమిత్ర : సరె….ముందు విషయం చెప్పండి….
రాము తాను ఒబరాయ్ విల్లాకు ఎందుకొచ్చిందీ…అక్కడ తాను చూసిన విషయాలు, విన్నవీ, చూసినవీ అన్నీ వివరంగా సుమిత్రకు చెప్పి రేణుక రాసిన లెటర్ తీసి ఆమెకు ఇచ్చాడు.
రాము ఇచ్చిన లెటర్ చదివిన తరువాత సుమిత్ర కూడా చాలా బాధపడింది.
సుమిత్ర : చాలా బాధ కలిగించే స్టోరీ…..
రాము : స్టోరీ కాదు మేడమ్….ఇది నిజంగా జరిగింది…
సుమిత్ర : అది అర్ధమవుతున్నది రాము గారు……(అంటూ తన చేతిలో ఉన్న లెటర్ రాముకి ఇస్తూ) అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి, ఈ లెటర్ లో ఉన్న విషయాన్ని బట్టి ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మ రేణుక ఆత్మని నలభై ఏళ్ల నుండి బంధించి….హింసిస్తున్నదా.

3 Comments

  1. Nice and Erotic updated story of Haunted movie

  2. Pls continue part 4

  3. Nice bro.. Baga hindi movie story ni copy kotesav

Comments are closed.