లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

“ఇంకా తీయగా ఉంది…..”

“ఇంకోటి కావాలా ??”

“99 బాలన్స్….” అంది.

తను నేను చూసి నవ్వుకున్నాం.

అలాగే కొంచెం సేపు గడిపి ఐస్ క్రీమ్స్ రేపు అమ్మ నాన్న వెళ్ళిపోయాక తిందామనుకున్నాము. నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళిపోయాను. స్వీటీ ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టింది.

నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి అలాగే సోఫా మీద పాడుకుండిపోయింది. తనను డిస్టర్బ్ చేయకూడదని. నెమ్మదిగా రూమ్ లోకి వెళ్లి దుప్పట్లు సరి చేసి, బయటకు వచ్చి స్వీటీ ని ఎత్తుకున్నాను.

తను నిద్రలోనుంచి లేసింది.

“పడుకో… పడుకో…. నేనే….”

చాల బరువుంది, అయినా సరే చాల కష్టపడి మోసి రూమ్ లోకి తెచ్చి బెడ్ మీద పాడుకోపెట్టాను. హాయిగా అలాగే పడుకొని ఉంది. నుదుటి మీద ఒక ముద్దిచ్చి తనకు దుప్పటి కప్పి రూమ్ లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా డోర్ వేసి బయటకు వచ్చేసి అమ్మ నాన్న కోసం ఎదురుచూశాను.

మరుసటి రోజు అమ్మ నాన్న వెళ్లిపోయారు ఊరికి, స్వీటీ నేను ఫ్లాట్ కి వచ్చాము. అటు నుంచి ఆటే ఇద్దరం షాపింగ్ కి వెళ్లి బట్టలుకొన్నాము. అక్కడే మాల్ లో లో తినేసి ఇంటికి వచ్చాము. సాయంత్రం అయింది.

అపార్ట్మెంట్ లోపలికి వచ్చాము. స్వీటీ షాపింగ్ బాగ్స్ తీసుకొని రూమ్ లో పెట్టి హాల్ లోకి వచ్చింది. నేను స్వీటీని చూసి నవ్వాను. తను చూసి నవ్వింది.

ఇద్దరం దగ్గరకు ఓచ్చము. నేను ఒక చేయి తన నడుం పై వేసి, ఇంకో చేయి తన బుగ్గ పైన చేయి వేసి అలా కిందకు నిమిరి మోహంలో చిన్న నవ్వుతో “ఈ రోజు నుంచి మనిద్దరమే ఈ అపార్ట్మెంట్ లో” అన్నాను.

స్వీటీ కూడా నవ్వి “అవును సంజు……”

“మనకి ఫుల్ ఫ్రీడమ్…..ఈ రోజు నుంచి….. ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఆపేవాళ్లు కానీ లేరు”

స్వీటీ నవ్వి “అవును సంజు…..” అంది.

స్వీటీ నాతో “సరే ఇప్పుడు ఎం చేద్దాం ??” అని అడిగింది.

“నీకు తెలీదా ఎం చేయాలో ??” అని అడిగాను.

సిగ్గు పడి తల దించుకుంది.

“ఎం సిగ్గుపడుతున్నవే…..”

“సంజు….. అలా ఎం లేదు….” అంది కానీ తన బుగ్గలు రెండు సిగ్గుతో నిండిపోయాయి.

నేను తన రెండు బుగ్గలు పట్టుకొని “చాల ముద్దుగున్నవే ఇలా సిగ్గుపడుతుంటే” అన్నాను.

మళ్ళా సిగ్గు పడిపోయింది.

“అబ్బబ ఎంత సిగ్గో…”

“మరుండద ??”

“నీ కోసం రెండు తెచ్చాను….” అన్నాను.

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.