లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – Part 4 52

“ఇంక ??”

“సంజు…..నాకిలాగే ఉండిపోవాలనుంది…… ” అంది

“hmmmm….. నాక్కూడా….”

ఇద్దరం అలాగే మాట్లాడుకుంటూ నిద్రపోయాము. ఎప్పుడు నిద్రపోయామో తెలీదు కానీ ఇద్దరం అలాగే నిద్రపోయాము.

నాకు మెలుకువ వచ్చింది, టైం చూస్తే రాత్రి 10:30…… స్వీటీని లేపాను. ఇద్దరం ఇంకా డిన్నర్ తినలేదు.

నేను లేసి హాల్ లో సోఫా మీద కూర్చున్నాను.

“సంజు ఏమైనా ఆర్డర్ చేస్తావా ఆన్లైన్ లో ??” అంది

“ఒద్దు….” అన్నాను.

తనకి అర్ధంకాలేదు.

“అర్ధం కాలేదా ??” అన్నాను.

లేదు అన్నట్లు తలూపింది.

“పాద బయటకు వెళ్లి తిందాం…..”

“ఈ టైం లోన ??”

“బాగుంటుంది….. చల్లటి గాలి…..ఐస్ క్రీం తిందాం వెళ్లి”

“సంజు నిన్నటి ఐస్ క్రీమ్స్ ఉండిపోయాయి…..”

“అయితే ఇంటికొచ్చి మళ్ళా తిందాం”

తను నవ్వి “ఒకే” అంది.

“షర్ట్ వేసుకో…..జీన్స్….” వేసుకో అన్నాను.

“బయిటకా ??”

“hmmmm…..”

“ఏమో సంజు….”

“దాని పై స్వీటర్ కూడా వేసుకో…..అప్పుడు అంత కవర్ అవుతుంది”

“ఒకే…..నేను చేంజ్ చేసుకొని వస్తాను” అంది.

స్వీటీ లోపలికి వెళ్లి జీన్స్ టీ షర్ట్ స్వీటర్ వేసుకొని వచ్చింది. స్వీటర్ పల్చగా మంచి డిజైన్ ఉన్నందువల్ల చాల క్యూట్ గా కనిపించింది.

స్వీటీ బైక్ మీద సైడ్ కి కూర్చోబోయింది.

నేను తనని ఆపి “అలా సైడ్ కి వద్దు మాములుగా కూర్చో….. నన్ను గట్టిగ కౌగిలించుకో వెనకాల నుంచి” అన్నాను.

తను వింతగా చూసింది.

“నేను బ్రేకులు వేస్తూ ఉంటాను……నీకు వెనకాల కూర్చొని ఎంజాయ్ చేయాలనీ లేదా ??” అన్నాను.

తను నవ్వి “ఒకే…..” అంది.

బైక్ లో నా వెనకాల కూర్చుంది. బైక్ ముందుకి వెళ్ళింది, నన్ను గట్టిగ వెనకాల కౌగిలించుకుంది. రోడ్ ట్రాఫిక్ లేదు కాబట్టి నేను మధ్యమధ్యలో స్పీడ్ బ్రేకర్లు లేకపోయినా కావాలని బ్రేక్స్ వేసి నడిపాను ….. ఇద్దరం చాల ఎంజాయ్ చేస్తూ బైక్ మీద వెళ్ళాము. కావాలని స్లో గానే బైక్ ని నడిపాను. ఇద్దరం బైక్ మీద అలా చల్లటి గాలిలో వెళ్తూ ఉంటె భలే అనిపించింది.

“సంజు…..ఆపు బైక్” అంది.

“చూస్తే…… చాట్ బండి….”

నేను సైడ్ కి ఆపి తనని చూసాను.

“మీకు ఈ పని పూరి పిచ్చి పోదుకదా ??” అన్నాను.

“లేదు” అని క్యూట్ గా చెప్పింది.

1 Comment

  1. Arey ఈ chetta story apara babu. Chadavaleka potunnamu. Inka neeku ఏమి stories dorakalada.

Comments are closed.