స్వీయ మత్తు 152

అన్యమనస్కంగా నే స్నానం చేసి వచ్చి డైనింగ్ టేబల్ మీద కూచొని పెద్దగా శబ్దం చేసింది లాలస.
మదాలస కూల్ గా భోజనం వడ్డించి ఎప్పుడు తిన్నవో ఏమో? నువ్వు అన్నం తింటూ ఉండు నేను అన్నీ చెబుతా ఉంటాను.
లాలస కరిగిపోయింది ఆమె ఆప్యాయతకు, కణ్ణీళ్ళు ఉబుకుతుండంగా గబగబ నాలుగు ముద్దలు తిని తేలిక బడింది.
లాలసనే చూస్తున్న మదాలస ఎందుకే నీకు అంత ఆవేశం అంతా మీ నాన్న పోలికే నీకు అంటూ ఇంకా చారు పోసి అందులో కొద్దిగా నేయినివేసింది.
లాలస ఇంకేం మాట్లాడకుండా ఏదో తిన్నాననిపించి లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి కూచొంది ఇక చెప్పమన్నట్లుగా . . . . .
మదాలస :- ఇప్పుడే చెప్పమంటావా లేక ఉదయం మాట్లాడుకొందామా అంది ఉడికిస్తున్నట్టుగా మదాలస.
అమ్మ వైపు ఉరిమి చూసింది లాలస.
మదాలస నవ్వుతూ. . . సరె, సరేలే అంత ఎక్కిళ్ళు పడనవసరం లేదు, చెబుతా గా. . .చెప్పే ముందు నీవు ఏం అడగాలనుకొన్నావో అన్నీ అడిగేయ్
లాలస అదే తడవగా నీవు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ద పడుతున్నావని తోవన్ చెప్పాడు, నిజమేనా ఇంతకీ తోవన్ ఎక్కడ ? వాడు కనిపించడం లేదు అంది చుట్టూ చూస్తూ
తన చేతుల్ని చేతుల్లోకి తీసుకొంటూ వాడు ఇప్పట్లో రాడుగాని వాడు చెప్పింది నిజమేనే అంది
అమ్మా అంది భరించలేనట్టుగా లాలస
మదాలస :- నువ్వు సినిమాల్లో మాదిరి కేకలేయడం మానేసి సాంతం విను.
ఏంటే వినేది? నాన్న చనిపోయి పదిహేనేళ్ళ పైగానే అవుతోంది ఇన్నేళ్ళూ లేని ఆలోచన ఇప్పుడెందుకొచ్చిందంట? అదీ గాక ఇప్పుడు నేను కూడా నా కాళ్ళ మీద నిలబడ్డనుగా రేపో మాపో వాడుకూడా ఏదో ఒక జాబ్ లో చేరనే చేరుతాడు.నిన్ను పోషించుకోవడానికి మా ఇద్దరి సంపాదన చాలదా లేక మరచి పోయిన వయసు ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ ఆవేశపడిపోయింది.
మదాలసకు కన్న కూతురు అన్న మాటలకు కోపం వచ్చినా నిభాయించుకొంటూ నీవు అడిగిన ప్రశ్నలోనే జవాబూ ఉంది లాలూ . . .నువ్వు శాంతంగా ఉంటానంటే నేను మాట్లాడతా, లేదంటే నీ ఇష్టం, నా నిర్ణయం మార్పుండదు.అంటూ లేచి వెళ్ళిపోయింది మదాలస.
లాలసకు తల కొట్టేసినట్లయ్యింది.అమ్మ ఎంత మొండిదో తన చిన్న తన నుండీ చూస్తున్నదే. . .కాని ఈ లేటు వయసులో రెండో పెళ్ళి చేసుకోవాలనే ఆమె నిర్ణయం ఎందుకొచ్చిందో ఏంటో అనుకొని కాసేపాగి మెల్లగా లేచి అమ్మ గదిలోనికెళ్ళింది.
బెడ్ మీద తన ప్రక్కనే కూచొని మౌనంగా ఉండి పోయింది. అలా కూచోవడం వల్ల తనకు తెలియకుండానే కన్నీళ్ళు ధారగా కారసాగాయి.
లాలసను అలానే దుఖః పడనిచ్చి మదాలస కూడా చాలా సేపటివరకూ కాం గా ఉండిపోయింది.
రాత్రి పదవుతోండగా తోవన్ వచ్చాడు. వచ్చీ రాంగానే అమ్మ గదిలోనికి తొంగి చూసి ఎప్పుడొచ్చావే అంటూ పలకరిస్తూ వాకిట్లోనే నిలుచున్నాడు.
లాలస తల ఎగురవేసి ఇంత సేపటి వరకూ ఎక్కడ తిరుగుతున్నవురా? అమ్మ ఒకతే ఉంటుందని నీకు తెలీదూ?

1 Comment

Comments are closed.