స్వీయ మత్తు 152

ఈ లోగా తోవన్ క్రోధం తో విరుచుకు పడ్డాడు వారి మధ్యలోకి.వచ్చీ రాంగానే అలా అని ,మాతో సరి సమానంగా తగుదునమ్మా అని పెళ్ళికూతుర్లా పెళ్ళి పీటల మీద కూచొంటావా ? శోభనం చేసుకొంటావా? . . .చేసుకొని పిల్లల్ని కను . . .అటు దాని , ఇటు నీ పిల్లలని ఎత్తుకొని మొండి ముండావాడిలా ఊళ్ళో తిరుగుతాను. థూ . . సిగ్గుండాలి అంతగా కొట్టుకొంటూ ఉంటే ఎవడినైనా చూసుకోవచ్చుగా ? మమ్మల్ని చంపడమెందుకూ అంటూ ఇంకా ఏదో మాట్లాడే అంతలోపునే లాలస లేచి చెంప చెళ్ళమని పించింది.
దెబ్బకి దిమ్మ తిరుగుతూఉంటే చెంప అదిమిపెట్టుకొని వెళ్ళిపోయాడు వాడు.

వాడటు వెళ్ళిపోగానే ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మౌనంగా కూచుండిపోయింది లాలస.మదాలస మాత్రం ఇవేవీ తనకు పట్టవన్నట్టు నింపాదిగా ఏదో పుస్తకం చదువుతూ ఉండిపోయింది.
లాలస ఆ నిశ్శబ్దం భరించలేకపోతోంది.
చివరకు లాలసే నోరు విప్పుతూ ముందుకేం చేయాలనుకొంటున్నావమ్మా. . .తోవన్ ఆవేశ పడ్డా అడగాల్సింది అడిగేసాడు.కాని నా పరిస్థితి అలా కాదే . . .నీవు తగుదునమ్మా అంటూ ఇంకో పెళ్ళి చేసుకొంటే రేపు నన్ను ఎవడు పెళ్ళి చేసుకొంటాడు?. వాడికి పిల్ల నెవరిస్తారు? అదీ కాకుండా వాడన్నట్టుగా నీకు పిల్లలు గనుక అయితే, వాళ్ళ పరిస్థితేంటి?
మదాలస తీక్షణంగా చూస్తూ ఆ విశయాలు నేను ఆలోచించుకోలేదనుకొన్నావా? మీరు నన్నో శత్రువులా కాకుండా మామూలుగా అడిగితే ఈ విశయాలన్నీ మీతో పంచుకొని మీ నిర్ణయం కోసం ఎదురు చూసేదాన్ని.అలాంటి అవకాశమే మీరు ఇవ్వట్లేదు. ఇక నన్నేం మాట్లాడమంటారు?
ఇప్పుడడుగుతున్నా కదమ్మా చెప్పు, నీవు ఏం చేయాలనుకొంటున్నావు ?
సరే వాడిని కూడా పిలు, అన్నీ మాట్లాడుకొందాం అంటూ లేచి వెళ్ళి అలమారాలో కొన్ని ఫోటోలను తెచ్చి ముందర పెట్టుకొంది.
అక్క పిలుపుతో బిత్తర చూపులు చూస్తూ మెల్లగా గదిలోనికొచ్చాడు తోవన్.
మదాలస ఇద్దరినీ ఉద్ద్యేశించి మాట్లాడుతూ చూడండి పిల్లలూ మీరు ఎదగడానికి సరిపదా ఆసరా అందించాననే అనుకొంటున్నాను. మీరు అనుకొని అపార్థం చేసుకొంటున్నట్లుగా నేనేమీ రెండో పెళ్ళి చేసుకోవాలనుకోవడం లేదు.నా సెకండ్ ఇన్నింగ్స్ లో నన్ను కనిపెట్టుకొని ఉంటానికి ఒక తోడు కావాలి కాబట్టి మనకు తెలిసిన ఆయనతో లివింగ్ టుగెదర్ అంటే కలిసి జీవించాలని అనుకొంటున్నాను. ఆయన వివరాలు తరువాత చెబుతాను. కాని మీరు అర్థం చేసుకోగలమంటే మాత్రం ఒక్క విశయం సూటిగా చెబుతాను.
చెప్పమ్మా అన్నారిద్దరూ కూడబల్లుకొన్నట్లుగా
నాకు ఊహ తెలిసినప్పటినుండీ నాకు అన్నీ అవమానాలే ఒంటరి తనమే, మీ నాన్న తో పెళ్ళి చేసుకొన్న ఆ ఐదారేళ్ళు మాత్రం నా జీవితం లో సుఖపడ్డాననిపించింది. అంతలోనే మీ నాన్నా వెళ్ళిపోవడం మళ్ళీ నేను ఒంటరి దాన్నయిపోవడం జరిగిపోయింది.మళ్ళీ మిమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి మళ్ళీ ఈ ఇరవై ఏళ్ళలో నాకు ఓ మనసంటూ ఉందని ఎప్పుడూ గుర్తుకు రానే లేదు.ఇలా జీవితాంతం నేను ఒంటరి తనం తోనే ఉండాలా? ఈ ఒంటరి తనంతోనే చనిపోవాలా?
అక్కా తమ్ముళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేకపోయారు.

1 Comment

Comments are closed.