స్వీయ మత్తు 152

లక్కీగా అయనింట్లోనే ఉన్నాడు వెళ్ళీ వెళ్ళంగానే నిన్నట్లా కాకుండా నింపాదిగా కుశలప్రశ్నేలేసింది.
ఆయన కూడా చాలా మామూలుగా ఏమీ జరగనట్లుగా మాట్లాడి మర్యాద చేసాడు.
ఆయనతో విశయం ఎలా కదపాలా అని ఆలొచిస్తూ ఉంటే ,,ఆయనే కల్పించుకొంటూ “ ఏమే లల్లూ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా ? అని అడిగాడు.
లాలసకు ప్రాణం లేచి వ్చ్చినట్లయ్యింది ఆ మాటతో , , , ఎక్కడా గ్యాప్ ఇవ్వ కుందా నిన్న జరిగిందంతా పూస గుచ్చినట్లుగా చెప్పి ఇది మీకు భావ్యమా అంకుల్ . . .మీరిద్దరూ ఇలా చేస్తే మా గతేం కాను చెప్పండి అని నిలదీసింది అయన దగ్గరున్న చనువుతో. . .
దానికి ఆయన చాల తేలిగ్గా నవ్వేసి ,మీకు అలా అర్థం అయ్యిందా?. . .మీ అమ్మ ఒకతి ఏం చెప్పలనుకొంటుందో సూటిగా చెప్పడం రాక మిమ్మల్ని ఇలా ఇరకాటం లో పడవేసింది. నిజానికి జరిగిందేమిటంటే, మాలా ఒంటరిగా ఉన్నవారు రేపు పిల్లల నిర్లక్ష్యానికి గురయ్యి ఏ వృద్ధాశ్రమంలో చేరేకన్నా ఒకరికొకరు తోడుగా ఉంటే సమస్యే ఉండదు కదా అని అన్నా దీనికి మీ అమ్మ అలా భాష్యం చెప్పుకొంది. నువ్వేమీ కంగారు పడవద్దు. సాయంకాలం నేను వచ్చి మాట్లాడతా, మీ అమ్మ మనసులో ఏముందో అప్పుడు తేల్చుకొందాము. అంత వరకూ మీరు నింపాదిగా ఉండండి అంటూ తనని సాగనంపాడు.

సాయంకాలం వరకూ కాలు గాలిన పిల్లిలా ఇంటిలోనే తిరుగుతూ ఉండిపోయింది లాలస.అటు తోవన్ కూడా ఆఫీసులో సరిగ్గా మనసు పెట్టి పని చేయలేకపోయాడు.
సాయంకాలం అయ్యేతప్పటికీ అమ్మ, సుషేణ్ రావు గార్లిద్దరూ సరాసరి ఇంటికొచ్చారు.
వారిద్దరి రాక చూసి లాలస కొయ్యబారి పోయి చూస్తూ ఉండిపోయింది.
మదాలస ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి లాలస మొహాన నవ్వు పులుముకొని ఆయనకు కాఫీ ఇచ్చి కూచోబెట్టింది. ఈ లోగా తోవన్ వచ్చాడు.రావు మొహం చూడగానే ఎన్నో భావాలతో లాలస వంక చూసి వెళ్ళాడు.
కుశల ప్రశ్నలయ్యాక నేరుగా రావు గారే టాపిక్ లోనికొస్తూ, చూడండి, మీరు అపార్థం చేసుకొన్నట్లుగా మీ అమ్మా ,నేను పెళ్ళి లాంటివేం చేసుకోవడం లేదు.ఇంతకు మునుపు ఎలా ఉన్నామో అలానే ఉంటాము. పూర్తిగా చేతగాని వయసులో ఇబ్బందులు పడే దానికన్నా ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే మాలాంటివారందరూ ఎవరెక్కడుండాలో నిర్ణయించుకోవడం జరుగుతుంది అంతే.ఇదే విశయాన్ని మీ అమ్మ మీతో చెప్పే ప్రయత్నం చేసింది గాని మీరే అర్థం చేసుకోకుండా గందరగోళం లో పడ్డారు. అంటూ ఆగాడు.
తోవన్ ఇక ఉండబట్టలేకపోయాడు.ఏంటండీ ఇందాకటి నుండీ చూస్తున్నాను.అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు.మా అమ్మను మేము చూసుకోలేమా? మీకంటూ ఎవరూ లేరు కాబట్టి మీరు అలా ఆలోచించినా అర్థం ఉంది గాని ,మా అమ్మకు మేమున్నాము, మీరు అనవసరంగా ఇన్వాల్వ్ కావద్దు అంటూ ఆవేశపడ్డాడు.
మదాలస వాడిని వారిస్తూ ఒరే చిన్నూ, ఆగరా, నీవు ఆవేశపడిపోయి మమ్మల్ని కంగారు పెట్టొద్దు.ఈ ఆలోచన కేవలం ఆయనది కాదు, మాలాంటి మధ్య వయస్కులందరినీ ఇబ్బంది పెట్టేదే,, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఆలఒచనలెందుకొస్తాయి చెప్పు ?.
అమ్మ అలా ఆయన్ను వెనకేసుకొని రావడం తో తోవన్ కు షివరింగ్ వచ్చేసింది. అక్క వైపు చూసి చూసావే అమ్మ ఎలామాట్లాడుతోందో?
లాలస వాడిని శాంతంగా ఉండమని చెప్పి అందరినీ కలయ జూసి అమ్మా అంకుల్ ఇంతకీ మీ పాయంటేమిటో నాకు అర్థం కావట్లేదు. మీరిద్దరూ మీ విశయాల్లో ఒక క్లారిటీ ఇస్తే గాని ఈ గొడవ ఆగదు.
మదాలస సుషేణ్ రావు గారి వంక చూసి నేను చెబుతా అంది.
చూడు లాలూ, చిన్నూ గాడికి పెళ్ళి చేసిన తరువాత వాడి నెక్స్ట్ డెస్టినేషన్ ఏ అమెరికానో? లండనో ? ఎవరికి తెలుసు? అలా వాడు వాడి దారిన వెళుతూ నువ్వూ రామ్మా అంటే ఊరుగాని ఊళ్ళో నేను వెళ్ళి చేసేది ఏముంటుంది? పైగా నాదో భారం వాళ్ళకు.అదే విధంగా నీకూ పెళ్ళి చేసేస్తే నీ సంసారం నీదవుతుంది కదా.తరువాత నన్ను కనిపెట్టుకోవడానికి ఎవరుంటారని? అదే విధంగా మీ అంకుల్ కూడా ఇలానే ఆలోచిస్తుంటారు కదా .అందువల్లే ఈ నిర్ణయం.దీని వల్ల మానసికంగా ఒక ధైర్యం ఉంటుంది మాకు అంటూ మరింత విశ్లేషణ చేయబోతుండగా

1 Comment

Comments are closed.