స్వీయ మత్తు 152

మదాలసే కల్పించుకొంటూ మిమ్మల్ని భాధపెట్టాలనో లేక మిమ్మల్ని తక్కువ చేసి నాకు దూరం చేసుకోవాలనే తలంపు నాకు లేదు. మీరూ కల్పించుకోవద్దు . ఎప్పట్లా మీరు నాతోనే ఉండాలి ,,కాకపోతే ఆయన మనింటికి నేను ఆయనింటికి రావడం పోవడం జరుగుతుంది అంతే. ఆయనకు కూడా నా అన్న వాళ్ళెవరూ లేరు ఒంటరి వాడు.సంఘంలో మంచి పేరున్న వారు. అన్నీ ఆలోచించి ఒకరి గురించి ఒకరు తెలుసుకొన్న తరువాత నే ఈ నిర్ణయం తీసుకొన్నాము. మలి వయసులో ఏ వృద్ధాశ్రమంలో చేరేకన్నా ఇలా ఒకరికొకరు తోడుగా ఉంటం మంచిదని అనుకొన్నము.అంతే కాని మీరు ఎత్తి పొడిచిఉనట్లు ఒళ్ళు కావరమెక్కి కాదు.
అమ్మ అంత గట్టి నిర్ణయం తీసుకొన్నాక తాము చేసేదేమీ లేదని తెలిసిపోయింది ఇద్దరికీ. . .అంతే కాకుండా ఊళ్ళో తమ పరువు ప్రతిష్టలకు సంభందించి అన్ని జాగ్రత్తలూ తీసుకొంది కాబట్టే ఇంత ధైర్యంగా ఉండగలుగుతోందని అర్థం అయ్యింది. కాకపోతే ఇద్దరికీ అర్థం కాని విశయం ఒక్కటే.రక్తం పంచుకు పుట్టిన తమ మీద తనకు ఎందుకు నమ్మకం కోల్పోతోందో అర్థం కాలేదు.
తోవన్ కంప్లైంట్ చేస్తున్నట్టుగా అక్కా,, ఆ ఆకాశవాణి సింగర్ సుసేణ్ రావంకుల్ ఉన్నాడే ! ఆయనే దీనికంతటికీ కారణం.రోజూ సాయంకాల్లో వచ్చి ఏవేవో పిచ్చి పాటలు పాడి అమ్మను తన వైపుకు తిప్పుకొన్నాడు.
అవునా అన్నట్లుగా లాలస చూసింది మదాలస వైపు.
అవునే ఆయనే అన్నట్లుగా తల ఊపింది మదాలస.
సుసేణ్ రావు అంటే చిన్నప్పటినుండి తనకు వల్ల మాలిన అభిమానం లాలసకు ,ఇంట్లో ప్రతీ చిన్న అవసరానికీ సొంత మనిషిలా అదుకొనేవాడు. గిరిజాల జుత్తుతో ఎప్పుడూ ఏదో ఒక పాటను హమ్మింగ్ చేసుకొంటూ తన చుట్టొ ఉన్న వాళ్ళను నవ్విస్తూ ఉండే వాడు. తనకు తెలిసీ ఆయనను ఇష్టపడని వారు ఎవ్వరూ లేరు తమ కాలనీలో.ఎప్పుడూ హద్దు మీర కుండా తన హద్దుల్లో ఉంటూ ఉండే వాడు . ఆయన భార్య కూడా అందరితో కలుపుగోలుగా ఉండేది. ఎప్పుడైతే ఆవిడ చనిపోఅయిందో అప్పటి నుండి ఆయన ఎవరినీ అంతగా కలిసే వాడు కాదు. కాని చిన్న పిల్లలెవ్వరైనా కనిపిస్తే మాత్రం ముద్దు చేసే వాడు. అలా అయన చేతుల్లో పెరిగిన వారే తామిద్దరూ,,, అటువంటి ఆయనకు ఈ రకమైన ఆలోచన ఎందుకొచ్చిందో? ఇలా ఆలోచించుకొని అటువైపు నుండి నరుక్కు రావాలని నిర్ణయించుకొంది లాలస.
మదాలస చెప్పడానికి ఇంకేం లేదన్నట్లుగా పోండ్రా వెళ్ళి పడుకోండి , మళ్ళీ ఉదయం నాకు బోల్డంత పనులున్నాయని చెప్పి ముసుగెట్టేసింది.
లైట్లు కట్టేసి లాలస తోవన్ ఇద్దరూ గది బయటకొచ్చి లాన్లోనికొచ్చారు. సముద్రపు చల్లటి గాలి వారిని రిలాక్స్ చేస్తున్నట్లుగా తడిమి వెళ్ళిపోతుంటే తోవన్ అక్కా చూసావా అమ్మ ఎంతకు తెగించిందో అన్నాడు/
వాడిని ఎలా సముదాయించాలో తెలీనట్లుగా లాలస ఏమీ మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉండిపోయింది.
తోవన్ మాత్రం అమ్మ తమకు ఎక్కడ దూరమయిపోతుందో నన్న కంగారులో ఏదేదో మాట్లాడుతున్నాడు.
అలా వారిద్ధరి మధ్య ఆ రాత్రి ఒంటరిగా జారుకొంది.
ఉదయం లేవ గానే ఎప్పట్లా అమ్మ తన పనులకు వెళ్ళిపోయింది. తోవన్ కూడా రెడీ అవుతూ అక్క వైపు చూస్తూ , ఎలా అయినా ఈ ఉపద్రవాన్ని ఆపవే భరించలేకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు.
వాడటు వెళ్లంగానే సుసేణ్ రావు ఇంటికి వెళ్ళింది లాలస.

1 Comment

Comments are closed.