స్వీయ మత్తు 152

తోవన్ :- నిన్న మొన్నటి వరకూ ఇంటి పట్టునే ఉండే వాడిని, ఇప్పుడావిడకు మన అవసరం లేదులా కనిపిస్తోంది అందుకే లేటుగా వచ…. .అంటూ నిర్లక్ష్యంగా జవాబిచ్చి తన గదిలోనికెళ్ళిపోయాడు.
వాడు చెప్పిన సమాధానానికి లాలసకు ఇంట్లో ఏం జరుగుతోందనని ఊహించడానికి ప్రయత్నం చేస్తూ మదాలస వైపు చూసింది.
ఇక లాభం లేదన్నట్లుగా మదాలసే కల్పించుకొని చూడు లాలూ నీవు పెద్ద దానివని నీకు చెబుదామని వెయిట్ చేసాను.ఈలోగా వీడే నన్ను అపార్థం చేసుకొని నీకు ఫోన్ చేసి ఇలా రప్చర్ చేసాడు. వాడి సమాధానం విన్నావుగా . .ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడో?
లాలస మౌనంగా ఉండి పోయింది.
నీకు తెలిసినట్టుగా నీ చిన్నప్పటి నుండి నేనెప్పుడైనా తప్పడడుగు వేసినట్లు నీకనిపించిందా?
లాలస :-లేదు.
పోనీ అప్పట్లో రెండో పెళ్ళి చేసుకొని ఉండి ఉంటే , మీరు ఇప్పటికి సర్దుకొని ఉండే వారు కాదా?
లాలస :-అవును
రెండిట్లో దేనికీ అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని ఓ దారికి తేవడానికి ఒంటరి ఆడదాన్ని , నేను ఎంతగా కష్టపడి ఉంటానో నీకు అర్థం అవుతుందిగా ?
లాలస:-అవును
మీ నాన్నది నాది ప్రేమ వివాహం కావడంతో రెండు వైపుల నుండీ ఎటువంటీ సపోర్ట్ లేదని నీకు వాడికీ స్పష్టంగా తెలుసునా కదా. . .అంతెందుకు నీవు పెద్ద మనిషయినప్పుడు కార్యానికి స్నేహితులు తప్ప చెప్పుకోవడానికి ఒక్క బందువైనా వచ్చాడా ?
లాలస:- లేదు
మరి ఈ పరిస్థితుల్లో రేప్రొద్దున మీకు పెళ్ళై మీ కాపురాల్తో సుఖంగా ఉంటే వయసు ఉడిగిన తరువాత నన్ను ఎవరు చేరదీసి ఇంత అన్నం పెడతారు చెప్పగలవా?
లాలసకు చెళ్ళున తగిలింది ఆ అమాటకు. . .బేలగా చూస్తూ మేమున్నాం కదమ్మా అంది గాద్గికంగా
మదాలస తల అడ్డంగా తల తిప్పుతూ మీ నాన్న పెన్షనుతోనే మిమ్మల్ని సాకలేదే సూపర్ మార్కెట్లలో సీఫుడ్ అమ్మి, నానా గడ్డి కరచీ మిమ్మల్ని ప్రయోజకులను చేసాను, నా పెంపకంలో మీమీద నాకు ఎటువంటి కంప్లైంట్సూ లేవు. కాని ఆ వచ్చే అల్లుడు గాని కోడలు గాని నన్ను చూసుకోవడంలో ఏదైనా తేడాలు చూపిస్తే అప్పుడు మీరు మాత్రం చేసేదేముంటుంది చెప్పు?
అదీ గాకుండా నా ఇరవై ఐదేళ్ళ వయసులో మీ నాన్న పోయే సమయానికి ఇద్దరు పసి కందులను చేతిలో పెట్టుకొని ఆసరా కోసం తిరగని గడప లేదు తొక్కని గడపలేదు. ఈ ఇరవై ఏళ్ళూ ఒక ఆడ దానిగా ఒంటరి తనం తో ఎంత నరకం అనుభవించి ఉంటానో నువ్వు అర్థం చేసుకొగలవు కదా . . .అందుకే ఈ నిర్ణయం. ఎటూ మీరు మీ కాళ్ళ మీద నిలబడ్డానికి కావల్సిన ఆసరా ఇచ్చాను. ఇకపై నా గురించి నేను ఆలోచించుకోవాలి కదా
లాలసకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

1 Comment

Comments are closed.