అమృతం కురిసిన రాత్రి 1606

అమృత కి కొంచెం కోపం వచ్చింది…ఎందుకా నవ్వు …నా పరిస్తితి చూసి నవ్వొస్తుందా మీకు…అర్జున్ ” అలా కాదండీ ….ఉన్నది ఉన్నట్టు చెప్పచ్చు గా …ఎందుకు ఏదో చెప్పి కవర్ చేయడం..”
అమృత “ఉన్నట్టు చెప్పాలా…ఏమనీ…నేను ఎవరో ముక్కూ మొహం తెలియని వాడితే …ఏదో పాడుబడ్డ ఇంట్లో ఉన్నానని చెప్పాలా…..ఫ్రెండ్ దగ్గర ఉన్నా అంటేనే అలా తిడుతుంటే…”
అర్జున్ : “హ్మ్మ్ కరెక్టే…అయినా ఇందులో మీ తప్పేముంది చెప్పండి … కలగన్నామ…ఇలా చిక్కుకుంటాము అని..”
అమృత : అది అందరూ అర్థం చేసుకుంటారా…మా కష్టాలు మీకేం తెలుసు లే…
అర్జున్ : మీకు జాబ్ అంటే అంత ప్యాషన్ ఆ …ఈ వెదర్ లో ఆఫీస్ కి వచ్చారంటే అలానే అర్థం అవుతుంది…

అమృత : హ్మ్మ్ ప్యాషన్ కంటే గత్యంతరం లేని స్థితి …నేను పని చేస్తే గాని నా కుటుంబం రోడ్డున పడకుండా ఉంటుంది ….లేకుంటే మా ఆయన సంపాదన మీద పూట కూడా తినలేము ….పేకాట తాగుడు …లేని అలవాటు లేదు ….నాలుగు రాళ్లు సంపాదించి నా పిల్లలు సుఖంగా ఉంటే చాలు అనుకునే స్వార్థం నాది….దాని కోసమే ఈ గొడ్డు చాకిరీ…
అర్జున్: ఐ యాం సో సారీ అమృత గారు మీ గురించి తెలీకుండా ఏదో అన్నాను…
” ఇట్స్ ఓకే ఇందులో మీ తప్పేముంది అంతా నా తలరాత…”
” మరి మీ సాలరీ సరిపోతుందా…ఇల్లు నడపడానికి…”
” ఇంకో ఊరు అయితే సరిపోయ్యేది ఏమో …ఈ పాడు ఊరిలో అడ్డెలెక్కువ అగ్గిపెట్టె అంత ఇల్లైనా….మళ్లీ పాలవాడు…కరెంట్ బిల్లు సరుకులు స్కూల్ ఫీజులు…అన్ని పోగా సేవింగ్స్ ఏమి మిగలదు …”
” మరి వేరే జాబ్ చుస్కోవచ్చు కదండీ …అంతా అడ్జస్ట్ అవడం ఎందుకు …”
” ఆ నేను పెద్ద కలెక్టరు చదువు చదివానని ఇస్తారు ….నాకీ జాబ్ ఉండడమే ఎక్కువ…”
” హ్మ్మ్ మీరు ట్రై చేయండి అపుడు కదా తెలిసేది…”
“చెప్పడానికి బాగానే ఉంటుంది …ఉన్నది కూడా పోతే నన్ను ఎవరు ఆదుకుంటారు…”
” ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి…మీకు అభ్యంతరం లేకుంటే మా కంపెనీ లో కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి…మీరు అప్లై చేస్తే నా సాయం నేను చేస్తాను..”
” అక్కర్లేదు… నా కాళ్ళ మీద నేను నిలబడగలను…”
” అబ్బ మీ క్వాలిఫికేషన్ బట్టే ఇప్పిస్తాను అండి …మీరింకా నన్ను అపార్థం చేసుకుంటూనే ఉన్నారు…”
” అయినా ను సౌత్ బాంబే అనగానే అనుకున్న బాగా రిచ్ అని…కంపెనీ ఉందంటున్నారు … ఇంకెందుకు నాకు సాయం చేస్తారు ఊరికే…ఏదో స్వలాభం కోసం చేస్తారు…”
” నాకు మీలాంటి వాళ్లకు హెల్ప్ చెయ్యడం ఇష్టమండి…మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నపుడు మా అమ్మ నా కోసం పడ్డ కష్టాలు గుర్తొచ్చాయి ….”
” ఓహ్ ….అవునా …మరి మీ అమ్మగారు ఇపుడు ఎలా ఉన్నారు …ఇంత ఆస్తి ఉన్నాక ఏముందిలే హాపీగా ఉండింటారు…”
” ఇంత ఆస్తి సంపాదించింది మా అమ్మే …కని తను మాత్రం ఈ లోకం లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయింది….మా నాన్న ఆ డబ్బంతా అనుభవిస్తూ నాకు సవతి తల్లి ని తెచ్చి …మా అమ్మ పడ్డ కష్టాన్ని దుబారా చేస్తూ ఉంటాడు….నేనేమో ఇలా….”
” ఓహ్ ఐ యాం సారి అర్జున్ …..మీ అమ్మగారు ఎక్కడున్నా నిన్ను చూసి గర్విస్తుంటది లే …బాధపడకు…..అయితే మీ నాన్న నిన్ను సరిగ్గా చూడరా….”
” అమ్మ లేనప్పటి నన్ను ప్రేమ గా చూసేవాళ్లు లేరు ….ఎంతసేపు నన్ను కట్టుకుని నా ఆస్తి కొట్టేయాలనుకునే వాళ్ళే….ఇంత డబ్బు ఉన్న. పుట్టెడు ప్రేమ దొరకని అభాగ్యుడిని…” అని కళ్ళ వెంబడి వచ్చిన కన్నీరు తుడుచుకున్నాడు…
అమృత అస్సలు బాగోలేదు అనిపించింది ….పాపం తనని పూర్తిగా అపార్థం చేసుకున్నాను అనిపించింది….వెంటనే లేచి తన పక్కన వెళ్లి కూచుని మొదటిసారి తన ఒంటి మీద చెయ్యి వేస్తూ …..భుజం పై చేయి వేసి ….” హేయ్ ఐ యాం సారీ….నీ పెయిన్ తెలీకుండా ఏదో అనేశాను….ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ….బాధపడకు …నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే వారు త్వరలోనే నీకు దక్కుతారు …నీ లాంటి మంచి వాడికి దేవుడెప్పుడు అన్యాయం చేయడు… సంథింగ్ మోర్ గుడ్ ఇస్ వెయిటింగ్ ఫర్ యు….బీ హ్యాపీ ” అని మనసారా ఓదార్చింది….. యాదృచ్చికత అంటే ఇదే….ఇద్దరు ఒకేరకమైన బాధల్లో ఉన్న వ్యక్తులను అనుకోని సంఘటనలతో ఒకే పైకప్పు కింద చేర్చడం… ఈ రోజు అమృత అర్జున్ లు విధి ఆడిన వింత ఆట లో ఒక రాత్రి ఒకే ఇంటిలో గడపాలని రాసిపెట్టింది….

వర్షం ఇంకా పడుతూనే ఉంది అప్పు డప్పుడు ఉరుముల శబ్దం వినిపిస్తూనే ఉంది …అమృత అర్జున్ పక్క పక్కనే ఉన్నారు….వేసిన అగ్ని సమిధ కూడా బుడిదైపోతుంది….చీకటి పడకుండా అర్జున్ క్యాండిల్ వెలిగించాడు….ఇద్దరు మనసు విప్పి ఒకరి కష్టాలు ఒకరి తెలుసు కుని ఒదార్చుకున్నారు …మంచి స్నేహం వారి మధ్య చిగురించింది…అర్జున్ అమృత లో అమ్మ వాత్సల్యం చూసుకున్నాడు….అమృత. అతని లో సహాయం చేసే ఆపన్న హస్తం చూసుకుంది…

1 Comment

  1. Ganti subrahmanyam

    Suppr

Comments are closed.