అమృతం కురిసిన రాత్రి 1608

ఆగస్టు..2017…ముంబై… బోరివలి ఏరియా….మధ్యాహ్నం మూడు గంటలు….రెడ్ ఎఫ్ఫెం వింటూ పని చేస్తుంది 38 ఏళ్ల అమృత తన ఆఫీస్ క్యుబికిల్ లో…

అర్జే : హెలో ముంబై….అభీ అభీ ఖబర్ ఆ రహా హై కి తూఫాన్ ఏక్ గంటే మే కోస్ట్ క్రాస్ హోకే .. బడీ బారిష్ హోయేగా…తో ఆప్ లోగ్ జల్దీ ఘర్ జయియే …లేకిన్ రెడ్ ఎఫెం సుంతే రహియే……(ఇప్పుడే వచ్చిన వార్త ప్రకారం ఇంకో గంటల్లో తుఫాన్ తీరం దాటి.భారీ వర్షం. పడే సూచన ఉంది ..అందుకే ఇవాళ ఇంటికి త్వరగా వెళ్ళండి..వింటూనే ఉండండి రెడ్ ఎఫెం..)

కానీ అమృత ఆ ప్రకటనను పెడ చెవిన పెట్టింది…తను ఫినిష్ చేయాల్సిన పని ఇంకా ఉంది…ముఖ్యమైన ఫైల్స్ ఇవాళా క్లియర్ చేస్తే తన టార్గెట్ పూర్తవుతుంది….అప్పటికే కొంత మంది కలిగ్స్ ఇంటికి స్టార్ట్ అయ్యారు…. బాస్ కూడా అందరికి పర్మిషన్ ఇచ్చేశాడు….కానీ అమృత ఇంకో అరగంట ఆగి వెళ్దాము అనుకుంది…

బాస్ : హేయ్ అమృత యు ఆర్ స్టిల్ హియర్…మూవ్ ఆన్
అమృత : ఎస్ సర్… జస్ట్ 30 మినిట్స్… విల్ గో
బాస్ : ఓకే..బట్ గో సూన్ …యు కెన్ వర్క్ టుమారో… ఇట్స్ గెట్టింగ్ డార్క్….
అమృత : ఓకే సర్…

అమృత అలా చేయడానికి బలమైన కారణం ఉంది…తనకి ఈ ఉద్యోగం ప్రాణం కన్నా మిన్న …తెలుగు రాష్ట్రం నుండి వలస వచ్చి మంచి జీవితం కోసం ముంబై లో స్థిర పడ్డ మధ్య తరగతి కుటుంబం…బోలెడు ఆశలతో ఊరుగాని ఊరు వచ్చి ఇరుక్కుపోయిన వనిత… రాను రాను తన మొగుడు చక్రవర్తి సంసారం బాధ్యత పూర్తిగా వదిలేసి వచ్చీ రాని జీతం ఉన్న ఉద్యోగం టైం పాస్ కి చేస్తుంటే …ఓపిక నశించిన అమృత తాను చదువుకున్న చదువు కు తగ్గ ఉద్యోగం వెతుక్కుని ఇద్దరి పిల్లలు మంచి పొజిషన్ లో ఉంచాలని మంచి స్కూల్లో చేర్పించి తాను గాడిద చాకిరీ చేస్తుంది….మధ్య తరగతి నుండి కొంచెం పైకి ఎగబాకలని తన సంతోషాన్ని పక్కన పెట్టి ఈ మహానగరంలో నిరంతర సమరాన్ని కొనసాగించింది….

మెల్లగా మబ్బులు కమ్ముకుంటున్నాయి…హోరు గాలి మొదలయింది…ఉరుములు సవ్వడి చేస్తున్నాయి….ఇక చుట్టూ చూస్తే ఆఫీస్ లో ఒకరిద్దరు మినహాయించి అందరూ వెళ్ళిపోయారు ….ఇక తను వెళ్లడమే సేఫ్ అనుకుని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఆఫీస్ బిల్డింగ్ నుండి కిందకి వచ్చింది …అప్పటికే జోరున వాన అందుకుంది ….ఎదుటి మనిషి కనపడని చందంగా జల్లు కమ్మేసింది…

అమృత కి గుండెల్లో దడ పుట్టింది ఆ వర్షం చూసి..అసలే చౌక అని దూరం లో ఇల్లు రెంట్ కి తీసుకుంది….సబర్బన్ ట్రైన్ ఎక్కి అయినా వెళ్ళాలి …లేదా రెండు మూడు బస్సులు మారితే గాని గమ్యం చేరదు….రోడ్డు మీద బీఎంసి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తున్నారు….అందరూ ఇళ్లలోనే ఉండండి వర్షం గంటల కొద్దీ పడే అవకాశం ఉంది….వరద ముప్పు ఉంది సిటీ కి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు…..కాసేపటికి వర్షం కొంచెం తెరపి ఇచ్చింది ….అప్పటికి కాలువలు రోడ్లు జలమయం అయ్యాయి….అలాగే వర్షం లో తడుచుకుంటూ దగ్గర లో ఉన్న స్టేషన్ కి వచ్చింది ….ఆ కాసేపటి లో పడ్డ వర్షానికే పట్టాలు మొత్తం నీళ్ళు వచ్చేశాయి…. జనాలు అక్కడే వెయిట్ చేస్తున్నారు….కాసేపటికి స్టేషన్ క్లోజ్ చేశారు ఇప్పట్లో ట్రైన్స్ తిరగవూ అని బోర్డ్ పెట్టి ….అక్కడి నుండి అమృత లో భయం అందుకుంది ….వెంటనే మొగుడి కి ఫోన్ చేయాలని చూసింది….సిగ్నల్స్ కూడా దొరకట్లేదు…..ఇంకా వేగంగా గాలి వీస్తుంది ….కల్ల ముందే పెద్ద పెద్ద చెట్లు నేల కూలుతున్నాయి….కొన్ని విద్యుత్ స్థంబాల మీద పడుతున్నాయి ….ముంబై మొత్తం మునిగేలా ఉంది …..అలా బస్టాప్ వైపు పరిగెడుతున్న అమృత చూస్తుండగానే మళ్లీ రౌండ్ వర్షం మొదలైంది…అప్పటికే అమృత చీర పూర్తిగా తడిసి ముద్దైంది….ఈ రోజు స్లీవ్ లేస్ జాకెట్ వేసుకుంది ….చలికి వణుకు తన పరుగు కొనసాగిస్తూ బస్టాప్ చేరుకుంది ….వర్షం జోరు ఇంకా పెరిగింది చూస్తుండగానే రోడ్లు మడుగులు అయ్యాయి….కాలువలు పొంగుతున్నాయి…ఒకరిద్దరు మాన్ హోల్స్ లో పడ్డారు …..మోకాళ్ళ లోతు నీళ్ళు రోడ్డు మీద పారుతున్నాయి…పరిస్థితులు చేజారిపోతున్నాయి…ఇటువంటి స్థితి లో బస్సు లు వచ్చే పరిస్థితే లేదు….తాను ఆగిన అరగంట ఇంత కాస్ట్లి మిస్టేక్ అవుతుందని అనుకోలేదు అమృత….గుండె ధైర్యం సన్నగిల్లి పోయింది….చుట్టూ జనాలు కూడా లేరు ….ఏడుపు తన్నుకొస్తోంది ….అంతా వర్షం లో ను కళ్ళు చెమ్మగిల్లాయి …కన్నీటి ధార కట్టలు తెంచుకు నేలా ఉంది….మొదటి సారి తన జీవితం లో ఇంత ఒంటరి గా ఫీల్ అయ్యింది …..

బస్టాప్ లో కూడా ఎవరూ లేరు …ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి…. సింహాల గుంపు మధ్య చిక్కిన లేడిపిల్ల లా భయపడింది అమృత ప్రకృతి ప్రకోపానికి……ఇంతలో ఏదో రూపం ఆ జోరు వాన లో నీట మునిగిన కారు లో నుండి పరిగెత్తుకుంటూ బస్టాప్ వైపు వచ్చింది….వాన ధార నుండి ఒక మగ మనిషి కనిపించి …వచ్చి బస్టాప్ లో దూరాడు….25-28 మధ్య వయసు గల కుర్రవాడు….పైనుండి కింది వరకు మొత్తం తడిసిపోయాడు నాలాగే….మంచి రంగు ఉన్నాడు బహుశా నార్త్ ఇండియన్ అనుకుంది అమృత…

టెన్షన్ పడుతున్న అమృత వైపు తొలిసారి అతను చూసాడు….ఆమె పరిస్థితి చూసి పాపం అనుకున్నాడు..చేసేదేమీ లేక ఇద్దరూ అలానే శూన్యం లోకి చూస్తున్నారు… వాన ఈ మాత్రం తగ్గడం లేదు…అమృత మళ్లీ ఫోన్ చూసుకుంది …ఇంకా సిగ్నల్ లేదు…ఈ లోపు అతనికి ఫోన్ వచ్చింది ….ఏదో మాట్లాడి పెట్టేశాడు…అప్పుడు ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని అమృత “హెలో .. ఎక్స్ క్యూజ్ మీ… కేన్ యు గివ్ మీ యువర్ ఫోన్ ఫర్ ఆ కాల్…ఐ డోంట్ హావ్ సిగ్నల్…ప్లీజ్..” ” ష్యూర్ నో ప్రోబ్లం అని ఇచ్చాడు….
అమృత : “హెల్లో ….హా ఏవండీ నేను అమ్ము ని …ఇక్కడ ఫుల్ వర్షం …రోడ్లన్నీ నీళ్ళు ఉన్నాయి….రావడం లేట్ అవుతుంది ….పిల్లలు జాగ్రత్త….నేను మళ్ళీ కాల్ చేస్తాను…” అని సంక్షిప్తంగా చెప్పి పెట్టేసింది ….అతనికి ఫోన్ తిరిగిచ్చి …థ్యాంక్స్ ఏ లాట్ …అన్నది….
అతను …”ఇట్స్ ఓకే….నా పేరు అర్జున్ సౌత్ బాంబే లో ఉంటాను అన్నాడు….అమృత : ఓహ్ …మీరు తెలుగు వారెనా..నా పేరు అమృత..ఇక్కడే శివాజీ అసోసియేట్స్ లో ఆడిట్ ఆఫీసర్ గా పని చేస్తున్నాను…. అని చిరునవ్వు….ఇప్పటికీ కాస్త కుదుట పడింది అమృత కి …తోడుగా ఎవరో ఒకరు ఉన్నారు…పైగా తెలుగువాడు అనుకుని ధైర్యం మూట గట్టుకుంది.

1 Comment

  1. Ganti subrahmanyam

    Suppr

Comments are closed.