ఇక తను ఎత్తదు లే అని అనుకుంటూ కాల్ కట్ చేస్తుంటే అప్పుడే తను కాల్ లిఫ్ట్ చేసింది. నేను వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటూ హెలో అన్న తను పలకలేదు. ఇంకోసారి హెలో అన్నా. తను ఎం పలకలేదు. నేను తన రెస్పాన్స్ కోసం చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడుతూ రూపా ఇంటికి వచ్చేయి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అన్నా. తను ఫోన్ కట్ చేసింది. నేను మళ్ళీ చేశా. తను ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసింది. నేను కోపంగా ఫోన్ ను జోబులో పెట్టుకుంటూ పార్క్ కు బయలుదేరా. పార్క్ లో కార్ అక్కడే ఉండడం చూసి దాని దగ్గరకు వెళ్ళా. లోపల రూప సీరియస్ గా కూర్చుని ఎటో చూస్తూ ఉంది. నేను విండో పై తట్టా. తను తిరిగి చూసింది. నేను తెరువు అన్నట్లుగా చూసా. తను కొద్దిసేపు నా వైపు చూసి ఓపెన్ చేసింది. నేను తన పక్క సీట్ లో కూర్చుంటూ సీరియస్ టోన్ తో ఇంటికి పద అన్నా. తను నా వైపు ఒక చూపు చూసి మళ్ళీ అటు తిరిగింది. నేను కోపంగా తన చేయి పట్టుకుని నా వంక తిప్పుకుంటూ ఏం వినిపించడం లేదా అన్నా. తను కోపంగా చూసింది. చూసి నా చేతిని విదిలించి కొట్టి ఎందుకొచ్చావ్, వెళ్ళిపోయావ్ గా మళ్ళీ ఎందుకు వచ్చావ్ అంది. నేను తనని చూసి ఇది టైం కాదు, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ముందు కార్ తీయి అన్నా. తను తల తిప్పుకుంటూ నా మీద ప్రేమ లేనప్పుడు నా మీద పెత్తనం చెలాయించే హక్కు నీకు లేదు అంది. దానికి నేను నువ్వు అనుకున్నదే ప్రేమ కాదు, ఒక స్నేహితుడి లా కూడా ప్రేమించొచ్చు, అయినా ఇప్పుడు ఎందుకు ఇలా బెట్టు చేస్తున్నావ్ ప్లీజ్ కార్ స్టార్ట్ చేయి అన్నా.
తను కోపంగా నా వంక చూస్తూ ఇంకోసారి కార్ స్టార్ట్ చేయి అన్నావో జాగ్రత్త అంటూ కోపంగా అంటూ అయినా ఏంట్రా నువ్వు ? అసలు నాకెందుకు ఇలా చిరాకు తెప్పిస్తున్నావ్, నేను బెట్టు చేస్తాను ఇంకేదైనా చేస్తాను, అది నా ఇష్టం, అసలు నా మీద ప్రేమ లేనప్పుడు నీకెందుకు రా ఇవన్నీ, నేనెలా చేస్తే నీకేంటి ? ఇష్టం ఉంటే చెప్పు లేదంటే వెళ్ళిపో అంతే కానీ ఇలా అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండకు నాకు చిరాకు వస్తుంది అంది. నేను కోపంగా చూసా. తను నా వంక చూడలేదు. నేను కార్ దిగా. అవతలకు వెళ్తూ విండో లో నుండి తనని చూసి ఒక్కటి చెప్తా చూడు రూపా, నువ్వేం చిన్న పిల్లవి కాదు బెట్టు చేస్తే నీకావల్సింది ఇవ్వడానికి., కొంచెం మెచ్యూరిటీ తో ఆలోచించు అంటూ చెప్తూ వుండగానే విండో మిర్రర్ క్లోజ్ చేసేసింది.
నేను కోపంగా కార్ ను తన్నా. అలా తన్ని అక్కడే కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపు అలా తిరగగా రూప నుండి మెసేజ్ వచ్చింది. వెళ్ళిపో, లేదంటే నా మీద ప్రేమ ఉందనే అనుకుంటాను” అని ఉంది. నేను కార్ లో కూర్చున్న రూప ను చూసా. రూప నా వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది. నేను ఇక తనకు ఆశలు పెంచక పోవడమే మంచిది అని అనిపించి అక్కడ నుండి వచ్చేశా..
గంట అవుతూ ఉండగా నాకు ఇంకో మెసేజ్ వచ్చింది. “వెళ్ళిపో అన్నాగా” అని ఉంది. నేను వెంటనే కాల్ చేశా. తను లిఫ్ట్ చేసింది. నేను ఇంట్లో ఉన్నాను అన్నా. తను ఎం పలకలేదు. నేను హెలో అన్నా. తను వెంటనే అబద్ధాలు చెప్పకు, నువ్వు ఇక్కడే ఉన్నావ్ నాకు తెలుసు అంది. నేను లేదు అంటూ ఉండగా అబద్ధాలు చెప్పకు అంటూ ఫోన్ పెట్టేసింది. నేను తనకు కాల్ చేయడానికి చూసా. కానీ ఎందుకులే అని సైలెంట్ అయిపోయా. తను మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది. “నువ్వు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉంటే నన్ను ప్రేమిస్తున్నట్లే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా” అని ఉంది దాంట్లో. అది చదివి తల ఎత్తి దూరంగా రూప కూర్చున్న కార్ వంక చూసా. తను ఊహించింది నిజమే, నేను ఇంటికి వెళ్ళలేదు. తననే దూరంగా ఉండి గమనిస్తున్నా. తను పెట్టిన మెసేజ్ చూసి తనకు రిప్లై గా నేను ఇంట్లో సేమ్ డ్రెస్ తో దిగిన ఒక ఫోటో ని తీసి పంపించా. తను అది చూసింది. కోపంగా ఉన్న సింబల్స్ పెడుతూ అబద్ధం అని పెట్టింది. అలా పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నేను కార్ వంక చూసా. అప్పుడే తను కిందికి దిగింది. దిగి చుట్టూ చూసింది. నేను తనకి కనపడని చోట ఉన్నా. తను చుట్టూ పరిశీలనగా చూస్తూ నేను కనిపించక పోయే సరికి భాధగా తల దించుకుంది. తన ముఖం లో బాధ స్పష్టంగా కనిపించింది. అది చూడగానే నాకే ఎలాగో అయ్యింది. పోయి సారీ చెప్పి ఐ లవ్ యూ చెప్దామా అని అనిపించింది. తను ఇంకోసారి చుట్టూ చూసింది. నేను కనిపించలేదు. అలాగే కాసేపు నిలబడింది. ఫోన్ తీసుకుని లాస్ట్ టైం ఒకసారి ప్రయత్నిద్దాం అని స్విచ్ ఆన్ చేసి నాకు కాల్ చేసింది. నేను లిఫ్ట్ చేశా. అవతల నుండి తను, నిజం చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా అంది. నేను ఎం పలకలేదు. తను చుట్టూ చూస్తూ నా మనసుకు తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని ప్లీజ్ అబద్ధం చెప్పకు, ఇక్కడ లేను అని మాత్రం అబద్ధం చెప్పకు అంది కాస్త ఏడుపు గొంతు తో. నేను శ్వాస ను గాఢంగా వోదులుతూ నిన్ను డిసప్పైంట్ చేస్తున్నందుకు సారి రూపా నేను నిజంగా ఇంట్లో ఉన్నా అన్నా అలా అంటూ వుండగానే తను కోపంగా ఫోన్ పెట్టేసి లోపల పడేసింది. నేను అది చూసి తనకు మెసేజ్ పెట్టా. ‘ ఇప్పటికైనా అర్దం చేసుకో రూపా, అని. మెసేజ్ రావడం తో రూప చెక్ చేసుకుంది. నేను పెట్టింది చూడగానే కోపంగా అటు ఇటూ చూసింది. నేను ఏమైనా కనపడతాను ఏమో అని. కానీ నేను ఎక్కడా కనిపించక పోయే సరికి కోపంగా లోపల సెల్ పడేసి కంట్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ కార్ డోర్ గట్టిగా తీసింది. అంతే అలా తీయగానే అక్కడే అటు వైపు నుండి వస్తున్న ఒక తాగుబోతు కు ఆ డోర్ తగిలింది. తగిలి వాడి చేతిలో ఉన్న మందు బాటిల్ పడిపోయింది. అది చూసి వాడు రూప వైపుకు చూసాడు. రూప అదంతా పట్టించుకునే స్థితిలో లేదు కార్ లోకి ఎక్కుతూ ఉంది. అలా కేర్ లెస్ గా ఎక్కుతూ ఉండడం చూసి ఆ తాగుబోతు పక్కన ఉన్న వాడి ఇంకో తాగు బోతు ఫ్రెండ్ కోపంగా రూప చేయి పట్టుకుని లాగాడు. అంతే వెంటనే నేను పైకి లేచా. అక్కడ వాడు రూప చేయి పట్టుకుని బయటకు లాగుతూ ఎంటే నీకంత బలుపు అంటూ ఉండగా నేను కోపంగా ముందుకు కదిలా. కానీ అంతలోనే ఇందాక జరిగింది గుర్తొచ్చి ఆగిపోయా. వెళ్తే మళ్ళీ ప్రేమా పెళ్లి అని అంటుంది ఏమో అని అనిపించి ఆగిపోయి అక్కడే నిల్చున్నా. కానీ అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం కోపంగా చూస్తూ ఉన్నా. రూప చేయి పట్టుకోవడం తో రూప కు కోపం వచ్చి ఆ తాగుబోతు ఫ్రెండ్ అయిన ఇంకో తాగుబోతు ను గట్టిగా చెంప మీద కొట్టేసింది. అంతే అది చూసిన ఆ తాగుబోతుల ఇంకో ఫ్రెండ్ వాడికి వత్తాసుగా వచ్చాడు. ముగ్గురూ కలిసి రూప చుట్టూ నిల్చుని వాగుతున్నారు. రూప అప్పటికే నా ఆలోచనలతో వేరే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండడం తో వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేక పోతుంది. అది అంతా నేను దూరం నుండి చూస్తూ ఊరికే ఉండలేక పోయా. అందులో ఒకడు రూప ను కావాలనే టచ్ చేయాలని చూస్తున్నాడు. రూప ఇప్పుడు కొంచెం బాధ లో ఉండడం వల్ల వాళ్ళ ను అదుపు చేయలేక పోతుంది. నేను అది చూసి ఇక ఆగలేక పోయాను. రక్తం మరుగుతూ ఉండగా ముందుకు అడుగు వేసా. కానీ అంతలోనే ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు వెళ్తే తను మళ్ళీ ఎప్పటికీ నన్ను నమ్మదు. నేను ప్రేమ లేదు అంటే తను చంపేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళడం కంటే వెళ్లక పోవడమే మంచింది అనిపించింది. వెంటనే చుట్టూ చూసా. అక్కడ ఒక కానిస్టేబుల్ కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి అక్కడ ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని చూపించా. అంతే వెంటనే అతను అక్కడికి వెళ్లి వాళ్ళని రోడ్ మీదనే కొట్టి రూప ను విడిపించాడు. వాళ్ళు కోపంగా రూప ను చూసారు. మమ్మల్నే కొట్టిస్తావా అన్నట్లుగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ ఫేస్ లు గుర్తు పెట్టుకున్నా ఎందుకుంటే నేను ఇవ్వాల్సిన కోటింగ్ కూడా ఉంది కదా. వాళ్ళని చూస్తూ ఉండగా వాళ్ళు కొంచెం దూరంగా వెళ్లి ఇంకో మందు సీసా ను తెచ్చుకుని తాగుతూ ఉన్నారు. నేను వాళ్ళని చూసి మీకు ఉంది లెండ్రా నా చేతిలో అని అనుకున్నా.
ఇక్కడ రూప కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ కార్ ఎక్కి కూర్చుంది. చాలా సేపు అయ్యింది. తను కార్ దిగలేదు. నేను కార్ నే చూస్తూ ఉన్నా. తన నుండి ఫోన్ కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశా. రూప మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని నాకు తెలుసు..
ప్లీజ్ రా అబద్ధం చెప్పకు అంది. నేను కొంచెం విసుగ్గా, నేను లేను అని ఒకసారి చెప్తే అర్దం కాదా అన్నా. తను సైలెంట్ అయిపోయింది. కాసేపు మౌనం తరువాత
తను మాట్లాడుతూ., నాకెందుకో నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని అనిపిస్తుంది రా, నా మనసు చెప్తుంది. నిజంగా ఇది తప్పే అయితే నువ్వన్నట్లే చేస్తా. కానీ నువ్వు ఇక్కడే ఉండి మాత్రం అబద్ధం చెప్పకు అంది. నేను నిజంగా లేను రూపా అన్నా. తను గట్టిగా అబద్ధం అంది. నేను మౌనంగా ఉన్నా. తను మాట్లాడుతూ ఒకవేళ నువ్వు లేకపోయినా సరే, నీకిదే చివరి అవకాశం రాత్రి లోపు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్లు లేదంటే నేనీకెప్పుడు మళ్ళీ కనపడను అంది. అలా అంటూ ఫోన్ పెట్టేసింది. నేను ఎదురుగా ఉన్న కార్ వంక చూసా.
ఒక్క క్షణం తననేందుకు బాధ పెట్టడం అనిపించింది. కానీ అంతలోపే ఫ్యామిలీ గుర్తొచ్చి ఆగిపోయి, ఆలోచించడం మొదలు పెట్టా.
ఇప్పుడు రూప కు నేను ఇక్కడ ఉన్నా అని తెలిస్తే ఎలా అయినా తన పట్టు తను సాధిస్తుంది. అదే నేను ఇక్కడ లేను అని తెలిస్తే అప్పుడు తనంతట తానే నన్ను వొదిలేసి అంకుల్ చెప్పిన పెళ్లి చేసుకుంటుంది అని అనిపించింది. అంతే వెంటనే తనకు కనిపించ కుండా అక్కడ నుండి వెళ్లిపోదాం అని అనుకున్నా. పడితే ఒక్క రోజు లేదా ఒక్క వారం బాధ పడుతుంది అంతే కదా, దాని కోసం ఇద్దరి ఫ్యామిలీ లను ఎందుకు బాధ పెట్టడం అని అనుకుని లేచి మెల్లగా తనకు కనిపించకుండా ఇంటికి వెళ్ళిపోయ..

Super super love it
Love story very interesting and lovely
Bro fast gaa Pettu bro
Full story
Continue the night shift and janmanichhina thalli kosam prayanam
చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. అపకు బ్రదర్
చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. ఆపకుండా పూర్తి చేయి బ్రదర్
The best story ever I found in this website