గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులు..
ఏంటి ఆంటీ విన్ను గాడు ఎక్కడ అని అడిగా చీర సరిగ్గా కట్టుకుంటూ. వినయ్ వాళ్ళ అమ్మ ఏమోనే తెలీదు, ఇంట్లోనే ఉన్నాడేమో ఇంకా అంది. నేను అవునా మధ్యాహ్నం నా డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుని ఏమైంది వాడికి ఇంకా రాలేదు అని అంటూ చీర కట్టేసుకున్నా. వినయ్ అమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరూ నన్ను చూసి ఎంత చక్కగా ఉన్నావే అని కాసేపు పొగిడారు. నేను వాళ్ళ పొగడ్తలు పెద్దగా పట్టించుకునే స్థితి లో లేను. ఎందుకు అంటే వినయ్ గాడు నిన్న మధ్యాహ్నం నుండి సరిగ్గా మాట్లాడడం లేదు. ఆ విషయమే నన్ను తొలిచేస్తూ ఉంది. కాసేపు ఉండండి ఇప్పుడే వస్తా అని మా అమ్మ ఇంకా వినయ్ అమ్మ కు చెప్పేసి రూం బయటకు వచ్చి వినయ్ గాడికి కాల్ చేశా. రింగ్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఛా వెధవ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేశా. ఈ సారి కూడా లిఫ్ట్ చేయలేదు. అంతలో నా క్లాస్ మేట్ వచ్చాడు నన్ను చూసి వావ్ రూపా, ఏంజెల్ లా ఉన్నావ్ తెలుసా అన్నాడు. నేను లేని నవ్వు ఒకటి తెచ్చుకుని చిన్నగా నవ్వా. వాడు తిరిగి నవ్వుతూ ఇంకో టూ హవర్సే ఉంది అంతా ఒకే కదా అన్నాడు డాన్స్ ప్రోగ్రాం ను గుర్తు చేస్తూ. నేను హా అంతా ఓకే అని చెప్పా. దాంతో వాడు సరే మళ్ళీ వస్తా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాసేపట్లో వాడితోనే నేను కలిసి డాన్స్ వేయబోతున్నా. నిన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాడు డాన్స్ లో భాగంగా నా నడుము పట్టుకున్నాడు. అది చాలా కామన్ అని నాకు తెలుసు కానీ వినయ్ గాడికి అది నచ్చలేదు. నేను అలా వేరే మగాడితో ఉండడం వాడికి పెద్దగా నచ్చదు. ఆ విశయం నాకు తెలిసినా కూడా వాడిని నేనే ప్రాక్టీస్ చేసే చోటికి తీసుకు వచ్చా. నా ఉద్దేశం లో డాన్స్ పార్టనర్ నడుము టచ్ చేయడం పెద్ద విశయం కాదు కానీ వాడికి అది పెద్ద విశయం అవుతుంది అని నేను అప్పుడు ఊహించలేదు. ఎంతకీ ఫోన్ తీయక పోయే సరికి నేనే ఆటో లో వాడి ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే వచ్చి తలుపు తెరిచాడు. నేను ఏం చేస్తున్నావ్ ఇంట్లో అన్నా వాడు ఏం లేదు ఊరికే క్రికెట్ చూస్తున్నా అని అన్నాడు. నేను ఇంట్లోకి అడుగు పెడుతూ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని అడిగా. వాడు నాకు ఫోన్ చేసావా ? ఎప్పుడు అని అన్నాడు. నేను వాడి వంక సీరియస్ లుక్ ఇచ్చా. వాడు సోఫా దగ్గరికి వెళ్ళి అక్కడ పడి ఉన్న ఫోన్ తీసుకుని చూసాడు నా మిస్డ్ కాల్స్ ఉన్నాయ్. అది చూసి సారీ రూప నిజంగా సైలెంట్ లో ఉంది కావాలంటే చూడు అని అన్నాడు. నేను అదేం పట్టించు కొకుండా నా డాన్స్ ప్రోగ్రాం ఉంది అని గుర్తుందా నీకు అని అన్నా. దానికి వాడు హా గుర్తు ఉంది అని అన్నాడు. నేను పద వెళ్దాం అన్నా. వాడు కానీ అంటూ నసిగాడు. నేను ఏమైంది అన్నా. వాడు ఏం లేదు కాస్త uneasy గా ఉంది అని అన్నాడు. నేను సీరియస్ గా చూసా. వాడు నిజంగా నిజం చెప్తున్నా అని అన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళి నీకేమైనా నచ్చకపోతే నాకు డైరెక్ట్ గా చెప్పు అంతే కానీ ఇలా ఆడపిల్ల లా చేయకు అని అన్నా. వెంటనే వినయ్ గాడు నేనేం చేశా అన్నాడు. నాకు తెలుసు వాడికి తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నా అని. అందుకే డైరెక్ట్ గా వాడిని చూస్తూ చూడు డాన్స్ లో నడుము మీద చెయ్యి వేయడం అనేది చాలా చిన్న విశయం, నువ్వు దాన్ని అనోసరంగ పెద్దది చేయకు అని అన్నా. వినయ్ గాడు వెంటనే నేనేం చేశా, నేను చెప్పానా నీకు ? వాడు నీ నడుము మీద చెయ్యి వేయడం నాకు ఇష్టం లేదు అని ? చెప్పనా ? అన్నాడు కాస్త రెట్టించి, అలా అంటూ అయినా అసలు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావ్ ఇప్పుడు అని అన్నాడు ఏమీ తెలీదు అన్నట్లు. నేను కోపంగా వాడి వంక చూసి సరే అయితే నాతో రా డాన్స్ ప్రోగ్రాం కు అన్నా. వాడు కానీ నాకు అన్ ఈసీ గా ఉంది అని అన్నాడు. నేను వాడ్ని చూసి నువ్వు ఇప్పుడు రాక పోతే నేను మాత్రం నువ్వు ఆ నడుము విషయమే అడ్డం పెట్టుకుని రాకున్నావ్ అని అనుకుంటాను తరువాత నీ ఇష్టం అని అన్నా. వాడు ఏమను కున్నాడో ఏమో సరే వస్తా పద అన్నాడు. నేను స్మైల్ ఇస్తూ బయటకు నడిచా. ఆటో లో వెళ్ళేటప్పుడు వాడి చెయ్యి లో నా చేయి పెడుతూ వాడి చేతికి ముద్దు పెట్టా. వాడు ఏం అనలేదు.
డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. వాడ్ని కావాలనే ఫ్రంట్ రోస్ లో కూర్చోబెట్టా. నా డాన్స్ స్టార్ట్ అయ్యింది. వినయ్ గాడు నిన్న దేనికి అలిగాడో మళ్ళీ ఆ సన్నివేశం వచ్చింది. నా క్లాస్ మెట్ నా నడుము పట్టుకుని డాన్స్ వేస్తున్నాడు. అప్పుడు తల వాడి వైపే చూడాలి కాబట్టి వినయ్ గాడి వంక చూడలేక పోయా. ఆ స్టెప్ అయ్యాక వినయ్ గాడి రియాక్షన్ ఎంటో అని చూసా. అక్కడ వాడు లేడు. నేను భయపడి నట్లుగానే వినయ్ గాడు అప్పటికే పైకి లేచి బయటకు వెళ్ళిపోయాడు. నేను అది చూసి మనసులో వాడ్ని తిట్టుకుంటూ డాన్స్ కంప్లీట్ చేశా.
ఎందుకు బయటకు వచ్చేశావ్ అన్నా కోపంగా వాడ్ని చూసి. వాడు ఏం లేదు నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వచ్చేశా అని అన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళి కాలర్ పట్టుకుంటూ పిచ్చి దాన్ని అనుకుంటున్నావా ? ఇదా నువ్వు చెప్పే కారణం ? ఇదో కారణమా అసలు అంటూ వాడి వంక చూసా. వాడు తల వంచుకుని ఉన్నాడు. నేను వాడ్ని చూసి ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పడం నేర్చుకో ఇలా ఆడంగి లా ప్రవర్తించకు అని అన్నా. అంతే వాడు కోపంగా నన్ను చూసాడు. నేను కూడా అలాగే చూసా. వాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉన్న డస్ట్ బిన్ ను గట్టిగా తన్నా. సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళా. వాడు లోపల కార్టూన్ నెట్వర్క్ చూస్తూ కనిపించాడు. నేను రావడం చూసి అటు తిరిగి పడుకున్నాడు.
