పెళ్లి తరువాత.. 2 65

రూప అమ్మ : ఏమైంది ?
నేను : ఎం లేదు లే ఆంటీ
రూప అమ్మ : మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్ ?
నేను : ఎం లేదులే ఆంటీ
రూప అమ్మ (నా దగ్గరికి వస్తూ) : చెప్పు రా ఏమైంది ?
ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా ? చెప్పు పర్లేదు
నేను : లేదు లే ఆంటీ, నేనేమ్ చెప్పలేను,
ముఖ్యంగా మీకు అయితే అస్సలు చెప్పలేను అన్నా
(రూప అమ్మ అర్దం కానట్లు చూసింది)
నేను అది చూసి మీకు కావలసినట్టు గానే చేసుకోండి ఆంటీ మీ ఇష్టం నేనేం అడ్డు చెప్పను అంటూ మళ్ళీ రూం దగ్గరికి వెళ్ళా వెళ్తున్న నన్ను అర్దం కానట్లు గా చూస్తూ వచ్చి ఆపింది. ఆపి నన్ను చూసి అసలు ఏమైంది చెప్పు అంది. నేను మనసులో ప్లాన్ వర్కవుట్ అవుతుంది లే అని అనుకుంటూ తనని చూసి ఇద్దరు ఆడ మగ కలిసి ఉంటే తప్పుగా అర్ధం చేసుకోవడం కంటే గొప్పగా ఆలోచించ లేని మీకు నేను ఎం చెప్పగలను లే ఆంటీ నన్ను క్షమించండి అంటూ పక్కనే ఉన్న రమేష్ గాడి వంక కూడా చూసి సారీ రమేష్ మీ చెల్లి తో అలా ఉన్నందుకు అంటూ ఇద్దరి వంక చూసి ఇకపై మీరు చెప్పినట్లు గానే రూప తో దూరంగా ఉంటాను అంటూ వాళ్ళ రియాక్షన్ పట్టించు కోకుండా నా రూం లోకి వచ్చేశా.

రూప అమ్మ, రమేష్ ఇంకా మా అమ్మ ముగ్గురు ఒకరినొకరు ఎం అర్దం కానట్లుగా చూసుకున్నారు. కాసేపు అయ్యాక నా రూం తలుపు తెరుచుకుంది. రూప అమ్మ, మా అమ్మ రమేష్ ఇంకా మా అక్క మొత్తం నలుగురు లోపలికి వచ్చారు. నేను ఇటు వైపుకు తిరిగి కూర్చున్నా. రూప అమ్మ నా దగ్గరికి వస్తున్న శబ్దం వచ్చింది. తను నన్ను కన్విన్స్ చేయడానికి వస్తున్నట్లుగా అనిపించింది ఎందుకో సడెన్ గా భయం వేసింది. ఒకవేళ నేను అనుకున్నట్లు కాకుండా రూప ను నిజంగానే తన అమ్మ దూరం చేస్తుందా అని అనిపించింది. ఎందుకో రూప అమ్మ ను చూడలేక పోయాను భయం వేసింది. తల తిప్పేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నా. మనసులో ఒకటే నడుస్తుంది ఒకవేల రూప ను నిజంగా నా నుండి దూరం చేస్తుందా ? అని. ఎందుకు అంటే రూప కూడా చాలా సార్లు చెప్పింది. నన్ను నిన్ను మా అమ్మ దూరం చేస్తుంది అని ఇంకా తనని హాస్టల్ కు కూడా పంపించాలని చూస్తుంది అని. అదే భయం నాకు మొదలు అయ్యింది. ఒకవేళ అలా చేస్తే రూప ను ఇకపై రోజూ చూడలేను. తనతో ఎప్పటిలా గొడవ పడలేను. తనతో చనువుగా తిరగలేను, తన కేరింగ్ ఇంకా లవ్ రెండూ దూరం అవుతాయి. అలా జరిగితే నేను ఉండగలనా అని అనిపించింది. తను లేకుండా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని మనసు పడే పదే అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ భయానికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలా ఊహించని విధంగా కళ్ళలో నీళ్ళు రావడం తో రూప అమ్మకు కనిపించకూడదు అని వెంటనే పక్కకు జరగాలి అని చూసా. కానీ అంతలోనే రూప అమ్మ నా పక్కన వచ్చి కూర్చుని వినయ్ ఇటు చూడు అంది. నేను తల పక్కకు తిప్పుకున్నా నేను ఏడుస్తుంది కనిపించ కూడదు అని. కానీ రూప అమ్మ నా తల నిమురుతూ వినయ్ అంటూ మళ్ళీ పిలిచింది. నేనేం పలకలేదు. తను నా ముఖాన్ని కొంచెం కిందికి వంగి చూస్తూ ఎన్టీ ఏడుస్తున్నావా అంది నవ్వుతూ. అంతే వెంటనే నేను ఏడుస్తుంది తనకు కనిపించ కుండా తల పక్కకు తిప్పుకుంటూ ఇంకొంచెం పక్కకు జరిగా. నేను అలా జరగగానే తను కూడా నా పక్కకు వస్తూ ఎన్టీ రా దీనికే ఏడుస్తున్నావా ? అసలు ఏం అంత జరిగిందని ఏడుస్తున్నావు ? అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తనలా తీసుకోగానే ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. (అప్పుడు పిల్లోడిని కదా కొంచెం భయం వేసింది రూప ఎక్కడ దూరం అవుతుందో అని అందుకే ఆ ఏడుపు) నేనలా ఒక్కసారిగా ఏడ్చే సరికి తను హయ్యో ఏంటయ్యా ఇది అంటూ నవ్వడం మొదలెట్టింది. తనలా నవ్వుతుంటే నాకు కోపం వచ్చింది కోపంగా తన వంక చూసి తన బుజాల మీద గట్టిగా పిడికిలి తో గుద్దుతూ రాక్షసి రాక్షసి అని అన్నా. నేనలా కొడుతుంటే తనకి నా ప్రవర్తన ముద్దొచ్చి నన్ను చూస్తూ నేను అలా కొడుతూ వుండగానే నన్ను దగ్గరికి తీసుకుని వాటేసుకుంది. నేను తనని విడిపించు కోవాలని చూసా. కానీ తను నన్ను గట్టిగా వాటేసుకుని నా చెంప మీద ముద్దు పెట్టుకుంది. నేను చాలా సేపు విడిపించు కోవడానికి చూసా. కానీ తను నన్ను వదలలేదు. కాసేపటికి సైలెంట్ అయిపోయాను.
తను చిన్నగా నా వీపు తడుతూ మెల్లగా నాకు మీ ఇద్దరినీ దూరం చేయాలని లేదు రా, ఇంకా మీరిద్దరూ అలా కలిసి ఉంటేనే నాకు ఇష్టం కానీ అది హద్దు దాటుతుంది ఏమో అని చిన్న భయం అంతే అందుకే అలా చెప్పా అంది. నేను ఎం పలక కుండా ఉండిపోయాను. తను నన్ను తన కౌగిలి నుండి వేరు చేసి నా ముఖం లోకి చూసింది. నేను తల దించుకుని ఉన్నా. తను నన్ను చూసి మగాళ్లు ఎడ్వకూడదు తెలుసా అంది. నేను తల తిప్పుకున్నా. తను నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు రా అది అంటే నీకు అంత ఇష్టం అని అంది. నేను ఎం అనలేదు. తను ఇక నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే పో ముందు పోయి ముఖం కడుక్కుని రాపో అని అంది. నేను కదలలేదు, కొంచెం సిగ్గు వేసింది. మొత్తం నలుగురి ముందు సిగ్గు లేకుండా ఎడ్చా కదా వాళ్ళ ముందు కదలాలి అంటే సిగ్గనిపించింది. వెంటనే మా అమ్మ నా దగ్గరికి వస్తూ నన్ను లేపింది. లేపి పద ముఖం కడుక్కో అంటూ నన్ను బాత్రూం దగ్గరికి తీసుకు వెళ్ళింది. నేను బాత్రూం లోకి వెళ్లి ముఖం కడుక్కున్నా. బయట మా అమ్మ ఇంకా రూప అమ్మ మాటలు వినిపించాయి. మా అమ్మ ఎందుకే వాడ్ని అలా ఏడిపించావ్ అని అంటూ ఉంటే రూప అమ్మ నాకేం తెలుసే మీ వాడు అంత సెన్సిటివ్ అని అంటూ నవ్వింది. మా అమ్మ దానికి పోనీలే ఇక వాడితో అలా అనకు అంటూ ఇంకేదో మాట్లాడుతూ ఉండగా నేను తలుపు తెరిచాను. వాళ్ళని చూడాలి అంటే సిగ్గు వేసింది. అందుకే తల వంచుకుని బయటకు వెళ్తుంటే రూప అమ్మ నన్ను దగ్గరికి లాక్కుంది. అలా లాక్కుంటూ మా అమ్మ ను చూసి నాకు ఇప్పుడు అర్దం అయ్యిందే, దానికి ఎందుకు వీడంటే అంత ఇష్టమో అని అంటూ నా ముఖం లోకి చూసి వీడిలా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు అంటే దానికి మహా ఇష్టం అందుకే వీడంటే దానికి అంత ఇష్టం అంటూ మా అమ్మ ను చూసి కన్ను కొడుతూ అప్పుడేగా ఈసీ గా కంట్రోల్ చేయచ్చు అంది నవ్వుతూ..
అలా అని మళ్ళీ తిరిగి నన్ను చూస్తూ అయినా ఏంట్రా మగాడివే నా నువ్వు, అస్సలు సిగ్గు లేకుండా అలా ఏడుస్తారా ఎవరైనా అంది, అలా అంటూ నన్ను తన పక్కన కూర్చో పెట్టుకుంది. నాకు ఇంకో వైపు మా అమ్మ కూర్చుంది. మా అక్క ఇంకా రమేష్ గాడు ఇద్దరూ నన్నే చూస్తున్నారు. నేను తల దించుకుని ఉన్నా. రూప అమ్మ నన్ను చూస్తూ ఏమైంది రా నీకు అంత చిన్న విశయానికే ఎడుస్తారా ఎవరైనా అంది. నేను తన వంక తలెత్తి చూస్తూ నీకు చిన్న విషయమే ఆంటీ కానీ నాకు కాదు రూప అంటే నాకిష్టం అన్నా. తను నవ్వుతూ మరీ అంత ఇష్టమా అంది. నేను హ్మ్మ్ అన్నా. తను ఎందుకు రా అలా అంది. నేను మళ్ళీ వేరేలా చెప్తే తను ఇంకేదో లా అనుకుంటుదేమో అని భయం వేసి వెంటనే తనంటే నాకు ఇష్టం ఆంటీ, ఎందుకో తెలీదు, తను నన్ను కేర్ చేసే విధానం తను నన్ను ప్రేమగా చూసుకునే విధానం తను నాతో గొడవ పడే విధానం ఇంకా చెప్పాలంటే తను నన్ను ఒక తమ్ముడిలా ట్రీట్ చేసే విధానం అంటే నాకు చాలా ఇష్టం, తను చివరికి నన్ను కొట్టినా కూడా నాకు చాలా ప్రేమ గా అనిపిస్తుంది ఆంటీ అన్నా..
కావాలనే తమ్ముడిలా అనే పదం వాడాను. ఎందుకు అంటే మళ్ళీ నా కిష్టం అని అన్నందుకు తను వేరేలా అర్దం చేసుకుంటుంది ఏమో అని భయం వేసింది పైగా రమేష్ గాడికి కూడా డౌట్ వస్తుంది ఏమో అని అలా చెప్పా. నాకింకో ఫీలింగ్ లేనప్పుడు అక్కా అని చెప్పడానికి నాకేం సమస్య ? అందుకే అలా అన్నా పైగా చెప్పడం వరకే కాదు నిజానికి నాకు కూడా తన మీద వేరే లా ఎం అభిప్రాయం లేదు. తను చూపించే ప్రేమ కేర్ అంటే నాకు చాలా ఇష్టం. పైగా తనేమో నాకంటే పెద్దది కాబట్టి తమ్ముడి లా అని చెప్తే ఇక యే గొడవా ఉండదు లే అని అనిపించింది. అందుకే వెంటనే అదే చెప్పేశా.
“తను నాకు అక్క లాగా ఉంటుంది, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అందుకే నాకు ఇష్టం అంటూ ప్లీజ్ ఆంటీ దయచేసి తనని హాస్టల్ కు పంపించకండి, తను లేకుండా నేను ఉండలేను అని అన్నా.