నేను ప్రేమ ఇంకా ఇష్టం అనే పదాలు యుస్ చేసినా కూడా అక్క ఇంకా తమ్ముడు అనే పదాలు యూస్ చేయడం తో వాళ్ళు కామ్ అయిపోయారు. నా మీద అంత వరకు ఉన్న ఒపీనియన్స్ పోయి ఇంకో రకమైన ఒపీనియన్స్ వచ్చాయి వాళ్లకు. ముఖ్యంగా రమేష్ గాడికి ఇంకా రూప అమ్మ కు.
నేను అక్కా అన్నాక కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అని నేను అనుకోలేదు అందుకే అలా చెప్పా. వాళ్ళు కూడా నేను అలా అనేసరికి ఇంకేం అనలేక పోయారు. అప్పటి నుండి వాళ్ళు నన్ను ఇంకా రూప ను అక్కా తమ్ముడు లాగే చూసారు. మేమెంత క్లోజ్ గా ఉన్నా కూడా పెద్దగా పట్టించు కోలేదు. రమేష్ కూడా తరువాత నుండి పెద్దగా మమ్మల్ని పట్టించు కోలేదు అందుకే నాకు అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించలేదు. ఎందుకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో రూప నాకు దగ్గరగా ఉండడం మాత్రమే నాకు కావాలి అది ఎలాంటి రెలేషన్ తో ఉందో నాకు అనోసరం కానీ నాతోనే ఉండాలి అదే నాకు ముఖ్యం. అందుకే నేను ఆ కారణం చెప్పా. కారణం ఒక్కటే చెప్పి నేను రూప తో మాత్రం ఇంకోలా ఎం ఉండడం లేదు తనని కూడా సేమ్ ఒక సిస్టర్ రిలేషన్ తోనే అనుకునే వాడ్ని అలా అని తనని అక్కా అని పిలిచే వాడ్ని కాదు జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. నాకు యే రిలేషన్ అనేది ముఖ్యం కాదు తనతో ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. అందుకే అలా చెప్పాను. కానీ అది తరువాత రూప అమ్మ భయపడిన విధంగానే మారుతుంది అని అప్పుడు నాకు తెలీదు. నేనేమో తను ఎప్పటికైనా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటుంది, అయినా కూడా నేను తనతో ఇప్పుడు ఉన్నట్లు గానే ఫ్రెండ్లీ గా క్లోస్ గా ఉందాం అని అనుకుంటూ ఉంటే తనేమో అలా ఆలోచించకుండా నన్నే పెళ్లి చేసుకుందాం అని ఆలోచించింది. ఇలా జరిగింది మొత్తం కథ.
