పెళ్లి తరువాత.. 2 65

నేను వాడి దగ్గరకు వెళ్ళా. వాడు సైలెంట్ గా ఉన్నాడు. నేను బెడ్ మీదకు వెళ్ళి అక్కడే వెనుక గోడ కు అనుకుంటూ వాడిని చూసా. వాడు అటు వైపుకు తిరిగి పడుకుని ఉన్నాడు. నేను వాడి తల మీద చెయ్యి వేసా. వాడు ఏం అనలేదు. నేను వాడి చెవి దగ్గరకు పోయి సారి అన్నా. వాడు వెంటనే నా చేతిని విసిరి గొట్టాడు. నేను ఏమైంది సారి అన్నాగా అన్నా. వాడు పైకి లేస్తూ ఆడంగి వెధవను కదా నాకెందుకు సారి చెప్తున్నావ్ అన్నాడు. దానికి నేను వాడిని నా వంక తిప్పుకుని సీరియస్ గా చూస్తూ ఎవర్రా నిన్ను ఆడంగి అన్నది ? నిన్ను ఆడంగి అన్నవాళ్లు ఆడంగి అన్నా. వాడు అవును కరెక్ట్ గా చెప్పావ్ అని అంటూ పైకి లేచి అక్కడ అద్దం దగ్గరకు వెళ్ళాడు. నేను వాడి వెనుకకు వెళ్తూ ఇప్పుడేంటి ? నిన్ను బుజ్జగించి లాల పాడాలా ? అన్నా వాడి నడుము చుట్టూ చేతులు పెడుతూ. వాడు కదలకుండా అద్దం లో వాడి వెనుక ఉన్న నన్ను చూస్తూ అవసరం లేదు అన్నాడు ముభావంగా. నేను వాడి బుజం మీద తల పెడుతూ మరి ఎందుకు అంత కోపం అంటూ వాడ్ని నా వైపుకు తిప్పుకున్నా. వాడు ఏంటి అన్నట్లుగా చూసాడు. నేను వాడ్ని వెనుక అద్దం కు తగిలిస్తూ నా నడుమును నువ్వొక్కడివేనా ? ఇంకెవడూ టచ్ చేయకూడదా అని అన్నా కావాలని వాడ్ని వుడికిద్దాం అన్నట్లుగా. వాడు సైలెంట్ గా పక్కకు వెళ్ళాలని చూసాడు. నేను వాడ్ని ఆపుతూ ఇంత పోసేసివ్ అయితే ఎలా రా నువ్వు అన్నా. వాడు నా వంక కోపంగా చూసి నువ్వు మాత్రం నేను మీ అమ్మను గిళ్ళాను అని అప్పుడు పోసేశివ్ గా ఫీల్ అవ్వలేదా ? ఇప్పుడు నేను చేసిందే పోసెసివ్ గా అనిపించిందా నీకు ? అన్నాడు.
అంతే నేను వాడ్ని కోపంగా చూస్తూ మధ్యలో మా అమ్మను ఎందుకు లాగుతావ్ అంటూ వాడి వంక సీరియస్ గా చూసి అయినా నువ్వు ఆరోజు చేసిన దానికి నేను ఇవ్వాళ చేసిన దానికి చాలా తేడా ఉంది అన్నా.
వినయ్ : ఏం తేడా ఉంది చెప్పు ?
నేను : (సీరియస్ గా) ఆరోజు నువ్వు ఇంటెన్షణ్ గా వెళ్ళి మా అమ్మ నడుము గిల్లావ్. కానీ నేను ఇక్కడ వాడు నా నడుము మీద చెయ్యి వేసినా, నాకెలాంటి ఫీలింగ్స్ లేవు అదే పెద్ద తేడా, అర్దం అయ్యిందా.
వినయ్ : అవునవును ఏ ఫీలింగ్స్ లేవు, అయినా ఒక పన్నెండేళ్ళ కుర్రాడు యాభై ఏళ్ల ముసలి దాని నడుము గిల్లితే వాడికి ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయ్ అని అనుకునే నీలాంటి దాని దగ్గర మాట్లాడాలి ఫీలింగ్స్ గురించి..
నేను : మా అమ్మ ఏం ముసల్ది కాదు
వినయ్ : టాపిక్ డైరెక్ట్ చేయకు
నేను : సరే ఇప్పుడేంటి అప్పుడు మా అమ్మను నువ్వు ఏ ఫీలింగ్స్ లేకుండా గిళ్ళావ్ ఇప్పుడు వాడు నా నడుము మీద చెయ్యి పెట్టినా నాకు ఏ ఫీలింగ్స్ లేవు ఇద్దరం బ్యాలన్స్ అయ్యం గా ఇంకేంటి ?
వినయ్ : ఏం లేదు, ఇక నువ్వు వెళ్తే నేను పడుకుంటా.
వాడు అలా అని బెడ్ మీదకు వెళ్ళి మళ్ళీ కార్టూన్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. నేను అది చూసి జీవితాంతం అవే చూసుకుంటూ గడుపు అంటూ కోపంగా బయటకు వచ్చా. అక్కడ వినయ్ అమ్మ నన్ను చూసి కాసేపు మాటలు కలిపింది. నేను కూడా తనతో మాట్లాడుతూ కాసేపు టైం పాస్ చేశా. డిన్నర్ టైం అవ్వడం తో ఇక్కడే తిను అని అంది వినయ్ అమ్మ. నేను సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. వినయ్ అమ్మ వినయ్ గాడిని పిలిచింది. వాడు ముఖం సీరియస్ గా పెట్టుకుని వచ్చాడు. నాకు ఎదురుగా కూర్చుని ప్లేట్ లో అన్నం పెట్టుకున్నాడు. నేను వాడ్ని మధ్య మధ్యలో గమనిస్తూ ఉన్నా. నేను అలా వాడ్ని చూస్తూ తింటూ ఉండగా అప్పుడే వినయ్ వాళ్ళ నాన్న ఇంకా మా నాన్న ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. మా నాన్న నేను ఇక్కడే ఉండడం చూసి ఇక్కడున్నవా అంటూ నా దగ్గరికి వచ్చి నీకో గుడ్ న్యూస్ అని అన్నాడు. నేను ఎంటి నాన్న అది అన్నా. మా నాన్న సంతోషంగా ఇవ్వాళ నువ్వు డాన్స్ చేసింది మన శ్రీకర్ అంకుల్ ఉన్నాడు గా అతని ఫ్రెండ్ కొరియో గ్రాఫర్ అంట అతను నీ డాన్స్ వీడియో ని చూసి నీ లుక్స్ డాన్స్ రెండూ బాగున్నాయ్ అని అన్నాడట. నీకిస్టం అయితే నీకు ట్రైనింగ్ కూడా ఇస్తా అన్నాడంట. ఇందాకే ఫోన్ లో చెప్పాడు అంటూ నన్ను చూసి చెప్పాడు. అది విన్న వినయ్ వాళ్ళ అమ్మ బంగారు తల్లి దీని డాన్స్ చూసి నేను అప్పుడే అనుకున్నా ఇలాంటి ఆఫర్ ఎదో ఒకటి వస్తుంది అని అంటూ నా తలను నిమిరింది. వినయ్ వాళ్ళ నాన్న నా దగ్గరికి వస్తూ అయితే నువ్వు డాన్స్ వేసేది మేము టివి లో కూడా చూడబోతున్నాం అన్నమాట అన్నాడు. నేను వినయ్ గాడి వంక చూసా. వాడు మౌనంగా తల దించుకుని తింటున్నాడు. మా నాన్న నన్ను చూస్తూ నీకు ఓకే అని చెప్పమంటావా అన్నాడు ఆత్రుతగా చూస్తూ. నేను ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకుని వదులుతూ మా నాన్న వంక చూసా. మా నాన్న నేను ఏం చెప్తానో అని చూస్తున్నాడు. నేను లేదు లే నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నా. దానికి అందరూ డల్ అయిపోయారు. నా వంక వినయ్ నాన్న చూసి ఎందుకే వెళ్లొచ్చు గా అన్నాడు. నేను ఆయన వంక చూసి మనసులో నేను వెళ్తే నీ కొడుకు పొసేసివ్ నెస్ తో సచ్చిపోతాడు అంకుల్ నీకేం తెలుసు అని మనసులో నవ్వుకున్నా. అలా నవ్వుకుని లేదు అంకుల్ నాకు ఇష్టం లేదు అని చెప్పా. వాళ్ళు కాసేపు నన్ను కన్విన్స్ చేయడానికి చూసారు. కానీ నేను గట్టిగా వొద్దు అని చెప్పేసరికి సైలెంట్ అయిపోయారు. నేను వినయ్ గాడిని అబ్జర్వ్ చేశా. వాడు మౌనంగా తినేసి వెళ్ళిపోయాడు. రాత్రి కాగానే నేను ఇంటికి వెళ్ళిపోయా. నా రూం లో పడుకుని ఉండగా ఎదో సౌండ్ వచ్చింది. నేను తలెత్తి చూసా. అక్కడ వినయ్ గాడు నా వైపు వస్తూ కనిపించాడు. నేను లేచి కూర్చున్నా. వాడు నా బెడ్ మీద వచ్చి కూర్చుని నా వంక చూడకుండా తల దించుకుని నాకోసం నువ్వేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను వాడిని సూటిగా చూసా. వాడు నా వంక తిరిగి చూస్తూ నిజంగా చెప్తున్నా అన్నాడు. నేను ఉఫ్ అని అనుకుంటూ వాడి పక్కనే బెడ్ మీద వెల్లకిలా పడుకున్న. వాడు నా పక్కకు తిరిగాడు తిరిగి నీకే చెప్తుంది అని అన్నాడు. కానీ నేను వాడ్ని పట్టించు కోకుండ నా టి షర్ట్ పైకి జరిపా. ఇప్పుడు నా నడుము బొడ్డు రెండూ వాడికి కనిపించసాగాయి. వాడు నేను అలా చేయడం చూసి ఎందుకు నువ్వు ఇప్పుడు షో చేస్తున్నావ్ ఇలా అని అన్నాడు. నేను నవ్వుతూ ఇది నా ఇల్లు, నా బెడ్, నాకిష్టం వచ్చినట్లు ఉంటా నీకెందుకు రా అని అన్నా. వాడు నా టి షర్ట్ కిందికి లాగాలని చూసాడు. నేను వాడి చెయ్ పట్టుకుని నా నడుము మీద వేసుకున్నా. అలా వేసుకున్న వెంటనే వాడు తీసేయబోయాడు కానీ నేను అలాగే గట్టిగా పట్టేసుకున్నా. వాడు నా వంక చూసి ఏంటిది అన్నాడు.