నువ్వు కింద పడుకో అంటే నువ్వు కింద పడుకో అంటూ. నేను అది చూసి కోపంగా నిద్ర లో ఉన్నట్లుగా నటిస్తూ మా అన్నను కాలితో గట్టిగా కొట్టా. అంతే దెబ్బకు వాడు కింద పడిపోయాడు. విన్ను గాడు నా వంక చూసాడు. నేను కళ్ళు తెరిచి కన్ను కొట్టా. వాడు నవ్వి నన్ను వాటేసుకున్నాడు. కింద పడిన మా అన్న అమ్మా అమ్మా అని అరుస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బయట మా అమ్మ రమేష్ ను చూసి ఏంటిరా ఏమైంది అని అంది. రమేష్ గాడు జరిగింది చెప్పాడు. దాంతో వాడ్ని పట్టుకుని నా రూం కు వచ్చింది. కానీ అంతలో నేను, విన్ను గాడు ఇద్దరం చేతులు కాళ్ళు బార్లా చాపుకుని బెడ్ మీద కొంచెం కూడా స్పేస్ లేకుండా పడుకున్నాం. మా అమ్మ అది చూసి నాటకాలు వేస్తున్నారు వీళ్ళు బాగా అని అంటూ అక్కడే వున్న ఒక పిల్లో ని తీసుకుని నా ముఖం మీదికి వేసింది. నేను సైలెంట్ గా కళ్ళు మూసుకుని ఉండిపోయా. మా అమ్మ మా ఇద్దరినీ చూసి పదరా నాతో పడుకుందువు వీళ్ళు మాట వినరు లే అని అంటూ మా అన్నను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంకా విన్ను గాడు కళ్ళు తెరిచి ఒకరిని ఒకరం చూసుకుని నవ్వుకున్నాము. తరువాత పెద్దగయ్యే కొద్దీ మా మధ్య రిలేషన్ ఇంకా గట్టిగా అవుతూ వచ్చింది. ఒకరోజు నేను వినయ్ గాడి ఇంట్లో నా ప్యాంటీ వదిలేసి వచ్చాను. ఆరోజే వాడి అమ్మ వాడి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింది అలా వచ్చినప్పుడు వినయ్ గాడి డ్రాయేర్ లతో పాటు నా ప్యాంటీ కనిపించింది తనకు. అది చూడగానే మా అమ్మకు ఫోన్ కొట్టి జరిగింది చెప్పింది. అంతే వెంటనే మా అమ్మ ఆగమేఘాల మీద నా రూం లోకి వస్తూ ఇంకో సారి వాడి రూం కు వెళ్లావ్ అంటే చంపుతా అని బెదిరించింది. మనం బెదిరి పోతామా ? గట్టిగా నా రూం కు లాక్ వేసుకుని ఒక రోజంతా తినకుండా కూర్చున్నా. దెబ్బకు మా నాన్న అమ్మా, ఇంకా వినయ్ గాడి అమ్మా నాన్న అందరూ దిగి వచ్చారు. నా రూం బయట నిలబడి డోర్ కొడుతూ తీయవే తలుపు అని అంటూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పా, వినయ్ గాడితో నన్ను పడుకొనిస్తా అంటేనే నేను తలుపు తీస్తా అని. దానికి వాళ్ళు సరెలేవే ముందు తలుపు తీయి అని అన్నారు. కానీ నేను వాళ్ళ మాటలు నమ్మలేదు, వెంటనే వాళ్ళతో నిజంగా నన్ను పడుకొనిస్తాను అని మా అమ్మ మీద వొట్టేసి చెప్పండి అని అన్నా. అంతే మా అమ్మ షాక్ అయ్యింది. తరువాత మా నాన్న మెల్లగా తలుపు తడుతూ రేయ్ నాన్నా నా మీద నీకు నమ్మకం ఉంది కదా నేను నీకు మాట ఇస్తున్నా నువ్వు ఎప్పుడైనా వాడితో పడుకో ఎవ్వరూ ఏమనరు సరేనా అన్నాడు. అప్పుడు తీసా తలుపు. ఇలా నాకూ వాడికి మధ్య చాలానే జరిగాయి. ఎన్నో గొడవలు, దెబ్బలాటలు కూడా జరిగాయి. కానీ మేము ఎప్పుడూ విడిపోలేదు. ఎప్పుడూ కలిసే వున్నాం. నాకు వాడంటే ప్రాణం వాడికి నేనంటే ప్రాణం. అది ఇద్దరికీ తెలుసు ఒకరికి ఒకరు నోటితో చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే దీన్ని నేను జీవితాంతం కంటిన్యూ చేయాలి అని వాడికి ఐ లవ్ యూ చెప్పా. కానీ వాడేమో మా నాన్న ఇచ్చిన తొక్కలో మాట కోసం నన్ను దూరం పెడుతూ నేనెంటే అస్సలే ఇష్టం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. పైగా ఇందాక ఒక డైలాగ్ కూడా చెప్పాడు నువ్వు నన్ను ఇలా ఒక తమ్ముడిలా కేర్ చేస్తూ ఉండక పోవడం జరిగి ఉన్నింటే బహుశా నిన్ను చూసిన మొదటి చూపు లోనే నీతో లవ్ లో పడే వాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అలా లేదు, నేను నిజంగా నిన్ను ఆ ఉద్దేశం తో చూడలేక పోతున్నా అంటూ.
చెత్త వెధవ, ఎవడికి చెప్తున్నాడు కహానీలు, నాకు తెలీదా వాడి గురించి ? వాడు చెప్పాలా నాకు వాడి ఉద్దేశాలు ఎంటో ?.
చెత్త వెధవ.. చెత్త వెధవ..
పార్క్ లో…
వాడు ఇందాక కూర్చున్న చోటే ఇంకా కూర్చుని ఉన్నాడు. నేను వాడిని దూరం నుండి అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నా. వాడు నన్ను కాస్త భయంగా చూస్తూ ఉన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపటికి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. నేను వాడ్ని చూడనట్లుగా తిరుగుతూ ఉన్నా. వాడు నన్ను చూస్తూ రూపా అని పిలిచాడు. నేను పలకలేదు. వాడు నా దారికి అడ్డు వస్తూ నేను చెప్పేది విను అన్నాడు. నేను తలెత్తి వాడి వంక చూసా. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి ఎదో చెప్పాలని చూసాడు. అంతే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే వాడి కాలర్ పట్టుకుంటూ నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు ? అన్నా. వాడు ఏమైంది అన్నట్లుగా చూసాడు. నేను కోపంగా వాడి కాలర్ అలాగే పట్టుకుని నీకిస్టం లేకున్నా నిన్ను ప్రేమించి నీ వెంట నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని పడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అన్నా. వాడు షాక్ గా అలా చూస్తూనే ఉన్నాడు. నేను వాడితో నువ్వు మా నాన్నకో మా అన్నకో లేక ఇంకెవరికో భయపడ్డాను అని చెప్పు అర్దం చేసుకుంటా అంతే కానీ ఉన్న ప్రేమను కూడా లేదు అని చెప్పావో జాగ్రత్తా అని కోపంగా వాడిని తోసేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా.