గ్రాడ్యుయేశన్ చేస్తున్న రోజుల్లో..
రూప : నీళ్ళు రావట్లేదూ..
నేను : నేను అప్పుడే చెప్పానా ? విన్నావా నువ్వు ?
రూప : సర్లే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు
నేను : నీ ఇంటికెల్లు
రూప : స్నానం మధ్యలో ఉన్నా రా
నేను : అయితే ఎంటి ? టవల్ చుట్టుకొని వెల్లు.
రూప : ఛంపుతా, ముందు వచ్చి ఏమైందో చూడు..
నేను : (విసుగ్గా) నాకు తెలీదు, నేనైతే ముందే చెప్పానా, వాటర్ ప్రాబ్లెమ్ ఉందని, వద్దన్నా వెళ్ళావ్ గా, అనుభవించు
రూప : రేయ్ టైం అవుతుంది రా, నీ సోది వచ్చాక వింటాలే, ముందు ఇక్కడకు వచ్చి ఎదోకటి చెయ్
నేను : (చిరాగ్గా మొబైల్ పక్కన పడేస్తూ బాత్రూం దగ్గరకు వెళ్ళి) సరే తలుపు తెరువు ఏమైందో చూస్తా.
టవల్ తీసి వొంటికి చుట్టుకుంటూ తలుపు తెరిచింది రూప.
తనని కింది నుండి పైకి సీరియస్ గా చూస్తూ లోపలికి అడుగు పెట్టా. తను తలుపు వేసేసింది. నేను వెళ్లి షవర్ దగ్గర ఉన్న రిపేర్ సంగతి చూస్తున్నా. తను వెనుక నుండి త్వరగా అంది. నేను కోపంగా తన వైపు ఒక చూపు చూసా. వెంటనే తను సారీ సారీ అంటూ మెళ్ళగానే చేయి లే అంది. నేను మళ్ళీ పనిలో పడ్డా. రిపేర్ చేయడానికి పది నిమిషాలు పట్టింది. అది అయిపోతూ వుండగా ఒక్కసారిగా బయట నుండి నా రూం లోకి ఎవరో వచ్చిన సౌండ్ వినిపించింది. అది ఎవరై ఉంటారు అని ఊహించే లోపే, రమేష్ గొంతు వినిపించింది. వినయ్ అంటూ..
నేను పని అయిపోవడం తో బాత్రూం లో నుండి బయటకు వెళ్తూ వాడి వంక చూసా. అప్పుడే వాడి వెనుక నుండి రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం వినయ్ రూప ఎక్కడ ? అంది. నేను బాత్రూం నుండి పూర్తిగా బయటకు వచ్చి డోర్ మూసేస్తూ లోపల స్నానం చేస్తుంది ఆంటీ అన్నా. తను అవునా సరే త్వరగా రమ్మను అని కాసువల్ గా అనేసి బయటకు వెళ్తూ అంతలోనే ఎదో డౌటు వచ్చి తిరిగి నా వంక చూసింది. నేను ఏంటి అన్నట్లుగా చూసా. తన అమ్మ డౌటు ఎంటో అర్దం చేసుకున్న రమేష్ వెంటనే నాతో, అది స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్ రా లోపల అన్నాడు. నేను మామూలుగానే ఫేస్ పెట్టి నీళ్ళు రావట్లేదు అంటే చూడడానికి వెళ్ళా అని చెప్పా. రూప వాళ్ళ అమ్మ వెంటనే సిగ్గు లేదు అలా ఆడపిల్ల స్నానం చేస్తుంటే వెళ్ళడానికి అంది. నేను నాకెందుకు సిగ్గు తనే పిలిచినప్పుడు అన్నా. తను కొంచెం కోపం నటిస్తూ ఇద్దరికీ మరీ ఎక్కువ చనువు అయిపోయింది రా వెంటనే ఎదో ఒకటి చేయాలి లేకపోతే హద్దు మీరేలా ఉన్నారు అంది. ఇదంతా లోపల నుండి వింటున్న రూప కోపంగా నీళ్ళు రావట్లేదు అంటే వచ్చాడు లే మా, దీనికే సీన్ క్రియేట్ చేయకు అంది. దానికి వెంటనే రూప అమ్మ, ముందు నీకు ఎక్కువైందే, ఆడపిల్లలా ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు నీకు, అయినా మనింట్లో స్నానం చేయకుండా ఇక్కడకెందుకు వచ్చావే అంది. దానికి రూప ఎదో చెప్పబోతు ఉండగా అప్పుడే మా అమ్మ బయట నుండి వస్తూ ఏమే ఇక్కడ ఏం చేస్తున్నావ్ త్వరగా రా పని ఉంది అని అంటూ లోపలికి వచ్చింది. రూప అమ్మ నా వంక ఒకసారి చూసి మళ్ళీ మామూలుగా మా అమ్మ తో పద వస్తున్నా అంటూ బయటకు వెళ్ళింది. రమేష్ గాడు నా వంక చూసాడు. నేను స్మైల్ ఇచ్చా, వాడు ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
ఇవ్వాళ వాడి బర్త్ డే. ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఆరెంజ్ చేశారు. సాయంత్రం అవుతూ ఉండగా రమేష్ బర్త్ డే పార్టీ కి వాడి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు. పార్టీ గ్రాండ్ గా జరుగుతూ ఉంది. ఎప్పటి లాగే నేనూ రూప ఇద్దరం ఒకరిని ఒకరం విడిచి పెట్టకుండా తిరుగుతూ ఉన్నాం. అలా మేము తిరుగుతూ ఉన్నది దూరం నుండి రమేష్ ఫ్రెండ్ ఒకడు గమనిస్తూ ఉన్నాడు., వాడు మమ్మల్ని గమనించడం ఇది మొదటి సారి ఏం కాదు, ఎప్పటి నుండో మమ్మల్ని ఇలాగే గమనిస్తూ ఉన్నాడు. వాడి గురించి చెప్పాలంటే వాడికి రూప అంటే చాలా ఇష్టం, నేను రూప తో తిరగడం, రూప తో క్లోస్ గా ఉండడం వాడికి అస్సలు నచ్చదు. అందుకే వాడ్ని నేను ఎప్పుడు చూసినా నా వంక కోపంగా చూస్తూ కనిపిస్తాడు. నన్ను ఎప్పుడెప్పుడు పక్కకు తప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రూప వైపు నుండి నాకు బలమైన సపోర్ట్ ఉండడం వల్ల వాడు నన్ను ఏం చేయలేక పోతున్నాడు. కానీ నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని మాత్రం కళ్ళలో వొత్తులు వేసుకుని మరీ చూస్తూనే ఉంటాడు. వాడు అలా నా గురించి ఆలోచిస్తున్నాడు అని నాకు అప్పుడు తెలీదు. అందుకే ఆ పార్టీ లో ఎప్పటి లాగే రూప తో ఎలా ఉంటానో అలా ఉన్నా
రమేష్ గాడికి వాడు ఒక రకంగా మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి, వాడి మాట కచ్చితంగా రమేష్ గాడు వినే తీరతాడు అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. అంత మంచి ఫ్రెండ్షిప్ ను వాడు తన లవ్ సక్సెస్ చేసుకోవడానికి యువుస్ చేసుకుంటాడు అని నాకు అప్పుడు తెలీదు. నేను ఇంకా రూప ఇద్దరం రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉండడం చూపిస్తూ వాడు అనుకున్నది చెప్పడం మొదలు పెట్టాడు రమేష్ కు. నేను రూప ను లవ్ చేస్తున్నా అని, అమాయకమైన రూప ను బుట్టలో వేసుకుంటున్నా అని, ఎవ్వరూ లేనప్పుడు తనని ఫిజికల్ గా కూడా టచ్ చేస్తున్నా అని, ఇంకా ఛాన్స్ ఇస్తే ఇది చాలా దూరం వెళ్తుంది అని, ఇలా ఏవేవో చెప్పేశాడు. అలా చెప్పి అంతవరకు నా మీద పెద్దగా అనుమానం లేని రమేష్ గాడికి నామీద డౌటు కలిగేలా చేసాడు. పైగా రూప తో నేను క్లోజ్ గా ఉండడం ఇంకా పొద్దున బాత్రూం లో ఇద్దరం ఒకేసారి ఉండడం వంటివి చూడడం తో వాడికి నా మీద డౌటు రావడానికి పెద్దగా టైం కూడా పట్టలేదు..
పార్టీ అయిపోయెంత వరకూ రమేష్ గాడు మమ్మల్నే గమనిస్తూ ఉన్నాడు. రూప తో దగ్గరగా కలిసి మెలిసి తిరుగుతూ ఉండడం, చనువుగా తనని ముట్టుకోవడం, తను కూడా నా మీద పడిపోతూ నవ్వడం లాంటివి చూస్తూనే ఉన్నాడు., అవ్వన్నీ చూస్తూ ఉండగా దాన్ని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశం తో వాడి ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ను కలుపుకుని వాడి ముందు నన్ను బాడ్ చేయడం మొదలు పెట్టాడు. అదంతా తెలీని నేను మామూలుగానే రూప తో ఎప్పటిలా ఎలా ఉంటానో అలా ఉన్నా. పార్టీ అయిపోతూ ఉండగా నేనూ రూపా ఇద్దరం తినడానికి వెళ్ళాం. నేను చైర్ మీద కూర్చుని తింటూ ఉంటే తను నా ముందు నిలబడి నాకు మాటలు చెప్తూ తింటూ ఉంది. అలా తింటూ ఉండగా దూరంగా నిలబడి మా వైపే చూస్తున్న రూప అమ్మ నెమ్మదిగా మా దగ్గరికి వచ్చింది. వస్తూ తినేప్పుడు కూడా మాటలేనా మీకు అంది. రూప తన అమ్మ వంక చూస్తూ మాట్లాడితే ఏమైంది నీకు అంది. రూప అమ్మ నా పక్కన ఉన్న చైర్ లో కూర్చుంటూ నీకు చాలా ఎక్కువైందే, మీ నాన్న ఏం అనడం లేదు అనేగా ఇదంతా, ఉండు త్వరలోనే నీ కథ ఎంటో చూస్తా అంది. రూప అదేం పట్టించుకోకుండా ఏమైనా చేసుకోపో అన్నట్లుగా చూసి అంతలోనే ఎదో గుర్తొచ్చి నా వైపు తిరిగి తిన్నాక ఫోటోలు దిగుదామా, అలా అని అంటూ అక్కడ ఫోటోగ్రాఫర్ పెట్టిన పోస్టర్ ను చూపించి అంది. అందులో ఒక జంట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పెళ్లి ఫోటోలు తీయించుకుని ఉండడం కనిపించింది. అది చూసి నేను సమాధానం ఇచ్చే లోగా రూప అమ్మ రూప ను చూసి హా దిగు దిగు, తరువాత మీ నాన్న వచ్చి పల్లు రాలగొడతాడు అంది. వెంటనే రూప కోపంగా తన అమ్మ ను చూసింది. రూప అమ్మ నన్ను రూప ను ఇద్దరినీ చూస్తూ ముందు మీ ఇద్దరికీ దూరం పెంచాలి లేకపోతే మరీ ఎక్కువ చేస్తున్నారు అని అంది. అంతే వెంటనే రూప కోపంగా ప్లేట్ పక్కన పెట్టేసి., కూర్చున్న నా దగ్గరికి వచ్చి నా తొడ మీద కూర్చుంది. అలా కూర్చుని వాళ్ళ అమ్మ వంక చూసి ఈ మాత్రం దూరం చాలా అంది. రూప అమ్మ వెంటనే చుట్టూ చూసింది. అక్కడ పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. వెంటనే కోపంగా చిన్న పిల్లవా ? లేవ్వు ముందు అని అంది. రూప నేను లేవను అన్నట్లుగా చూసింది. రూప అమ్మ ఇంకా ఎదో అనేలోపు మా వైపు కు రూప అమ్మ ఫ్రెండ్ ఒకరు రావడం కనిపించింది. అంతే వెంటనే రూప అమ్మ రూపను చూసి నీ సంగతి ఉందిలే తరువాత అని అంటూ పైకి లేచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ రూప ను చూసి కనీసం బయట వాళ్ళ ముందు అయినా మర్యాదగా ఉండు అని తన ఫ్రెండ్ రావడం చూపించి లేవమని ఇండైరక్ట్ గా చెప్తూ నవ్వు ముఖం పెట్టుకుని వస్తున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది. అలా తన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడ రూప ఇంకా నా మీదే కూర్చుని ఉంది. అది చూసి రూప అమ్మ ఇది మారదు అని అనుకుంటూ తన ఫ్రెండ్ కు మేము కూర్చుంది కనిపించకూడదు అని తనని అటు వైపుకు తీసుకువెళ్ళింది.
