పెళ్లి తరువాత.. 3 65

ఇంటికి వెళ్ళి రాత్రి అయితే తనే వస్తుంది లే ఎలాగోలా అని అనుకుంటూ తినేసి కాసేపు టివి చూసి తొమ్మిది అవుతూ ఉండగా పడుకున్నా. పడుకునే ముందు ఒకసారి రూప ఇంటి వైపు చూసా. అక్కడ కార్ లేదు. తను ఇంకా వచ్చినట్లు లేదు. అది చూసి తనే వస్తుంది లే అని అనుకుని వెళ్లి పడుకున్నా. పడుకున్న మాటే గానీ రూప ఇంకా రాలేదు అనే ఆలోచనలే నన్ను చుట్టుముట్టేసాయి. కాసేపు అటూ ఇటూ దొర్లుతూ ఇక తట్టుకోలేక వెళ్లి రూప కు కాల్ చేశా. తను లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ చేశా. తను లిఫ్ట్ చేసింది. నేను తనతో ఇక చాలు ఇంటికి వచ్చేయి అన్నా. తను సైలెంట్ గా ఉంది. నేను కోపంగా రూపా అన్నా. తను పలకలేదు. ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. తను మెల్లగా మాట్లాడుతూ ఒక్కసారి నా కోసం రాలేవా అంది. నేను ఎం అనలేదు. తను ఏడుపు గొంతు తో వినయ్ ఆఖరిసారి అడుగుతున్నా అంది. నేను ఎం పలకలేదు. తన ఫోన్ విసిరి గొట్టిన శబ్దం వినిపించింది వెంటనే ఫోన్ కట్ అయ్యింది. నేను మౌనంగా కాసేపు ఉండిపోయా. కాసేపు ఆలోచించి వెళ్లకపోవడమే మంచింది అని అనుకుని కళ్ళు మూసుకున్నా.
అలా మూసుకున్న కళ్ళు మళ్ళీ ఎదో ఫోన్ సౌండ్ వస్తే కానీ తెరుచుకోలేదు. కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే పన్నెండు నర అయ్యింది. ఈ టైం లో ఎవరా అని ఫోన్ చూసా. రూప అమ్మ నుండి కాల్ వస్తుంది. నేను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశా. అవతల నుండి రూప అమ్మ వినయ్ రూప నీ దగ్గర ఉందా అంది. నేను లేదు ఆంటీ అన్నా. వెంటనే తను కొంచెం కంగారు గా అయితే ఎక్కడికి వెళ్లింది తను, తన ఫోన్ కూడా స్విచెడ్ ఆఫ్ వస్తుంది అంది. నేను అవునా అంటూ బెడ్ మీద నుండి లేచి కూర్చున్నా. తను కొంచెం కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది, ఈ టైం అయినా కూడా ఇంకా ఎం కాల్ రాలేదు, పైగా ఇంట్లో మీ అంకుల్ కూడా లేడు అని కంగారుగా అంటూ ఉంటే నేను వెంటనే తనని చల్ల బరుస్తూ ఆంటీ ఆంటీ, కంగారు పడకండి నాకు గుర్తు వచ్చింది. తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అన్నట్లుగా చెప్పడం అని అన్నా. తను వెంటనే అవునా సూర్ కదా అంది. నేను అవును ఆంటీ మీరేం టెన్షన్ పడకండి కావాలంటే నేను కాసేపాగి కాల్ కూడా చేయిస్తా మీకు అన్నా. తను అయ్యో ఈ టైం లో ఎందుకు లే తను అయితే ఫ్రెండ్ ఇంట్లో ఉంది కదా అది చాలు లే అంటూ సరే పడుకో మళ్ళీ నీ నిద్ర ఎందుకు డిస్ట్రబ్ అని అంది. నేను అయ్యో పర్లేదు ఆంటీ అంటూ గుడ్ నైట్ చెప్పేసి ఫోన్ పెట్టేసా. ఫోన్ పెట్టేసిన క్షణం లోనే బెడ్ మీద నుండి కిందికి ఫాస్ట్ గా దూకి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ రూప సెల్ కు కాల్ చేయడం మొదలు పెట్టా. రూప అమ్మ ఏదైతే చెప్పిందో అదే రెస్పాన్స్ వస్తుంది. స్విచేడ్ ఆఫ్ అని. నేను కంగారు గా డ్రెస్ వేసుకుంటూ పరుగు లాంటి నడకతో బయటకు వెళ్ళా. వెళ్లి బ్లూటూత్ పెట్టుకుని రిపీటెడ్ గా కాల్ చేస్తూ బండి తీసా. నా గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తూ ఉంది. బైక్ స్పీడ్ ను ఫుల్ గా పెంచా. ఫోన్ అలా చేస్తూనే ఉన్నా. ఇంకో కిలో మీటర్ దూరం ఉంది అనగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోయి ఫోన్ రింగ్ అవ్వడం మొదలు అయ్యింది. అంతే వెంటనే మళ్ళీ మళ్ళీ డయిల్ చేయడం మొదలు పెట్టా. అలా చేస్తూ ఉండగా సడెన్ గా ఫోన్ లిఫ్ట్ అయ్యింది. నేను రూపా రూపా అన్నా. అవతల నుండి హెలో అని మగవాళ్ళ గొంతు వినిపించింది. అంతే నా గుండె ఆగినట్లైంది, నేను వెంటనే ఎవరు నువ్వు రూప ఎక్కడ అని అరిచినట్లు గా అడిగా. అవతల ఎవడో వాడు ఎదో గొణుక్కుంటూ హెలో అన్నాడు. నేను ఎవర్రా నువ్వు రూప ఎక్కడ అన్నా వాడు అవతల నుండి ఎవరు సారు నాకేమీ తెలీదు, ఫోన్ ఇక్కడ పడేసి ఉంటే చూసాను అంతే నాకేమీ తెలీదు అన్నాడు అలా అంటూ ఫోన్ పెట్టేసాడు. నేను వెంటనే మళ్ళీ ట్రై చేశా. వాడు మల్లీ ఎత్తాడు. నేను వెంటనే ఫోన్ పెట్టేయకు చంపేస్తా అని అంటూ అసలు నువ్వు ఎక్కడున్నావ్ అన్నా. వాడు భయపడుతూ సారు నాకేం తెలీదు నేను పార్క్ దగ్గర ఉన్నా కావాలంటే ఇది తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. నేను కోపంగా అసలు ఆ ఫోన్ ఎక్కడ దొరికింది రా నీకు, అసలు రూప ఎక్కడ అని అన్నా. దానికి వాడు ఏమో సారు నాకేం తెలీదు ఇక్కడ మందు సీసాల మద్యన పోను పడేసి ఉంది, అది ఆపు అయ్యి ఉంటే ఆను చేశా అంతే అన్నాడు. నేను మందు సీసాలా ? అసలు నువ్వు ఎక్కడున్నావ్ ? నీ ముందు కార్ ఏమైనా ఉందా ? అన్నా. వాడు కారా సారు ఏమో అంటూ కాసేపు ఆగి అవును సారు ఒకటి ఉంది అని అనగానే నేను ఊపిరి పీల్చుకుంటూ అక్కడ అమ్మాయి ఏమైనా ఉందా అన్నా. వాడు అమ్మాయా అంటూ చూస్తూ ఏమో కనిపించడం లెడు సారూ అంటూ అంతలోనే సారు సారు అమ్మాయి లేదు కానీ ఆ తాగు బొతు వాళ్ళు మాత్రం ఉన్నారు అన్నాడు. అంతే నాకు గుండె వేగం పెరిగింది. కొంచెం భయం కలిసిన గొంతు తో ముగ్గురున్నారా ? అన్నా. వాడు అవును సారు అంతే కాదు మీరు అడిగిన ఆ అమ్మాయి అని ఇంకా ఎదో చెప్తూ వుండగానే ఫోన్ కట్ అయ్యింది. నేను కోపంగా రెడైల్ చేశా. స్విచేడ్ ఆఫ్ వచ్చింది. బైక్ వేగం మాక్సిమం చేశా. ఫుల్ స్పీడ్ లో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే వెళ్ళా. సాయంత్రం ఆ ముగ్గురే కదా రూప తో మిస్ బిహేవ్ చేసింది ఇప్పుడేమైనా వాళ్ళు అదే పని మీద ఉన్నారా అని ఆలోచన వచ్చింది. అంతే రక్తం మరిగిపోయింది. బైక్ ఇంకా ఎక్కువ స్పీడ్ గా పోనించా. నా అనుమానం బలం చేయడానికి ఆ ఫోన్ కూడా సరిగ్గా ఆ మందు బాటిల్స్ దగ్గరే దొరికింది వాడికి. అది గుర్తు రాగానే నా అనుమానం నిజమే అని అర్దం అయిపోయింది. చాలా స్పీడ్ గా నడుపుతూ పార్క్ దగ్గరికి ఎంటర్ అయ్యా. అక్కడ దూరంగా కార్ కనిపించింది. అది చూడగానే ఇంకా వేగం తో దాని దగ్గరకు వెళ్ళా. వెళ్లి బైక్ ను పక్కన పడేసి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసా. లోపల రూప స్టీరింగ్ మీద తల పెట్టుకుని పడుకోవడం కనిపించింది. తన కంట్లో నీళ్ళు కారుతున్నాయి. నేను గట్టిగా డోర్ ను తడుతూ యే రూపా, రూపా అంటూ పిలిచా. తను సడెన్ గా కళ్ళు తెరిచి నన్ను చూసింది. తనని చూస్తూ ఉంటే ఇక్కడ నేను అనుమానించింది ఎం జరగలేదు అని అర్దం అవుతూ ఉంది. అయినా కూడా నమ్మలేక తనని తెరువు అని అన్నా. తను నేను రావడాన్ని చూస్తూ కొంచెం ఆనందం తో తలుపు తెరిచింది. కానీ నేను ఉన్న పరిస్థితి తనకు తెలీదు. నేను కోపంగా తనని బయటకు లాగేసా.
తను హేయ్ ఎన్టీ ఏమైంది అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంది. నేను తన డ్రెస్ ను బాడీ నీ పరికించి పరికించి చూస్తూ తనకెలాంటి హానీ జరగలేదు అని కంటితో కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నా. తను నా వంక చూస్తూ నా ప్రేమను నిజం చేయటానికి నీకింత సమయం పట్టిందా అంది. ఆ మాట వినగానే నాకు చివ్వున కోపం వచ్చింది వెంటనే తలెత్తి తనని చూస్తూ తన చెంప మీద రెండు ఫట్ ఫట్ మంటూ కొట్టా. తనకి ఎం అర్దం కాలేదు. నేను తనని కోపంగా చూస్తూ నీ సెల్ ఎక్కడ అన్నా. తను తల దించుకుని ఎటో పడేశా అంది. నేను తనని చూసి బుద్ధి లేదు అంటూ ఇంకో రెండు సార్లు బలంగా కొట్టా. అలా కొడుతూ ఉంటే తన కంట్లో కన్నీళ్లు ఇంకా ముఖం లో ఆనందం రెండూ ఒకే సారి రావడం కనిపించింది. నేను అది చూసి కొడుతుంటే ఆ ఆనందం ఎంటే నీకు అన్నా. తను నా ముఖం లోకి చూస్తూ, నువ్విలా కొడుతుంటే నాకు నీ కోపం కాకుండా నీ ప్రేమ తెలుస్తూ ఉంది అంది. నేను ఉఫ్ అనుకుంటూ కోపంగా తన వంక చూసా..
చూస్తూ మనసులో అనుకున్నా నేను వచ్చిన పరిస్థితి ఏంటి ? తను ఎం వాగుతుంది అని. అలా అనుకుంటూ కోపంగా పక్కకు వచ్చి అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చున్నా. తను కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చింది. నేను తలెత్తి తనని చూసా. తను మౌనంగా ఉంది. నేను తనని కోపంగా చూస్తూ, అక్కడ ఒకపక్కఏమో మీ అమ్మ ఫోన్ లో కంగారు పడుతూ ఉంటే, ఇక్కడ నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంటే, అర్థరాత్రి నువ్వు ఒంటరిగా అదీ తాగుబోతులు తిరిగే చోట ఉన్నావ్ అని తలుచుకుంటూ ఉంటే నాకు ఒళ్ళంతా భయం తో చెమటలు పడుతుంటే కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చా. వచ్చి నువ్వెలా ఉన్నావో చూస్తుంటే నువ్వేమో ప్రేమ దోమా అని అంటున్నావ్, నీకంత వెర్రి వాడిలా కనిపిస్తున్నానా నేను అన్నా. తను ఎం అనలేదు. నేను తన వంక అలాగే చూస్తూ నీకేమైనా అవుతుందేమో అని నాకిక్కడ గుండె దడ పుడుతు ఉంటే నీకేమో ఆనందంగా ఉంది కదా, అవునా అన్నా వెటకారంగా చూస్తూ..
తను ఎం అనలేదు. నేను పైకి లేస్తూ తనని చూసి, ఒక ఆడపిల్ల ఇలా అర్థరాత్రి వొంటరిగా ఉంటే అక్కడ అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా ? ఎంత భయంగా ఉంటుందో తెలుసా ? అంటూ తనని చూసా. తనేం పలకక పొయే సరికి నేనే మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే లోపల నా గుండె ఎన్ని సార్లు ఆగినంత పని అయ్యిందో తెలుసా నీకు అన్నా. తను నా ముఖం లోకి చూసింది. నేను తనని చూస్తూ ముందే సాయంత్రం ఆ తాగుబోతుల తో గొడవ పడ్డావ్, వాళ్ళని అప్పుడే ఎం చేయలేక పోయావ్ అలాంటిది ఒంటరిగా అర్థరాత్రి ఒకవేళ వాళ్ళ చేతికి నువ్వు చిక్కి ఉంటే ? అప్పుడు ఏమయ్యేది ? అన్నా కోపంగా. తను తాగుబోతు లా అంటూ డౌట్ గా చూసింది నా వంక.

7 Comments

  1. Super super love it

  2. Love story very interesting and lovely

  3. Bro fast gaa Pettu bro
    Full story

  4. Continue the night shift and janmanichhina thalli kosam prayanam

  5. చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. అపకు బ్రదర్

  6. చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. ఆపకుండా పూర్తి చేయి బ్రదర్

  7. The best story ever I found in this website

Comments are closed.