పెళ్లి తరువాత.. 3 65

తను ఇంకాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. నేను ఊహల్లో తెలిపోవడం స్టార్ట్ చేశా. వినయ్ గాడు వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తున్నట్లు, వాడి వెచ్చటి కౌగిలిలోకి నన్ను తీసుకుంటున్నట్లు, ప్రేమగా నా నుదిటిపై ముద్దు పెడుతున్నట్లు ఇలా ఊహించుకుంటూ ఉండగా అప్పుడే మహి వచ్చి సైగ చేసింది. విన్ను గాడు వస్తున్నాడు అంటూ. అంతే వెంటనే నేను అలర్ట్ అయిపోయి వాడి కోసం వెయ్యి కళ్ళతో తలుపు వైపు చూసా. వాడు లోపలికి వస్తూ నన్ను చూసాడు. నన్ను చూడడం తోనే వాడు ముఖం వెలిగిపోయింది. అది చూసి నాకు సంతోషం వేసింది. క్షణం లో వాడు నా వొళ్ళో వాలిపోయాడు. నేను ప్రేమగా వాడ్ని నిమురుతూ నా కోసం ఎడ్చావా కన్నా అన్నా. వాడు నాకు వాడి ముఖం కనిపించకుండా నా పొట్టకేసి దాచిపెట్టుకుంటూ నన్ను చేతులతో వాటేసుకుంటూ నన్ను వదిలి వెళ్లకు రూపా అన్నాడు. నేను నవ్వుతూ పిచ్చోడా నేనెందుకు వెళ్తా అంటూ వాడి నుదుటి పైన ముద్దు పెట్టుకున్నా. అలా పెట్టుకుంటు వాడి కళ్ళలోకి చూసా. చిన్నటి నీటి పొర వాడి కంట్లో కనిపించింది. నేను దాన్ని చూసి ఏమైంది అన్నా. వాడు ఏం లేదు అన్నట్లు తల ఊపాడు. వాడు ఏం చెప్పక పోయినా కూడా వాడి ఫీలింగ్ ఏంటో నాకు అర్దం అయిపోయింది. వెంటనే వొడిలో పడుకుని నన్నే చూస్తున్న వాడిని ప్రేమగా నిమురుతూ తల కిందికి దించి వాడి బగ్గ మీద ముద్దు పెట్టా. నిజానికి నా ఉద్దేశం బుగ్గ కాదు పెదాలు కానీ వాడు ఇంకా పూర్తిగా ఎదగలేదు అందుకే ఎందుకులే అని కాస్త డైవర్ట్ చేసి బుగ్గ పై ముద్దు పెట్టా. వాడు ప్రేమగా నా తలను వాడికేసి అదుముకున్నాడు.
అప్పుడే అనుకున్నా, వినయ్ గాడిని ఎట్టి పరిస్థితిలోనూ వొదులు కోకూడదు అని.

ఆ రోజు సంఘటన గుర్తు తెచ్చుకోగానే ఎందుకో విన్ను గాడి మీద ప్రేమ ఇంకో వంద రెట్లు పెరిగినట్లు అయ్యింది. ఎదురుగా పడుకుని ఉన్న వాడి వంక చూస్తూ ప్రేమగా దగ్గరకు వెళ్ళా. దగ్గరకు వెళ్తూ హాయిగా నిద్ర పోతున్న వాడిని చూస్తూ మనసులో అనుకున్నా. ఆ రోజంటే ఇంకా ఎదగలేదు అని వదిలేసా. మరి ఇప్పుడు ఇలా మగతనం తో ఉట్టి పడుతున్న నిన్ను, నీ పెదాలను ఎలా వొదలమంటావ్ రా అని అనుకున్నా.
అలా అనుకుంటూ చిన్నగా నా పెదాలతో వాడి పెదాలను తాకించడానికి ట్రై చేశా. అలా దగ్గరికి వెళ్తుంటే వాడి వెచ్చటి ఊపిరి నాకు గిలిగింతలు పెట్టింది. నేను ఇంకా దగ్గరికి వెళ్తూ ముద్దు పెట్టబోయా. అంతే వాడు కళ్ళు తెరిచాడు.
నేను సడెన్ గా పైకి లేచి కూర్చున్నా. వాడు కూడా లేచి కూర్చున్నాడు. నిమిషం పాటు ఎం మాట్లాడు కోలేదు.
నాకేం చెప్పాలో తెలియలేదు కానీ వాడు గానీ నోరు విప్పితే ఇంక ఏదేదో అనేస్తాడు అది మాత్రం పక్కా అని నాకు తెలుసు. అందుకే ఫాస్ట్ గా ఎం చేయాలి ఎం చేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టా. వాడు నన్ను కాస్త కోపంగా చూస్తూ ఎదో అనబోయాడు.
అంతలోనే నేను తేరుకుని షటప్ అన్నా కాస్త కోపంగా చూస్తూ. నేను ఎందుకు కోపంగా రియాక్ట్ అవుతున్నానో వాడికి అర్దం కాక సైలెంట్ అయిపోయాడు. నేను వాడిని కోపంగా చూస్తూ బెడ్ దిగి డ్రెస్ సరి చేసుకుని కోపం నటిస్తూ బెడ్ రూం నుండి బయటకు వచ్చేశా. మనసులో హమ్మయ్యా తప్పించు కున్నా అని అనుకుంటూ పరుగు లాంటి నడకతో మా ఇంటికి వచ్చేశా.
పొద్దున వాడిని ఎలా ఫేస్ చేయాలో ఏంటో అనుకుంటూ రాత్రంతా ఆలోచిస్తూ ఉండిపోయా…

7 Comments

  1. Super super love it

  2. Love story very interesting and lovely

  3. Bro fast gaa Pettu bro
    Full story

  4. Continue the night shift and janmanichhina thalli kosam prayanam

  5. చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. అపకు బ్రదర్

  6. చాలా బాగుంది..వెబ్సైట్ లో బెస్ట్ స్టోరి.. ఆపకుండా పూర్తి చేయి బ్రదర్

  7. The best story ever I found in this website

Comments are closed.