నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 3 121

****

అనిమిష స్నానం చేసి బయటకు వచ్చి చూసి గతుక్కుమంది. అనిరుద్ర తాపీగా మ్యాగజైన్ చదువుతున్నాడు. కళ్లకు కట్టిన గంతలు కిందికి జారి ఉన్నాయి.

“ఏం చేస్తున్నావ్?” కీచు, గొంతుతో అడిగింది అనిమిష.

“కనపడట్లేదా? మ్యాగజైన్ చదువుతున్నాడు. సెక్స్లో ఆసక్తి లేకపోవడానికి ప్రిజిడిటీ అంటారుట…” అన్నాడు. అనిమిష” వంక చూస్తూ… స్నానం చేసొచ్చిన అనిమిష దగ్గరకు లాక్కోవాలన్నంత ఫ్రెష్ గా ఉంది.

“నన్ను మోసం చేశారు. కళ్లకు గంతలు విప్పేశారు” ఉక్రోషంగా అంది.

“సారీ… నేనేం మోసం చేయలేదు. నా కళ్లకు గంతలు కడతానంటే సరేనన్నాను. కళ్లకు గంతలు విప్పుకోకూడదన్న షరతు ఏమీలేదు. అయినా కళ్లకు గంతలు కట్టాలన్న గుడ్డి ఆలోచన వచ్చింది కానీ… గంతలు విప్పుకోకుండా చేతులకు కూడా కట్టాల్సింది…” అన్నాడు అనిరుద్ర. .

ఓసారి కోపంగా అనిరుద్ర వంక చూసి, “నాకు ఛాన్స్ వస్తుంది” అంది అనిమిష

“అవును… ఇప్పుడే వస్తుంది. నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. నీ పగ, నీ ప్రతీకారం తీర్చుకోవచ్చు. పీప్ హోల్లో నుండి చూసి” చెప్పి బాత్రూంలోకి వెళ్లాడు అనిరుద్ర.

ఈసారి అనిమిషకు కోపం రాలేదు. పైగా నవ్వొచ్చింది. అనిరుద్ర మాటలకు ముద్దోచ్చింది.

****

బాత్రూంలో నుండి బయటకు వచ్చి అడిగాడు అనిరుద్ర. “ముగ్గు గిన్నె ఎక్కడ?” అని.

“ఎందుకు?” అడిగింది అనిమిష.

“ఎందుకేమిటీ… డ్యూటీ ఎక్కడానికి… వాకిలి ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గులు పెట్టాలిగా… డ్యూటీలో జాయిన్ అయిపోతాను”

“వద్దోద్దు… బయట మా బాస్ ఉన్నారు. ఈ ఒక్కరోజు నేనే చేస్తాను” అంది అనిమిష.

“నా జీతంలో కట్ చేస్తే ఊర్కోను” అన్నాడు అనిరుద్ర.

“చేయను…”

“సరే… అన్నట్టు ఈవేళ కూరేం చేయాలి” అడిగాడు అనిరుద్ర..

“ఈ రోజు ఆఫీసులో మా బాస్ పార్టీ ఇస్తున్నారు. నాతోపాటు మీరూ రావాలి”

“బస్సులో అయితే రాను.. ఎట్లీస్ట్ ఆటోలో అయితేనే వస్తాను”

“సరే” అంది అప్పటికా గండం తప్పించుకోవాలని.

****