నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 3 121

ఆ వేళ మధ్యాహ్నం శోభరాజ్ ఓ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు అనిమిష దంపతులకు. అనిమిష అనిరుద్రలకు కలిపి ఓ చెక్ వున్న కవర్ ఇచ్చి చెప్పాడు, “ఇంటికి వెళ్లాక చూసుకోవాలి. అప్పటివరకు సస్పెన్స్” అని. అంతా భోజనాలు చేస్తున్నారు. శోభరాజ్ అనిరుద్రతో అన్నాడు.

“మిస్టర్ అనిరుద్ర… మీరు లక్కీ.. అనిమిషలాంటి అమ్మాయి మీకు భార్యగా దొరికినందుకు”

నవ్వాడు అనిరుద్ర. శోభరాజ్ కొనసాగించాడు.

“నిజం చెప్పాలంటే… టుబీ ఫ్రాంక్ నేను అనిమిషను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. పెళ్లి ప్రపోజల్ కూడా చేశాను. అయినా అనిమిష ధైర్యంగా సిన్సియర్గా నాకు ‘నో’ చెప్పింది. మీరు లక్కీ అని ఎందుకు అన్నానంటే… ఏ అమ్మాయి అయినా డబ్బుకన్నా కీర్తిప్రతిష్టలకన్నా ఎవరు ముఖ్యం అని భావిస్తుందో ఆ వ్యక్తి నిజంగా అదృష్టవంతుడే. ఆ విధంగా నన్ను రిజెక్ట్ చేసి మిమ్మల్ని సెలక్ట్ చేసుకుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీ జంటను

ఆశీర్వదిస్తున్నాను”

అనిమిష మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్. తను మోసం చేసిందా… అన్న గిల్టీ కాన్షియసనెస్.

“ఫ్ అంతా గిఫ్ట్లు ఇచ్చారు. కొందరు క్యాష్ చెక్లు ఇచ్చారు. ద్విముఖ ఓ కవర్లో చెక్ పెట్టి అనిమిషకు ఇచ్చింది. అనిరుద్రకు ఓ కార్డు మీద, ‘కలిసి వుంటే కలదు సుఖం’ అని క్యాప్షన్ రాసి కవర్లో పెట్టి ఇచ్చింది.

***

ద్విముఖ మరో ఫ్రెండింటికి షిఫ్ట్ అయ్యింది. ఆ రాత్రి అనిరుద్ర, అనిమిష గిఫ్ట్ ప్యాకెట్లు, సర్దుతున్నారు. అనిమిష తన పేరు మీద వచ్చిన కవర్లు ఓ పక్కన పెట్టింది. అందులో వున్న ద్విముఖ కవర్ తీసింది. చెక్ లో అమౌంట్ చూసి షాకయ్యింది. వెంటనే ద్విముఖకు ఫోన్ చేసింది.

“నా బ్యాంక్లో వున్న అమౌంట్… నిజానికి ఇంకా పెద్ద మొత్తమే ఇద్దామనుకున్నాను. నీ కథ విన్నాక, నేను ఇచ్చింది చిన్న మొత్తమే అనిపిస్తోంది. జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ వుంది కాబట్టి ఆ మొత్తం ఇచ్చాను. ప్లీజ్ అపార్ధం చేసుకోవద్దు” ద్విముఖ మాట్లాడుతుంటే అనిమిష కళ్లల్లో సన్నటి కన్నీటి పొర.

“అనిమిషా… మీ ప్రేమకు రిటైర్మెంట్ వుండకూడదనే నా కోరిక” అంది ఫోన్ పెట్టేసే ముందు. .

****

“మీ బాస్ చెక్ ఇది” అన్నాడు శోభరాజ్ ఇచ్చిన చెక్ అనిమిషకు ఇస్తూ. చెక్ అమౌంట్ చూసి మరోసారి షాక్ తింది. పాతిక వేల చెక్ అది… కొత్త సంసారంలో సామాను కొనుక్కోవడానికి… చిన్న కానుక” అన్న అక్షరాలు వున్న కాగితం వుంది ఆ కవర్లో.

“మీ బాస్ బాసాసురుడు కాదు… బాసురుడే… అన్నట్టు ఇందులో పన్నెండున్నర వేలు నావి. ఎందుకంటే… గిఫ్ట్ మనిద్దరి పేరు మీద వుంది” అనిరుద్ర అన్నాడు.

“అదేం కుదర్దు… నా బాస్… కాబట్టి గిఫ్ట్ అమౌంట్ నాదే…” అంది అనిమిష.

“మీ బాస్ ఫోన్ నెంబర్ ఉందా?” అడిగాడు అనిరుద్ర “ఎందుకు?”

“మన లెక్క సెటిల్ చేసుకుందాం. నిజాయితీగా ఎవరి గిఫ్ట్లు వారికే చెందాలి. నువ్వు చీట్ చేస్తే ఊర్కోను”

“ఛీఛీ… గిఫ్ట్ లో కూడా కక్కుర్తేనా?” అంది అనిమిష. “కక్కుర్తి… దాని కజిన్ చీకుర్తి నీదే…” అన్నాడు అనిరుద్ర.

“పోనీ నేను ఇరవై వేలు తీసుకుంటాను. నువ్వు అయిదు తీసుకో “అదేం కుదర్దు… ఫిఫ్టీ… ఫిఫ్టీ… దట్సాలంతే” అన్నాడు.

కోపంగా అతని వంక చూసి, “ఛఛ… కాసింత మానవత్వం కూడా లేదు” అంది.

“అంతా మనీ తత్వమే… నో… మానవత్వం…” అన్నాడు అనిరుద్ర ఆవులిస్తూ.

****