నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 3 121

అనిమిష ఇంట్లోకి అడుగుపెట్టేసరికి హాలులో సామాన్లతో రెడీగా వుంది ద్విముఖ.

“ఏమిటిది?” ఆశ్చర్యంగా అడిగింది అనిమిషం

“నేను వేరే ఫ్రెండ్ రూమ్లోకి మారుతున్నాను. నీకు ఇప్పటికిప్పుడు వేరే ఇల్లు దొరకడం కష్టం. పైగా ఇలాంటి ఇల్లు దొరకదు. నాకంటే పెద్ద ప్రాబ్లమ్ లేదు. నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను” అంది ద్విముఖ.

అనిమిష ద్విముఖను వాటేసుకుంది. ఏం మాట్లాడాలో కూడా అర్ధంకావడంలేదు. అప్పుడే ఓ, కారు వాళ్ల ఇంటి ముందు ఆగింది. శోభరాజ్ కారులో నుండి దిగాడు. భావన, నిఖిత, ఆర్ముగం కారులో నుంచి దిగారు. పళ్లు, స్వీట్స్… ఆర్ముగం తెచ్చి ఇంట్లో పెట్టాడు.

“సర్… ఏమిటిది?” అడిగింది అయోమయంగా అనిమిష

“మీ ఏర్పాట్లు మీకు ఉంటాయి. నేనెలా చెప్పాలి…” అంటూ భావనవైపు చూసి, “మీరు చెప్పండి భావన…” అన్నాడు. భావన వచ్చి అనిమిష చెవిలో చెప్పింది. అనిమిష మొహం ఎర్రబడింది.

నిఖిత అనిమిష చెయ్యి నొక్కి వదుల్తూ, “ఈ రోజంతా మేము ఇక్కడే ఉంటాం. అఫ్ కోర్స్

హాలులో… ఇది బాస్ ఆర్డర్…” అంది.

ద్విముఖ, అనిమిషలు మొహమొహాలు చూసుకున్నారు. “కొంపదీసి మీ బాస్ కి అనుమానం రాలేదు కదా…” మెల్లిగా అడిగింది అనిమిషకు మాత్రమే వినిపించేలా ద్విముక.

“ఏమో… ఇప్పుడెలా?” అడిగింది అనిమిష.

“ఎలా ఏమిటి… కానిచ్చేయడమే…” అంది ద్విముఖ. అనిమిష సీరియస్గా చూడడంతో “అదే నాటకం కంటిన్యూటీని కానిచ్చేయడమే. గదిలో మీరేం చేసేది వీళ్లు చూడొచ్చారా అంది.

శోభరాజ్ అనిమిషవైపు చూసి, “అనిమిషా నీకు ఎవరూ లేరని ఫీలవ్వకు… ఎటు జెడ్ అన్నీ సమకూరుతాయి. అన్నీ శాస్త్ర ప్రకారం, సంప్రదాయబద్ధంగా జరుగుతాయి” అంటూ ద్విముఖవైపు చూసి, “మనం ఆరు బయట కూర్చుని కబుర్లు చెప్పుకుందాం” అన్నాడు అంతా ఆరు బయట సెటిలయ్యారు. శోభనం గదిలో అనిమిష, అనిరుద్ర.

****

మంచం మధ్యలో కూర్చొని రెండు చేతులు చుబుకానికి ఆన్చుకొని మొకాళ్ల మధ్య తల పెట్టి ఓరగా కోరగ అనిరుద్ర వైపు చూడసాగింది అనిమిష.

“ఎంతసేపు చూస్తావు? మెడ పట్టేస్తుంది. లుక్కు మార్చు” “నీ చూపులో నాకు డిఫరెన్స్ కనిపిస్తోంది” అంది అనిమిష

“ఇప్పుడు నన్నేం చేయమంటావ్… బయటకు వెళ్లిపోనా…” అడిగాడు తలుపు దగ్గరకి నడుస్తూ అనిరుద్ర.

“వద్దు… మా బాస్ చూస్తే డౌటొస్తుంది” అంది.