సాయంత్రం అనిమిష ఆఫీసు నుండి వచ్చేసరికి అనిరుద్ర చపాతీలు చేస్తూ కనిపించాడు. అలసటగా హ్యాండ్ బ్యాగ్ ను సోఫాలోకి గిరాటు వేసి, బాత్రూమ్లోకి వెళ్లి ఫ్రెషప్ అయ్యి… శారీ విప్పేసి, నైటీ కోసం చూస్తోంది అలవాటుగా.
అప్పుడే కాఫీ పట్టుకొచ్చిన అనిరుద్ర పెట్టీకోట్, బ్లౌజ్తో వున్న అనిమిషను చూసి అలాగే నిలబడిపోయాడు.
“ఏయ్… ద్విముఖా… ఏం చేస్తున్నావే…” అంటూ ఎదురుగా వున్న అనిరుద్ర చూసి కెవ్వున అరిచి రెండు చేతులను క్రాస్లా గుండెలకు అడ్డుపెట్టుకుంది.
“థాంక్యూ” అని కాఫీ కప్పు అక్కడ పెట్టి వెళ్లాడు . గబగబా చీర కట్టుకొని ఓరకంటి హాలులో కూర్చున్న అనిరుద్ర వైపు చూసింది. తనకు పెళ్లయ్యిందన్న విషయమే మర్చిపోయింది ద్విముఖ ఉన్నట్టే ఫీలై, అలవాటుగా నైటీ మర్చిపోయింది. తనని చూసిన అనిరుద్ర ‘సారీ’ చెప్పకుండా ‘థాంక్స్” అని ఎందుకు వెళ్లిపోయాడు.
వెంటనే సిగ్గును పక్కన పెట్టి అనిరుద్ర దగ్గరకెళ్లి, “హలో… ఏమిటీ.. ఫ్రీ షో చూసినట్లు చూసి… చప్పున సారీ చెప్పకుండా ‘థాంక్స్’ అని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి?” అని అడిగింది.
“శారీ లేకుండా మలయాళ కుట్టేలా కనిపించారు. ఇలాంటి క్లిప్పింగుల కోసం సినిమాలకెళ్తాం. నా పెళ్లాం అలా కనిపించేసరికి కర్టెసీ కోసమైనా థాంక్స్ చెప్పొద్దా. అయినా , ఇందులో మిస్టేక్ ఏముంది? డోర్ ఓపెన్ చేసి, షట్టర్ ఓపెన్ చేసినట్టుగా అందాల్ని క్యాట్ వాక్లా చూపిస్తుంటే నా తప్పేముంది…” అన్నాడు అనిరుద్ర.
“ఛీఛీ… మీ నోట్లో నోరు పెట్టడం నాదీ తప్పు” అంది అనిమిష.
“నా నోట్లో నువ్వు నోరెప్పుడు పెట్టావు? కనీసం ముద్దు కూడా పెట్టలేదు. కమల్ హాసన్ ఈ డైలాగ్ వింటే సంతోషపడిపోతాడు” అనిమిష రుసరుసలాడుతూ తన గదిలోకి వెళ్లిపోయింది.
****
అనిరుద్ర చేసిన కాఫీ ఆమెకు బాగా నచ్చింది. చపాతీ వాసన అదిరిపోతోంది.
“చపాతీలోకి ఏం చేస్తున్నారు? బంగాళాదుంప అయితే అదిరిపోతుంది” అంది కిచెన్ లోకి వచ్చి అనిమిష.
“అదిరిపోతే చెయ్… నాకూ ఆకలి దంచేస్తోంది” అన్నాడు అనిరుద్ర.
“నేనా… ఇప్పుడా…”
“నువ్వు కాకపోతే కరీనాకపూర్ వచ్చి చేస్తుందా? ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం చేస్తావా?” అడిగాడు అనిరుద్ర.
“మీరు చేయరా?”
“హలో… ఈవెనింగ్ డ్యూటీ నీదే… ఆఫీసుకు వెళ్లే హడావుడిలో వున్నావని మార్నింగ్ ఎక్స్ట్రా పనులు కూడా చేశాను”
అనిమిష వెంటనే బంగాళాదుంప కూర చేయడంలో మునిగిపోయింది.
* **
Good love story
Good love story
Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j