నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“మరెవ్వరితో వెళ్లే వస్తుందో…” కోపంగా అనిరుద్రవైపు చూస్తూ అంది అనిమిష.

“అబ్బ… మీ గొడవ ఆపండే…” అంటూ అనిరుద్రవైపు చూసి, “చూడండి అనిరుద్రా… దీంట్లో మీక్కూడా లాభం ఉంది” అంది ద్విముఖ.

“అవును… దీంట్లో గెలిస్తే.. ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తా” అంది అనిమిష.

“ఏంటీ… లక్ష రూపాయలు గెలిస్తే… ఒక నెల శాలరీ బోనస్గా ఇస్తావా? థాంక్స్ ఓ పని చెయ్… షోకి నా ఫొటో తీసుకొని వెళ్లు. నేను రాను”

“నువ్వు రాకుండా వాడెలా ఇస్తాడు లక్ష?”

“మరదే… నీకు లక్షిస్తే… నాకు నెల బోనస్సేమిటి? నాదే మేజర్ పార్ట్… నాకు సిక్స్టి నీకు ఫార్టీ…”

“అక్కర్లేదు” అంది ఉక్రోషంగా అనిమిష.

వెంటనే ద్విముఖ అనిమిషను మోచేత్తో పొడిచి, “తొందరపడకు. అతణ్ణి జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. అవసరం మనది. ఫిఫ్టీ ఫిఫ్టీ ఇచ్చినా యాభై వేలు వస్తుంది కదా” అంది.

అనిరుద్ర ఓ చెవి అటువేశాడు.

అనిమిష అనిరుద్రవైపు చూసి, “సరే సరే… ఫిఫ్టీ ఫిఫ్టీ… కానీ ఓ షరతు”

“షరతు కాదు. రిక్వెస్ట్ అనాలి. చెప్పు”

“సరే రిక్వెస్ట్… మిగతా నీ వంతు యాభై వేలు… నాకు అప్పుగా ఇవ్వాలి. నెలనెలా కొంత పే చేస్తాను”

“నాకు డౌట్ గా ఉంది. ఈ డబ్బంతా ఏం చేస్తున్నావు? ఏ స్విస్ బ్యాంక్ కో తరలించడం లేదు కదా… నన్నేమీ ఇరికించవు కదా” అన్నాడు అనిరుద్ర అనుమానంగా.

“నేను జెన్యూన్” అంది ఉక్రోషపడిపోతూ అనిమిష.

“థాంక్స్… సరే… ఏం చేస్తాం… బట్ వన్ కండీషన్… ఆ యాభై వేలకు ఇంట్రెస్ట్ పే చెయ్యాలి. లేకపోతే నీకు డబ్బివ్వడానికి నాకు ‘ఇంట్రెస్ట్’ ఉండదు”

“సరే…” అంది అనిమిష.

“పద… చెక్ తెచ్చేసుకుందాం” అన్నాడు అనిరుద్ర.

“ఏంటీ తెచ్చుకునేది… పోటీలో పాల్గొని బెస్ట్ కపుల్ గా ప్రైజ్ కొట్టేయాలి. ఈలోగా బాగా ప్రిపేర్ అవ్వండి” ద్విముఖ చెప్పింది..

“నేను బాగానే ప్రిపేర్ అవుతాను. వన్ మోర్ కండీషన్. పోటీలో నేను జీవించేస్తాను. ఆఫర్స్ ప్రైజ్ కోసమే… అందులో భాగంగా నేను తన నడుం మీదో, ఇంకెక్కడో చెయ్యి ” దగ్గరకు లాక్కున్నా “ఇది’ పెట్టుకున్నా అభ్యంతరం పెట్టకూడదు”

“నేనొప్పుకోను” అంది అనిమిష.

“అయితే నేనూ ఒప్పుకోను” అన్నాడు అనిరుద్ర.

“అనిమిషా పోనీలేవే… ఎంత కాదన్నా నీ మొగుడే కదా. పైగా వోన్లీ ఎక్స్టర్నల్ యూజే కదా? అవసరం మనది కదా”

“ఇది అంటున్నాడు. ‘ఇది’ అంటే ఏమిటో కనుక్కో” అంది కాస్త మెత్తబడిపోతూ.

“మిష్టర్ అనిరుద్రగారూ… ‘ఇది’ అంటే ఏమిటో… అని అడుగుతోంది మా అనీమిష.

“అబ్బ… మీకేదీ అర్ధంకాదు… ఈ గవర్నమెంట్ బడిపిల్లలకు కండోమ్స్ ఇస్తుందిగానీ “ఇది’ అంటే ఏమిటో చెప్పదు. ఇది అంటే… ఉమ్మా… ముద్దు” అన్నాడు నవ్వుతూ. ఈసారి అనిమిష ముఖం ఎర్రబడింది.

“వోన్లీ… ఒకే ఒక ‘ఇది’. అంతకుమించి ఒప్పుకోను” అంది అనిమిష.

“రొంబ థాంక్స్…” అంటూ అల్లరిగా నవ్వి అక్కడ్నుంచి కిచెన్ లోకి వెళ్లాడు అనిరుద్ర.

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.