నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

అనిరుద్ర లేడని కన్ఫర్మ్ చేసుకొని, “ఒరేయ్… అనిరుధ్రా… ఎక్కడ్రా…” అని అరిచింది.

“నీ వెనకే ఉన్నాను…” తాపీగా చెప్పాడు అనిరుద్ర.

అనిమిష గతుక్కుమంది. నాలిక్కరుచుకొని ఓ కన్ను మూసి ఓ కన్ను తెరిచి ఓరగా మొగుణ్ణి చూసింది.

అనిరుద్ర సుధ వైపు చూసి, “మరదలా… నీ దగ్గర వేకెన్సీ ఏమైనా వుందేమో చెప్పు… నేను రిజైన్ చేసి నీ దగ్గర జాయినైపోతా…” అన్నాడు.

అనిరుద్ర జుట్టును మొత్తం చెరిపేసి, “ఏంటీ… నీకు మా చెల్లెలు కావాలా?” అని అడిగింది అనిమిష.

“అక్క మొగుడు అర్ద మొగుడు కదా… అని ఫీలవుతున్నావా?” అడిగాడు అనిరుద్ర.

“లేదు… నాకిష్టమే… మీరెక్కడ… ఎప్పుడు… ఎవరితో వున్నా… మీ మనసులో వుండేది నేనే కదా… సుధతో మాట్లడనా?” అడిగింది అనిమిష.

షాకవడం అనిరుద్ర వంతయ్యింది. అనిమిష సరదాకు అన్లేదని తెలిశాక అతని మనసు చెమ్మగిల్లింది. ఆమె మెడ వంపులో తలపెట్టి, “నీకింకో ముగ్గురు చెల్లెళ్లు వుంటే బావుండేది” అన్నాడు.

***

తెల్లవారుఝామున మొబైల్ మోగింది. అప్పటికే అనిరుద్రను దుప్పటిలో చుట్టేసింది. అనిమిష. బద్దకంగా తన తలకు కుడివైపున వున్న మొబైల్ అందుకొని ఓకే బటన్ నొక్కి ‘హలో’ అన్నాడు..

“నేను కువైట్ నుండి మాట్లాడుతున్నాను. మొగుడి పోస్ట్ కావాలన్న మీ ప్రకటన ఆలస్యంగా చూశాను. మీకు మొగుడి పోస్ట్ ఇవ్వడానికి రెడీ…” ఓ అందమైన ఆడపిల్ల కంఠం వినిపించింది.

నిద్రలో కూడా ఆ మాటలు విన్న అనిమిష కళ్లు తెరిచి మొగుడి దగ్గర్నుండి మొబైల్ లాక్కొని… “సారీ… మొగుడి పోస్ట్ని నేను నా మొగుడికి పర్మినెంట్ చేశాను. టింగ్… టింగ్… దిస్ నంబర్ ఈజ్ పర్మినెంట్లీ అవుటాఫ్ సర్వీస్… ప్లీజ్ డయల్ ఆప్టర్ హండ్రెడ్ ఇయర్స్… టింగ్… టింగ్…” అంటూ ఫోన్ కట్ చేసి, మొగుడి పెదవులకు తన పెదవులతో తాళం వేసింది.

అప్పుడే మొబైల్లో ఓ మెసేజ్ వచ్చింది. “ఆల్ ద బెస్ట్ రా మనవడా… నేనొచ్చేసరికి బుల్లి అనిరుద్ధుడు మీ ఆవిడ కడుపులో ఉండాలి. బామ్మ రాక్షసి ఫ్రమ్ తిరుపతి…” పేరుతో

మెసేజ్ అది.

ఓ ప్రముఖ పత్రికలో కార్తీక్ రాసిన సీరియల్ మొదలైంది. ఆ సీరియల్ పేరు ‘అనిరుద్ర H/o అనిమిషు.

*****

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.