నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

రాత్రి పది దాటింది. హాలులో కూర్చొని టీవీ చూస్తున్నాడు అనిరుద్ర. అనిమిషకు నిద్ర ముంచుకొస్తోంది. అనిరుద్ర పడుకున్నాక అతని పడగ్గదికి బయట్నుంచి తాళం వేయాలన్నది ఆమె ఆలోచన.

“హలో… నువ్వు పడుకునే వరకూ పడుకోను. నేను ముందే పడుకుంటే బయట్నుంచి తాళం వేసినా వేస్తావు” ఆమె మనసులోని ఫీలింగ్స్ చదివినట్టు అన్నాడు అనిరుద్ర.

“ఈ మనిషికి ఫేస్ రీడింగే కాదు… హార్ట్ రీడింగ్ కూడా తెలుసునేమో” అనుకుంది అనిమిష “మరి నేనేం చేయాలి?

. “ఓ పని చేద్దాం. నా కళ్లకు గంతలు కడతావా?” అడిగాడు అనిరుద్ర. “చేతులు కట్టేస్తాను” అంది అనిమిష.

“థాంక్స్… కళ్లకు గంతలు కట్టనందుకు”

“రెండూ… కళ్లకు గంతలు కడితే చేతుల్తో విప్పేసుకుంటారు”

“పోనీ కళ్లకు గంతలు కట్టకుండా చేతులు కట్టేయ్”

“అప్పుడు కళ్లు మిటకరిస్తూ అర్ధరాత్రి వచ్చి నా గదిలోకి తొంగి చూస్తే”

“ఛఛ… నీకింత అనుమానం అయితే ఎలా? పోనీ పక్కింటికెళ్లి పడుకోనా?” అడిగాడు ఒళ్లు మండి అనిరుద్ర.

“పక్కింటాయన ఊర్కోడు… ఒళ్లు చీరేస్తాడు” అంది అనిమిష.

రాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర అనిమిష గది దగ్గరకొచ్చి, పిలిచాడు. అనిమిష తలుపు తీసి, ‘ఏంటి?’ అని అడిగింది.

“నోటితే చెప్తేగానీ నీకు సమ్మగా ఉండదా? బాత్రూమ్ కి వెళ్లాలి” కోపంగా చూసి.

“వెళ్లండి” అంది పక్కకు జరిగి.

“ఎలా వెళ్లను. గుడ్డి ముండావాడిని తీస్కెళ్లు” అన్నాడు అనిరుద్ర.

“నేనా.. ఛఛ… నేను తీసుకెళ్లను”

“అయితే కళ్ల గంతలు, చేతికి వున్న కట్లు విప్పు”

అనిమిష అతణ్ణి బాత్రూమ్ దగ్గరకి నడిపించుకుంటూ వెళ్లి, అతని చేతికి వున్న కట్లు విప్పింది. అయిదు నిమిషాల తర్వాత బాత్రూమ్లో నుండి బయటకు వచ్చాడు. మళ్లీ అతని చేతుల్ని కట్టేసింది. తాపీగా నడుచుకుంటూ బయటికెళ్లాడు అనిరుద్ర.

“అదేంటి… కళ్లకు గంతలు కట్టినా అలా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్తున్నావ్…’

“అలవాటైంది… అన్నట్టు ఓ విషయం తెలుసుకో… కళ్ల గంతలు, చేతులకు , కడితే సరిపోదు. మనసుకు గంతలు కట్టుకోవద్దు” తన గదిలోకి వెళ్తూ చెప్పాడు అనిరుద్ర..

ఇంకెప్పుడూ అలా కళ్లకు గంతలు కట్టకూడదని, చేతులు కట్టి పడేయకూడదని నిర్ణయించుకుంది అనిమిష.

***

ఆఫీసు వదిలే సమయానికి వచ్చింది ద్విముఖ. .

“కొత్త కాపురం ఎలా ఉంది?” అడిగింది ద్విముఖ క్యాంటీన్లో కూర్చొని సమోసా తింటూ.

“నాకేం కొత్తగా అనిపించడంలేదు.. నీ బదులు అతను… కాకపోతే ఒక్కోసారి నాకే గిల్టీ ఫీలింగ్…”

“నీలో గిల్టీ ఫీలింగ్ మొదలైందీ అంటే అనిరుద్ర మీద సాఫ్ట్ కార్నర్ డెవలప్ అవుతోందన్నమాట… నువ్వు అతడి ప్రేమలో పడిపోతున్నావన్నమాట” అంది ద్విముఖ.

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.