నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

చాలామంది హౌస్ వైఫ్ అంటే చులకన. భార్యలు ఇంటి పట్టునే ఉంటారు. అదేమైనా జాబ్ చేయడం కన్నా గొప్పనా? అన్న ఫీలింగ్… నిజంగా భర్త హోదాను ఓ ఉద్యోగంగా భావిస్తే హౌస్ హజ్బెండ్లా వుంటే… నా భార్య పడే బాధలు… నా భార్యలో కలిగే ఫీలింగ్స్ ఏమిటో తెలుస్తాయి… అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. భర్త అనుబంధాన్ని ఉద్యోగ బంధంగా మారిస్తే ఎలా ఉంటుందో… అందులోని సరదాలు… అల్లర్లు… కిలికించితాలు… గిలిగింతలు… గిల్లికజ్జాలు ఎలా వుంటాయో తెలుసుకొని వాటిని మధుర జ్ఞాపకాలుగా, మధురోహలుగా సృష్టించుకోవాలి.

నీ అమాయకత్వం నన్నూ ఆకర్షించింది. నీ నిస్సహాయత నన్ను కదిలించింది. నీ నిజాయితీ నన్ను నీ కౌగిలిలో కట్టి పడేసింది. అందుకే మొగుడి ఉద్యోగం నీ దగ్గరే చేశాను”

అనిమిష వార్డ్రోబ్ దగ్గరికి వెళ్లి షరతుల కాగితం, అగ్రిమెంట్ కాగితం తీసుకొచ్చి పరపరా చింపేసింది.

“ఇవాల్టి నుండి ఒక జీవిత కాలంపాటు నా మొగుడిగా పర్మినెంట్ చేస్తున్నాను” అంది. అతణ్ణి అల్లుకుపోయి.

“నేనే అగ్రిమెంట్ పేపర్ ని… నీ పెదాలతో నా పెదాల మీద సంతకం చేస్తే ఓ పనైపోతుంది” అన్నాడు అనిరుద్ర.

“సంతకానికి ముందు అడ్వాన్స్ ఇవ్వాలిగా” అంటూ అతని చేతిని తన నడుము మీదికి చేర్చింది.

****

అసలు సిసలైన ఫస్ట్ నైట్.

ఆమె తన నడుమును దాచుకోలేదు. ఆ మాటకొస్తే ఆమె తనలోని ఏ అందాలనూ దాచుకోలేదు. అతనూ అంతే… అతణ్ణి తన అనాచ్చాదిత దేహంలోకి లాక్కొని… “మీ లక్కీ నంబర్ ఆరు… నా లక్కీ నంబర్ ఏడు… మొత్తం పదమూడు… తెల్లవారేలోగా మన లక్కీ అందం పదమూడు అని ప్రూవ్ అవ్వాలి. నాకు తెలుసు మీరు ప్రూవ్ చేస్తారు” అంది అతణి దుప్పటితో చుట్టేసి.

ఎర్లీ మార్నింగ్ ఆమె నుండి విడివడి అన్నాడు… “థర్టీనే కానీ… ఒకటి ఫినిషింగ్ టచ్… సరిగ్గా కౌంట్ చేయ్…”

****

ఉపసంహారం.

శోభరాజ్ భావనను స్ట్రెయిట్ గా అడిగాడు, “నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. మీకు ఓకేనా?కాని ఒక షరతు… పెళ్లయ్యాక హైహీల్స్ వేసుకోకూడదు…” అని.

భావన సరేనంది. తమ ప్రేమతో మరింతగా హైట్ తగ్గి అతని ప్రేమను అందుకోవాలని నిర్ణయించుకుంది.

నిఖితను వాళ్లాయన కుజ గ్రహానికి తీసుకువెళ్తానుగానీ అయిదొందలు పెట్టి చీర, కొననుగాక కొనను అనడంతో తప్పనిసరిగా కుజగ్రహానికి టికెట్లు బుక్ చేయించమని చెప్పి మొగుడికి.

ద్విముఖను సిగ్గుపడ్తూనే అడిగాడు కార్తీక్.

“మనం పెళ్లి చేసుకుందామా?” అని. సరేనని ద్విముఖ.

డ్రీమ్ ఛానల్లో క్రియేటివ్ హెడ్ ని అతనికి హెడ్ లేదన్న విషయం తెలిసిన తర్వాత అతణ్ణి పీకేసి, ఒరిజినల్ క్రియేటివ్ హెడ్ పోస్టును ద్విముఖకు అప్పగించారు.

బామ్మ కాశీ నుంచే ఫోన్ చేసి విషయం తెలుసుకొని కాశీ నుండి తిరుపతికి వెళ్లింది.

కార్తీక్ పత్రికలు, పుస్తకాలు తెగ చదివి… చెత్తగా ఎలా రాయకూడదో, కొత్తగా ఎలా రాయలో తెలుసుకున్నాడు. ఓ సీరియల్ ని కూడా ప్రారంభించాడు.

ఆ సీరియల్ కథ అనిరుద్ర, అనిమిషలదే. టైటిల్ అర్ధంకాక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే… ఆ సీరియల్ కి ఏం టైటిల్ పెట్టాలో అనిరుద్రే చెప్పాడు.

ఆ సీరియలకు అతను సూచించిన టైటిల్… ‘అనిరుద్ర H/o అనిమిష’.

సీరియస్ గా ఆలోచిస్తోంది సుధ.

“ఏంటే ఆలోచిస్తున్నావు?” అడిగింది అనిమిష.

“బావ గురించే…

“బావ గురించి ఆలోచించాల్సింది నేను… నువ్వెందుకు?” అనుమానంగా అడిగింది అనిమిష.

“బావ… మొన్న బెంగుళూరు వచ్చినప్పుడు నా తల్లో ఒడి పెట్టి ఛఛ… నా ఒడిలో తల పెట్టి, ‘మీ అక్క బాస్ దగ్గర పనిచేయలేకపోతున్నాను. తన దగ్గర ‘అది’ లేదు. ‘ఇది’ లేదు. మీ అక్క దగ్గర మొగుడి పోస్ట్ కి రిజైన్ చేసేస్తాను. నీ దగ్గరేమైనా వేకెన్సీ వుంటే చెప్పు’ అన్నాడు. నేను ఆపరేషన్ టేబుల్ మీద వున్నప్పుడు చూద్దాం…’ అని మాట ఇచ్చాను” అక్క మొహంలో రియాక్షన్స్ ని గమనిస్తూ చెప్పింది సుధ.

“ఏయ్… నా మొగుడితో నీకు పనేంటే… అయినా నేను నా మొగుడ్నింకా ఊస్టే చేయలేదు. పైగా పర్మినెంట్ చేయబోతున్నాను. అసలు నిన్ను కాదే… అతగాడిని అనాలి…” అంటూ చుట్టూ చూసింది. .

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.