నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“థాంక్యూ… ఇప్పటికైనా నిజం చెప్పారు” అంటూ లేచాడు అనిరుద్ర.

“ఈ విషయం అనిమిషకు చెప్తారా?” అడిగింది ద్విముఖ.

. “చెప్పను… అసలు అనిమిషను కొన్ని రోజులపాటు కలవను”

“ఎందుకని… మొత్తంగా ఆమె జీవితంలో నుంచి తప్పుకుంటారా?” ఆందోళనగా

అడిగింది.

‘లేదు… నా భార్య చెల్లెలిని… నా మరదలిని కాపాడుకుంటాను. బావ స్థానంలో పెద్దగా నా బాధ్యత నెరవేరుస్తాను. ఒక్క విషయం… ఈ సంగతి అనిమిషకు

చెప్పకండి. నా భార్య అభిజాత్యం దెబ్బ తినడం భరించలేను. తనో ఉత్త మొద్దుమొహం” ఈ అన్నప్పుడు అనిరుద్ర కళ్లల్లో సన్నటి కన్నీటి పొర.

****

అదీ జరిగింది. ఆ తర్వాత కార్తీక్ ద్వారా తెలిసింది. అనిరుద్ర తన బైక్ అమ్మేశాడని. తనఖా పెట్టి ఆ డబ్బుతో బెంగుళూరు వెళ్లాడు. మీ చెల్లెలి ఆపరేషన్ నీ స్థానంలో

వుంది చేయించాడు. అనిరుద్ర డబ్బు వెంటనే సర్దడం వల్ల నీకు చెప్పిన టైమ్ కన్నా ముందే ఆపరేషన్ చేసేశారు డాక్టర్లు” చెప్పింది ద్విముఖ.

ఒక చిన్న ఉద్వేగం వేనవేల భూకంప ప్రకంపనలయ్యాయి. ఒక చిన్న సన్నటి కన్నీటిపా వేనవేల సునామీలయ్యాయి.

“ఏయ్… అనూ… ఏంటి?”

“ద్విముఖ… నేను అనిరుద్రను మిస్సయ్యాను. ఆయన మిసెస్ అయి కూడా. నాకిప్పుడు సిగ్గు, బిడియం వదిలి ఆయనను గట్టిగా వాటేసుకోవాలని ఉంది” నిజాయితీగా చెప్పింది అనిమిష.

“అయితే ఎందుకాలస్యం? నేనై..” అన్న మాటలు వినిపించి తలెత్తింది.

ఎదురుగా అనిరుద్ర… మొహమంతో వాడిపోయి ఉంది. ఆ పక్కనే తన చెల్లెలు… ప్రమాదానికి గురి కాకముందు ఎలా వుందో.. అచ్చంగా అలాగే ఉంది.

“అక్కా.. బావ చాలా బావున్నాడు. స్మార్ట్ గా ఉన్నాడు…” చెల్లెలు అంటోంది. ఆ క్షణం చెల్లెల్ని పలకరించాలని కూడా అనిపించలేదు.

తనకిప్పుడు తల్లి తండ్రి సర్వం… తన దైవం అనిరుద్రే. పరుగెత్తుకెళ్లి అతణ్ణి తన దగ్గరకు లాక్కొని వాటేసుకుంది. ఆమె కళ్ల నుండి కన్నీళ్లు రాలి అతని గుండెను అభిషేకిస్తున్నాయి.

****

ఆ గదిలో ఇద్దరే ఉన్నారు. అనిరుద్ర… అనిమిష.

ఇద్దరూ మౌనాన్నే ఆశ్రయించారు. అనిరుద్ర ముందు కదిలి అనిమిష చుబుకాన్ని పైకెత్తాడు. ఆమె కళ్లు కిందికి వాలాయి. అతని చూపులు ఆమె నడుమందాల వైపు మళ్లాయి ఆ సిట్యుయేషన్ లో కూడా. అతను తన నడుం వంక, నడుం మడత వంక చూస్తున్నాడని తెలిసినా తన చీర కొంగును నడుమందాలకు అచ్ఛాదనగా మార్చుకోలేదు. ఆ నడుం అనిరుద్రదే అన్నట్టుగా ఉంది.

“అనిమిషా… మాట్లాడవేంటి?”

“ఏం మాట్లాడను… మాట్లాడ్డానికి స్వర పేటిక సిద్ధంగాలేదు. అది మౌనాన్నే ఆశ్రయించింది. నన్నెందుకు పర్మినెంట్గా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు… ఎందుకు మొగుడి పోస్ట్ లోకి వచ్చారు?” చిన్నపిల్లలా అడిగింది ఏడుస్తూ.

“పోనీ… నన్ను పర్మినెంట్గా మొగుడు పోస్ట్లో కొనసాగించు” “మొగుడి పోస్ట్ కి మీరు రిజైన్ చేస్తే మిమ్మల్ని చంపి నేను చస్తాను” కోపంగా అంది.

“పిచ్చి అనిమిషా… నేనెందుకు మొగుడి పోస్ట్ లో జాబ్ చేస్తున్నానో తెలుసా? నాకే ఉదోగ్యం దొరక్క కాదు. చేయలేకా కాదు”

“మరి?!”

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.