నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“కమాన్ కేక్ కట్ చెయ్…” అంటూ చాకు చేతికి ఇచ్చాడు. ‘కీ’ ఇచ్చిన ఉమెన్ రోబోలా ఆమె కేక్ దగ్గరకి వెళ్లి కేక్ కట్ చేసింది.

“బీ హ్యాపీ… నువ్వెప్పుడూ హ్యాపీగా, నీకిష్టమైన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండాలి. దిసీజ్ మై స్మాల్ గిఫ్ట్… జస్ట్ ఫర్ హండ్రెడ్ వేల్యూ.. కైలాసగిరి వెళ్లి తెచ్చాను. నీకో విషయం తెలుసా… ఉదయం నుండి టెడ్డీ బేర్లు అమ్మితే వచ్చిన డబ్బుతో వీటిని కొన్నాను. చీరకే నాలుగు వందలు సరిపోయాయి. కైలాసగిరి నుండి లెఫ్ట్ అండ్ రైటే…” అనిరుద్ర చెప్తుంటే అతని మొహం వంకే చూస్తుండిపోయింది.

అతని మొహం వాడిపోయింది. కళ్లు ఎర్రబడి ఉన్నాయి. జుట్టు రేగిపోయింది. అంటే ఉదయం తనని శాలరీ అని అడిగింది. ఇందుకోసమా…

“నీ సర్టిఫికెట్స్లో నీ డేటాఫ్ బర్త్ ట్వంటీ ఫస్ట్ అని ఉంది. వన్స్ ఎగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే” అంటూ కేక్ ను ఆమె నోట్లో పెట్టాడు.

ఆ తర్వాత వెళ్లి లైట్ వేసి, మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన గదిలోకి వెళ్తూ, “గుడ్ నైట్” అన్నాడు.

“ఆ చీర నాకెందుకు?” అని అడిగింది అనిమిష

“బర్త్ డే గిఫ్ట్… మన ప్రొఫెషనల్ అకౌంట్లోకి రాదు. నా భార్యకు నేనిచ్చే గిఫ్ట్. నచ్చకపోతే వదిలెయ్… ఎవరికైనా ఇచ్చెయ్” చెప్పాడు అనిరుద్ర.

అనిమిష అద్దం ముందు నిలబడింది. తను కట్టుకున్న చీర విప్పేసింది. పెట్టీకోట్ తో ఉంది. అనిరుద్ర తెచ్చిన చీర ఒంటికి చుట్టుకుంది. తర్వాత ఇష్టంగా కట్టుకుంది. చిత్రంగా అనిరుద్ర తనను చుట్టేసిన ఫీలింగ్ కలిగింది. ఆ చీరను విప్పేయబుద్ధికాలేదు. అలాగే
చిరతో పడుకుండిపోయింది. తెల్లవారుఝామునే అనిరుద్ర ఆ చీరలో తనను చూడకముందే విప్పేసింది.

“ఇవ్వాళ టిఫినేమిటి?” అడిగింది అనిమిష కిచెన్లో వున్న అనిరుద్రను.

“పైనాపిల్ కేక్” చెప్పాడు అనిరుద్ర.

“నేనడిగేది టిఫిన్”

“నేను చెప్పేది టిఫిన్ గురించే. నిన్న తెచ్చిన కేక్ ఫ్రిజ్ లో పెట్టాను. ఇవ్వాళ బ్రేక్ ఫాస్ట్ కు అదే. లంచ్ కు వంకాయ ఫ్రై” చెప్పాడు అనిరుద్ర.

“బుద్ధి వున్న వాడెవడైనా కేక్ ను బ్రేక్ ఫాస్ట్గా తింటాడా?” అడిగింది అనిమిష.

“హలో… ఎక్స్ క్యూజ్ మీ… వాయిస్ డౌన్ చేయండి. మన అగ్రిమెంట్లో బ్రేక్ ఫాస్ట్ రోజు విడిచి రోజు నా డ్యూటీ. బ్రేక్ ఫాస్ట్లో ఫలాన ఐటమే ఉండాలని ఏం లేదు. ఏం మొన్న అన్నం తిరగమోత పెట్టి ఇదే బ్రేక్ ఫాస్ట్ అంటే నేను తిన్లెదా? కావాలంటే చెప్పు పైనాపిల్ కేక్ ని కూడా తిరగమోత పెడతాను”

“ఛీ.. ఛీ…” అని బాత్రూమ్లోకి వెళ్లి వెంటనే బయటికొచ్చి, “నాకు వంకాయ వద్దు. టమోటా కర్రీ కావాలి” అంది.

“సారీ… టమోటా నో స్టాక్…. అన్నట్టు కూరలకు డబ్బులిచ్చి వెళ్లు”

“ఏం మొన్ననే ఇచ్చానుగా..”

“టమోటా కేజీ పదహారు. తమరిచ్చింది ఎనిమిది లెక్కన. వంకాయ పన్నెండు. తమరిచ్చింది ఆరు చొప్పున, పచ్చిమిర్చి పద్దెనిమిది. తమరిచ్చింది తొమ్మిది చొప్పున. తమరికి సగం సగం ఇచ్చి, సగం సగం నొక్కడం అలవాటా?” అనిరుద్ర అన్నాడు.

“నాకేం అలవాటు లేదు. మీకే లేకపోతే ధరలు అంతలా మండిపోతున్నాయా? వేరీజ్ బిల్లూ…” అడిగింది దీర్ఘం తీసి మరీ.

“యూ వాంట్ బిల్లూ… నీ హ్యాండ్ బ్యాగ్ కు చిల్లుపడేలా తెస్తాను బిల్లు” కసిగా అనుకున్నాడు అనిరుద్ర.

“సాయంత్రం నేనే తెస్తాను కూరగాయలు. అయినా కేజీల చొప్పున అక్కర్లేదు” అంటూ విసవిసా బాత్రూమ్లోకి వెళ్లింది అనిమిష

***

లంచ్ అవర్.

అనిమిష లంచ్ బాక్స్ తీసుకొని తన సీటులో నుండి లేచింది. అప్పుడే అనిరుద్ర వచ్చాడు. రిసెప్షన్లో వున్న భావన అనిరుద్రను చూసి లేచి విష్ చేసింది.

“హలో… బావున్నారా సార్… అనిమిషను పిలుస్తాను. ఉండండి” అంది.

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.