నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“హమ్మయ్య… ఓ ప్రాబ్లెమ్ సాల్వ్ అయ్యింది. నువ్విక బెస్ట్ కపుల్ గా గెలవడానికి సిద్ధంగా ఉండు. ఎన్ని తెలుగు సినిమాలలో చూడలేదు ఇలాంటి సీన్లు… రెచ్చిపో… ఆల్ ద బెస్ట్… అన్నట్టు ఎల్లుండే పోటీ… ఈలోగా ప్రిపేర్ అవ్వండి. నేనొస్తాను” అంటూ బయల్దేరింది ద్విముఖ.

“ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. ఛాన్స్ దొరికింది కదానని ఎక్కడిపడితే అక్కడ చెయ్యేస్తే ఊర్కోను” సీరియస్గా అంది అనిమిష.

“నేనూ ఇప్పుడే చెప్తున్నాను. ఛాన్స్ దొరికింది కదానని… నన్ను విదిలిస్తే ఊర్కోను. మూడ్ ని బట్టి, టైంని బట్టి, సిట్యుయేషన్ ని బట్టి నేను రియాక్టవుతూ ఉంటాను” అన్నాడు అనిరుద్ర.

“ఏదో ఒకటి చెయ్… ఊర్కోక చస్తానా… అవసరం నాది కదా”

“ఆ విషయం అండర్లైన్ చేస్కో..” అన్నాడు అనిరుద్ర. అనిమిష అద్దంలో తనను తాను చూసుకుంది. సింపుల్ గా ఉంది. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయల్దేరారు.

బెస్ట్ కపుల్ పోటీ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా జంటలే. ఫార్టీ ప్లస్ జంటలు కూడా ఉన్నాయ్. ప్రపంచంలోని ప్రేమనంతా ఒలకబోస్తున్నాయి. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకోవడం… నోట్లో నోరు పెట్టి ముద్దు పెట్టుకోవడం, అన్నం తినిపించుకోవడం, వాటేసుకోవడం, నడుం చుట్టూ చేతులు వేసుకోవడం… లాంటి యాక్షన్ పార్ట్స్ యాక్షన్ కట్లు లేకుండానే మొదలయ్యాయి.

డ్రీమ్ టీవీ ఛైర్మన్, అతని భార్య, శోభరాజ్, ఓ టేబుల్ ముందు కూర్చున్నారు. వాళ్ల ముందు టీవీ ఉంది. ఆ ప్రిమిసెస్ అంతా క్లోజ్ సర్క్యూట్ టీవీ కెమెరాలు ఉన్నాయి. కొన్ని కెమెరాలు నిరంతరం ఆ దంపతుల చుట్టూ తిరుగుతున్నాయి.

టీవీ ఛానెల్స్, మీడియా వచ్చేసింది. ద్విముఖ, కార్తీక్లు ఓ వైపు నుండి ఆసక్తిగా గమనిస్తున్నారు. కెమెరా అనిరుద్ర, అనిమిషల మీద ఫోకస్ అయ్యింది. ఈలోగా మైక్లో జడ్జేస్

ఓ ప్రశ్న అడిగారు.

“ప్రేమంటే ఏమిటి?”

జంటలు తమ తమ నిర్వచనాలు చెప్పడం మొదలు పెట్టారు. చచ్చే వరకూ కలిసివుండేది. ప్రే అంటే ప్రేమించు. మ… అంటే మరచిపో… అజరామరం… అదో మైకం.. ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వాళ్లు చెప్పారు. మైక్ అనిరుద్ర ముందుకొచ్చింది.

“ప్రేమంటే… అదో కెమికల్ రియాక్షన్. రసాయనిక చర్య. ప్రేమంటే మనకు తెలియనిది… మనసుకు మాత్రమే తెలిసింది. మన చేతల్లో చూపించలేనిది. ఎదుటి మనిషి మనసు పొరల్లోకి దూసుకువెళ్లేది” అని చెప్పాడు.

క్లాప్స్… క్లాప్స్… క్లాప్స్…. అనిరుద్ర మెల్లిగా అనిమిష చెవిలో గొణిగాడు.

“ఏమిటా గొణుగుడు… విషయమేమిటో?” అడిగింది లోగొంతుకతో అనిమిష.

మెల్లగా కిందికి వంగి ఎవ్వరూ చూడకుండా (కెమెరా తమవైపు వుందని గమనించి) అనిమిష నడుము మీద ముద్దు పెట్టుకున్నాడు. అనిమిష మొహం సిగ్గుతో గులాబీ తోటగా మారింది.

ఆ దృశ్యం చూసిన జడ్జెస్ నవ్వుకున్నారు ముసిముసిగా. ఈలోగా అనిరుద్ర ఆపిల్ కట్ చేస్తూ ఎవ్వరూ చూడకుండా అనిమిష చెవిలో ‘సారీ’ అని ఓసారి చెప్పేసి చాకుతో ఆమె చేతి వేలి మీద చిన్న గాటు పెట్టాడు. అనిమిష కెవ్వుమంది.

వెంటనే అనిరుద్ర కంగారు నటిస్తూ, “ఏమైంది అనూ…” అంటూ ఆమె తర్జని రక్తసిక్తం అవ్వడం గమనించి ఆమె చేతి వేలిని తన నోట్లోకి లాక్కున్నాడు.

జడ్జెస్ ఆ దృశ్యాన్ని అలానే చూస్తుండిపోయారు. అనిరుద్ర కర్ఛీఫ్తో ఆ వేలికి కట్టుకట్టాడు.

****

“డియర్ పార్టిసిపెంట్స్… బెస్ట్ కపుల్ పోటీ ముగిసింది. దంపతులు తమ దాంపత్య మధురిమలను మా ముందు ప్రదర్శించారు. ప్రేమంటే ఏమిటో సరైన నిర్వచనం చెప్పడమే కాదు తన భార్య చేతికి అయిన చిన్న గాయానికే తల్లడిల్లిపోయిన అనిరుద్ర ప్రేమను ప్రత్యక్షంగా చూసాం. “బెస్ట్ కపుల్గా ఎంపిక చేసి లక్ష రూపాయల బహుమతి అందిస్తున్నాం” జడ్జెస్ అనౌన్స్ చేసారు. శోభరాజ్ అనిరుద్ర దంపతులను మనస్పూర్తిగా అభినందించాడు.

*****

“మీకసలు… కాదు… కాదు… నీకసలు బుద్ధి ఉందా? ఎంత శాడిస్ట్ వి కాకపోతే చాకుతో వేలి మీద గాయం చేస్తావా? ఏం నువ్వే కోసుకోవచ్చుగా. పైగా నా వేలేమైనా ఐస్ ఫ్రూట్ అనుకున్నావా? ఛాన్స్ దొరికింది కదా అని అదే పనిగా అరిగిపోయేంతవరకూ చప్పరిస్తావా? ఛ..ఛ… పది సబ్బులు అరగదీసి ఆ వేలిని కడుక్కోవాలి. అరడజను డెట్టాల్ బాటిల్స్తో క్లీన్ చేసుకోవాలి” ఇంటికి వచ్చాక అప్పటివరకూ వున్న ఉక్రోషాన్ని తిట్ల రూపంలో వెళ్లగక్కింది అనిమిష.
అనిరుద్ర ఆ తిట్లను కామ్ గా విన్నాడు.

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.