నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“ఏం చేస్తాడో ఏమో… టైం తక్కువగా ఉంది” అంది అనిమిష.

“అనిరుధ్రను అడక్కూడదనే డిసైడ్ అయ్యావుగా” ” “అవును… ఆయన అదో టైప్ మనిషి”

“ఇంతకీ ఇంతవరకూ ‘అది’ లేదా?” అడిగింది లోగొంతుకతో ద్విముఖ.

“అదేంటి.. అదంటే… ఏది?” ముందు అర్ధంకాక అడిగింది అనిమిష.

“అదంటే ‘అదే’… మీ ఆయనతో “అది” అంది ద్విముఖ.

ఎర్రబడ్డ మొహంతో తలదించుకొని, “ఏదీ లేదు. అయినా ఆయన చేస్తోంది హజ్బెండ్ జాబ్… అందులోనూ టెంపరరీ..” చెప్పింది.

“పర్మినెంట్ చేసెయ్… ‘అది’కి ఒప్పుకుంటే పర్మనెంట్ అయిపోతుంది”

“నాకిప్పుడు వేటి మీదా ఎలాంటి ఆశలు లేవు” అంది అనిమిష ఓ విషాద వీచిక ఆమెను ఆవరిస్తుండగా.

***

అనిరుద్ర కూరగాయలు తరుగుతున్నాడు. అనిమిష అతనికి హెల్ప్ చేస్తోంది.

“ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలు పేముంది. అన్న పాట నిజమే కదూ…” అడిగింది అనిమిష.

“కాదు… అసలు ఆడుతూ పాడుతూ పని ఎలా చేస్తారు? నీలా ఆ కూరగాయలు అటూ ఇటూ కెలకడం తప్ప” అన్నాడు అనిరుద్ర..

“మీకు వంకరగా తప్ప చక్కగా మాట్లాడ్డం రాదా?” ఉక్రోషంగా అంది అనిమిష.

“హలో… మనకు మాట్లాడ్డమే వచ్చు. అది ఎవరితో… ఎప్పుడు… ఎలా… ఎందుకు… ఏ స్టయిల్లో… ఏ పాట్రన్లో… ఏ విధంగా మాట్లాడాలో అన్నది ఎదుటివాళ్లను బట్టి డిసైడ్ చేసుకుంటాను”

“ఏంటి… ఏలు ఎ ఏలు ఉపయోగించారు. ప్రాస కోసమా…” అంది అనిమిష.

అప్పుడే ద్విముఖ వాళ్లిద్దరిని దగ్గరగా చూసి, “సారీ… డిస్ట్రబ్ చేశానా… తర్వాతొస్తాన్లే” అంది వెనక్కి వెళ్లబోతున్నట్టు నటిస్తూ,

“అంతొద్దు. వచ్చేయండి… ఇక్కడ అలాంటి ‘అది’ ప్రోగ్రామ్స్ ఏమీ జరగడంలేదు. అసలు మీ ఫ్రెండ్ ‘ఇదికే ఒప్పుకోవడం లేదు. ఇక ‘అది’కేం ఒప్పుకుంటుంది?”

“ఇది’ అంటే ఏది?”

“అది”కి ముందు ‘ఇది’… అబ్బ… చెప్పాలంటే నాకు సిగ్గు” అన్నాడు అనిరుద్ర.

“ఇదిగో ఇలాంటి తింగరి వేషాలే వద్దు. బీ సీరియస్… అయామ్ యువర్ బాస్..”

“నేనింకా బ్రాస్ అనుకున్నాను. సారీ… బ్రా..స్” అన్నాడు అనిరుద్ర.

ద్విముఖ నవ్వుతోంది. అనిరుద్ర ద్విముఖ వంక చూస్తూ, “ఎంత బాగా నవ్వుతున్నారు… నవ్వడం కూడా ఓ ఫైన్ ఆర్ట్… అందులో ఆడవాళ్ల నవ్వులకు అర్ధాలే వేరేలే” అన్నాడు అల్లరిగా.

“ఏంటీ… నవ్వుల్లో కూడా ఆడ.. మగ… నవ్వులుంటాయా?”

“వైనాట్… మీకో విషయం తెలుసా? మగవారికన్నా ఆడవారే 126 శాతం ఎక్కువగా నవ్వుతారట. ఓ పరిశోధనలో తేలిన అంశం. కాకపోతే మగవాళ్లు సెక్సీ జోకులను ఆస్వాదిస్తారు.

ఆడవాళ్లు అలాంటివాటి పట్ల ఆసక్తి చూపించరు. డిగ్నిటీగా వినగానే ఫ్రెష్ గా నవ్వొచ్చే జోకుతలే ఇష్టం. నవ్వితేనే ఎండార్ఫిన్లనే సహజ ఉత్పత్తి బాధానివారిణీలు పనిచేసేవి. అంతెందుకు.. బాగా నవ్వినప్పుడు మీ గుండె మీద చెయ్యి పెట్టుకొని చూసుకోండి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. నవ్వడం ఆగిపోయిన తర్వాత ముఫ్పై సెకన్ల వరకు అలాగే కొట్టుకుంటుంది”

“మీకు చాలా విషయాలు తెలుసే….”

“ఆ విషయాన్ని మీ ఫ్రెండ్ గుర్తించడం లేదు” అంటూ అనిమిష వైపు చూశాడు.

“ద్విముఖ కాఫీ తెస్తానుండు” అంటూ లేచింది అనిమిష .

“నేను తీసుకొస్తాను… మీరు మాట్లాడుతూ ఉండండి”

“అక్కర్లేదు… మీరు తీస్కొస్తే సర్వీస్ ఛార్జ్ అని అకౌంట్ రాస్తారు”

“ద్విముఖగారు నాక్కూడా గెస్టే… నాలుగైదుసార్లు కాఫీ తాగించారు. దీనికి సర్వీస్ ఛార్జ్ వేయనులే” అంటూ కిచెన్ లోకి వెళ్లాడు అనిరుద్ర.

****

“అనిమిషా… నీకో గుడ్ న్యూస్… ‘రియల్ అండ్ ఫెయిర్’ పేరుతో బెస్ట్ కపుల్ పోటీ ఏర్పాటుచేశారు. దానికి చీఫ్ గెస్ట్ మా డ్రీమ్ టీవీ ఛైర్మన్, వాళ్లావిడే… జడ్జెస్ ఎవరో తెలుసా? మీ బాస్ శోభరాజ్… మా బాస్, మా బాస్ భార్య… ఇంకా కమిటీ వుందిలే…. ప్రైజ్ మనీ ఎంతనుకున్నావ్… అక్షరాల లక్ష…”

“లక్షా…” అంది కళ్లు పెద్దవి చేసి.

“లక్షణంగా లక్షే. ఆ విషయం నాకూ తెలుసూ…” కాఫీ కప్పులతో వచ్చి ఓ కప్పు ద్విముఖకు, మరో కప్పు అనిమిషకు ఇచ్చి తనో కప్పు తీసుకొని అన్నాడు అనిరుద్ర.

“తెలుసా… తెలిసేందుకు చెప్పలేదు”

“చెప్పడం ఎందుకు?”

“మనకు లక్ష వస్తుందిగా” అంది అనిమిష .

“మనకా… మనకెందుకు వస్తుంది. మనకు ‘అది’ జరగలేదుగా. ‘అది’ జరక్కుండా కూడా బెస్ట్ కపుల్ అని లక్ష ఇస్తారా? ఉండు కనుక్కుంటాను” అంటూ కాఫీ కప్పు కింద పెట్టి ఫోన్ చేయబోయాడు. ద్విముఖ నవ్వును బలవంతాన ఆపుకుంది.

“చూశావా ద్విముఖా… బాస్ అన్న జాలి కూడా లేదు” అంది అనిమిష.

“బాస్ అంటే బాధ్యత ఉండాలి. జాలి ఎందుకు?” సెటైరిగ్గా అన్నాడు అనిరుద్ర.

ద్విముఖ వాళ్ల మధ్య కలుగజేసుకొని, “ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి. ఆ ‘షో’లో పార్టిసిపేట్ చేస్తే మీకు బహుమతి రావచ్చు”

“నాకు నమ్మకం లేదు. ఈ తింగరి బుచ్చితో వెళ్తే ప్రైజేమొస్తుంది” అనిరుద్ర తేల్చేశాడు.

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.