నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“ఏంటీ… నేను నోరు నొప్పి పుట్టేలా తిడ్తుంటే… మిడ్ నైట్ మసాలా చూసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి? అక్కడే పీక పిసికేయాలనుకున్నాను” మరింత ఇరిటేటింగ్గా అంది.

“హలో… ఏంటీ తెగ రెచ్చిపోతున్నావ్… ఏదో నీకు బహుమతి తెచ్చిపెడదామని.. కాస్త ఓవరాక్షన్ చేశాను. అసలు నా నోటిని యమునా నదిలో కడుక్కోవాలి. కృష్ణా నదిలో స్నానం చేయాలి” అన్నాడు అనిరుద్ర.

“బహుమతి కోసం అంతసేపు వేలు చప్పరించాలా? అయినా ఆ కోసుకునే వేలేదో నువ్వు కోసుకోవచ్చుగా” అంది ముక్కుపుటాలెగరేస్తూ అనిమిష.

అనిరుద్ర అటూ ఇటూ చూసి కిచెన్ లో నుండి చాకు తీసుకొచ్చి, “అయితే నా వేలు కోసుకుంటాను. నువ్వొచ్చి చప్పరించు” అన్నాడు ఆమెను రెచ్చగొడ్తూ.

“ఛీ.. ఛీ… నోరు విప్పితే సెన్సారే..”

“థాంక్స్… భళారే…” అన్నాడు అనిరుద్ర.

“నీ మొహం చూడాలంటేనే ఇరిటేటింగ్ గా ఉంది. నాక్కనిపించకు… నిన్నీ క్షణమే మొగుడి పోస్టు నుండి పీకేస్తున్నాను” అంది అనిమిష.

“రొంబ థాంక్స్… నా లెక్క సెటిల్ చెయ్… అమౌంట్ క్లియర్ చెయ్యి. రేపే ఇంటర్నెట్లో యాడ్ ఇస్తాను. హాయిగా ఏ చైనా అమ్మాయినో చేసుకొని మొగుడి జాబ్ చేసి పెడతా…”

“మీ ఫేస్ కు కరెక్ట్ సూటబుల్” అంది అనిమిష.

“వన్స్ ఎగైన్ రొంబ థాంక్స్” అంటూ బయటకు నడిచాడు అనిరుద్ర.

****

అనిరుద్ర బయటకెళ్లి రాత్రి పదకొండు అయినా రాలేదు. ఒక్కదానికి అన్నం తినబుద్దికాలేదు. వాష్ బేసిన్ దగ్గరకి వెళ్లి చెయ్యి కడుక్కోబోయి ఆగింది. కుడి చెయ్యి చూపుడు వేలు… అనిరుద్ర నోట్లో పెట్టుకున్న వేలు… ఆ వేలిని కడుక్కోవాలనిపించలేదు. తన పెదవులకు ఆన్చుకుంది. అర్ధరాత్రి పదకొండు అవుతుండగా అనిరుద్ర నుండి ఫోన్.

“హలో… నేను అనిరుద్రను”

అప్పుడే అనిరుద్ర కనిపించక ఒక రోజు దాటింది. అనిరుద్ర లేని లోటు తెలుస్తోంది. ఎప్పుడూ గిల్లికజ్జాలు… మాటకు మాట అన్నా… అనిరుద్ర ఎంత తిట్టినా, ఆ తిట్టులో ఇష్టం.. ఆ సెటైర్లో ఎఫెక్షన్ ఆమెకు గుర్తిస్తోంది. సరిగ్గా అప్పుడే ద్విముఖ వచ్చింది.

“ద్విముఖా… ఎల్లుండిలోగా మరో రెండు లక్షలు సర్దితే సరిపోతుంది. కాకపోతే ఆయనకు ఓ రెండు లక్షలు బాకీ ఉంటాను” అంది అనిమిష.

****

“అనిరుద్ర కనిపించడం లేదేంటి?” అడిగింది ద్విముఖ..

“ఆయనకేదో రాచకార్యాలున్నాయట. పెళ్లాన్ని ఒంటరిగా వదిలి ఎలా వెళ్లాలని అనిపించిందో… పైగా డబ్బో… డబ్బో… అంటాడు” అంది అనిమిష.

“అనిరుద్ర గురించి అలా మాట్లాడకు. అయినా నాకో సంగతి చెప్పు. నిజంగా అనిరుద్ర అంటే నీకు ఇష్టం లేదా? కేవలం అతణ్ణి ఓ మొగుడు జాబ్ చేసే వ్యక్తిగానే చూస్తున్నావా?”

ద్విముఖ ప్రశ్నకు అనిమిష తలదించుకుంది.

“నువ్వు అనిరుద్రను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలియదుగానీ… అనిరుద్ర నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. మగవాడు.. సప్తపది నడిచి, మూడు ముళ్లు వేసి, చేతిలో చెయ్యి వేసి నువ్వే నా భార్యవి… నీ కష్టాలు, కన్నీళ్లు నావి అని ప్రమాణం చేసి ఏమాత్రం ఛాన్స్ వున్నా… డబ్బా కొట్టుకుంటాడు. కానీ అనిరుద్ర అలాంటి ప్రమాణాలు ఏమీ చేయకపోయినా, మిమ్మల్ని కట్టిపడేసే సంబంధం లేకపోయినా, నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు” ద్విముఖ సీరియస్ గా చెప్పింది.

చేయగలిగే గొప్ప గుణం ఆ బెస్ట్ కపుల్గా సెలక్టయ్యా క… రాత్రి నా దగ్గరకొచ్చాడు

“నిజమా… నీకెలా తెలుసు?!”

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.