నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 4 152

“ప్రేమించే మనిషికి ఆమె మనసులో నుంచి మాట బయటకు రాకుండానే ఏదైనా గొప్ప గుణం అనిరుద్రకు వుందని తెలిసింది కాబట్టి. అసలేమైందో తెలుసా? మీరు

గా సెలక్టయ్యాక… ఆ డబ్బును నీకిచ్చి నీతో ప్రామిసరీ నోటు రాయించుకున్నాక ” దగ్గరకొచ్చాడు అనిరుద్ర. అప్పుడేం జరిగిందంటే…” అంటూ చెప్పడం మొదలు పెట్టింది ద్విముఖ.

****

రాత్రి పది దాటుతుండగా వచ్చిన అనిరుద్రను చూసి ద్విముఖ షాకైంది.

“ఇదేంటి… ఈ టైమ్లో… కొంపదీసి అనిమిషతో గొడవపడ్డారా?” అతణ్ణి ఆహ్వానిస్తూ అడిగింది ద్విముఖ..

“మీరు అనిమిషకు నిజంగా బెస్ట్ ఫ్రెండేనా?” సూటిగా అడిగాడు అనిరుద్ర.

“అదేంటి? ఆ డౌట్ ఎందుకొచ్చింది?”

“ఎందుకొచ్చిందంటే… అనిమిష మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఆమె కష్టాల్లో వున్నప్పుడు గమనించకుండా వుండడం వల్ల వచ్చింది” .

“వాడూ యూ మీన్” “మీ ఫ్రెండ్ ఏదో సమస్యలో వుంది కదూ”

“అవును” అంది ద్విముఖ తల వంచుకొని.

“ఏమిటా సమస్య?”

“అది మీకెందుకు చెప్పాలి?”

“నేను అనిమిష భర్తను కాబట్టి. ఆమె సుఖాల్లోనే కాదు… కష్టాల్లో కూడా నాకు భాగం వుంటుంది కాబట్టి, ఆమె మంచి చెడులు నేనే చూడాలి కాబట్టి…”

అనిరుద్ర మాటలకు అలాగే చూస్తుండిపోయింది ద్విముఖ.

“అవును… నేను ఆమె దగ్గర భర్త ఉద్యోగమే చేస్తూ ఉండవచ్చు. అయినా ఆమెను ప్రేమిస్తున్నాను తోటి మనిషిగానే కాదు… నా చిటికెన వేలు పట్టుకొని… నాటకమే అయినా… మనసులో లేకపోయినా… నన్ను పదిమంది కోసం భర్త అని గౌరవించినందుకు… ఆమె కష్టాలను పట్టించుకోకపోతే నా వ్యక్తిత్వానికి అర్థమేలేదు…”

“సారీ… మీలో అనిమిష మీద ఇంత ప్రేమ ఉందనుకోలేదు. అసలేం జరిగిందంటే…” అని చెప్పడం మొదలు పెట్టింది.

“అనిమిషకు ఒకే ఒక చెల్లెలు ఉంది. తన పేరు సుధ. ఆమె తప్ప మరెవ్వరూ లేరు. చెల్లెలంటే ప్రాణం. బెంగుళూరు నుండి వస్తుంటే రోడ్డు పక్కనే వున్న చెట్టు కొమ్మ బలంగా తాకడంతో ఆమె ప్రయాణిస్తున్న బస్సు పై కప్పు ఎగిరిపోయింది. అందులో వున్న వాళ్లల్లో పదిమంది చనిపోయారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు”
“అవునవును… చాలాకాలం క్రిందట జరిగింది. ఆ వార్త చదివిన గుర్తు”

“తీవ్రంగా గాయపడ్డ వాళ్లలో అనిమిష చెల్లెలు సుధ కూడా ఉంది. మొహం నుజ్జునుజ్జు అయ్యింది. చాలామంది డాక్టర్లు చేతులెత్తేశారు. ఓ న్యూరో సర్జన్ ముందుకొచ్చాడు.

“అనిమిష బెంగుళూరులో వున్న ఇల్లు… తన ఒంటి మీద వున్న బంగారం… అన్నీ అమ్మేసి అనేక ఆపరేషన్లు చేయించింది. సుధ మొహం ఓ రూపానికి వచ్చింది. మందులకయ్యే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ జాబ్ చేస్తూ తను చాలా పొదుపుగా వుంటే చెల్లెలికి డబ్బు పంపిస్తూ

వచ్చింది. ఈ విషయం మొన్న మొన్నటివరకూ నాకూ తెలియదు. వాళ్ల బాస్ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చినా ఎందుకు చేసుకోలేదో తెలుసా? ముందు తన చెల్లెలు బాగుడాలి. తన పెళ్లి చెయ్యాలి. ఆ తర్వాత తనకు నచ్చినవాడిని పెళ్లి చేసుకోవాలి. అంతేగానీ డబ్బుకోసం బాస్ ని మోసం చేయడానికి ఇష్టపడలేదు” అదే సమయంలో మీ ప్రకటన చేస్తుంది. ఇందులో మోసం లేదు… రెండు పక్షాలకూ అంగీకారమే. మిమ్మల్ని చేసుకుంటే డబ్బు సమకూరుతుంది. తన సమస్య పరిష్కారం అవుతుంది. అందుకే మీకు మొగుడు ఉద్యోగం ఇచ్చింది. ఆ విధంగా మిమ్మల్ని కూడా మోసం చేసే ఉద్దేశం తనకు లేదు”

“ఆఫీసులో అడ్వాన్సుగా తీసుకున్నా, గిఫ్ట్ డబ్బు కలెక్ట్ చేసుకున్నా, బెస్ట్ కపుల్గా డబ్బు వచ్చినా, మీ దగ్గర అప్పు చేసినా చెల్లెలి కోసమే. ఇంకా అనిమిష చెల్లెలు సుధకు దవడ ఎముక పెరగాలి. కృత్రిమంగా పళ్లు కట్టాల్సి ఉంది. కంటిని కూడా అమర్చాలి. ఆపరేషన్ కోసం ఇంకా అయిదారు లక్షలు కావాలన్నారు. ఇతరుల సాయాన్ని అర్ధించడానికి ఆమె అభిజాత్యం అడ్డు వచ్చింది. మీ వల్ల చాలా సమకూరింది. ఇంకా రెండు లక్షలు కావాలి. అందుకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది”

“నిజం చెప్పాలంటే… ఇన్ని బాధల మధ్య మీతో గొడవపడ్డా ఆమెకు మీతో రిలీఫ్ కలుగుతోంది. ఇదీ అనిమిష జీవితం వెనుక పరుచుకున్న విషాదపు క్రీనీడ” చెప్పింది ద్విముఖ.

3 Comments

  1. Good love story

  2. Good love story

  3. Super story Andi ilanti story nenu intha varaku ekkada chadavaledhu oka movie laga bhale rasaru super anthe …j

Comments are closed.