నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 3 121

ఆమెకు చాలా గమ్మత్తుగా అనిపించింది. అనిమిష బుద్ధిగా రాసుకుంటూ పోతోంది. ఆమె వంకే చూస్తుండిపోయాడు అనిరుద్ర.

“అవును… ఉదయమే వాకిలి ఊడ్చి…. ముగ్గు వేసే డ్యూటీ కూడా మీదే కదా” అడిగింది డౌట్గా అనిమిష.

“ఆ డ్యూటీ కూడా చేయాలా?” అడిగాడు అనిరుద్ర.

“ఏం భార్యగా మేము చేయమా… మీరెందుకు చేయరు…” “రైట్… రైట్” అన్నాడు అనిరుద్ర..

“కూరగాయలు తేవడం… వేణీళ్లు కాయడం… కూరలు వండడం… టిఫిన్… నీట్గా ఉంచడం… బట్టలు వాషింగ్ మెషిన్లో వేయడం…” చెప్పుకుంటూ రాసుకుపోతోంది అనిమిష.

“ఆగాగు… బట్టల లిస్ట్ లో ఏమేం ఉన్నాయి?” అడిగాడు అనిరుద్ర.

“ఏముంటాయి? చీరలు… బ్లౌజులు… లంగాలు.. బ్రా…” అని ఆగి అనిరుద్ర మొహంకేసి చూసి సిగ్గుతో చప్పున తలదించుకుంది.

“బట్టలు నావి నేనే పిండుకుంటాను” అంది అనిమిష నవ్వుకున్నాడు అనిరుద్ర. అనిమిష అన్ని పాయింట్స్ రాస్తూ ఉంది.

“ఇంతకీ హాలిడేస్ లిస్ట్ ఉందా?” అడిగాడు అనిరుద్ర.

“హాలిడేనా? అదేంటి?”

“అదేంటి అంటే అదే మరి… జాబ్ చేసే వాడికి హాలిడే ఉండదా? ఎవ్రీ సండే హాలిడే… సెకండ్ సాటర్ డే హాలిడే… పండుగలు.. నెలకు రెండు ఆప్షనల్ హాలిడేస్…’ లిస్ట్ చెప్పుకుపోతున్నాడు అనిరుద్ర.

బద్దకంగా కళ్లు తెరిచింది అనిమిష. తను మంచం మీద ఉంది. పక్కనే ప్యాడ్ పెన్ను. కుర్చీలో కూర్చొని కాళ్లు టేబుల్ మీద పెట్టి నిద్రపోతున్నాడు అనిరుద్ర.

‘తాను మంచం మీదికి ఎలా వచ్చింది?’ వెంటనే ఉలిక్కిపడి అద్దంలో తన మొహం చూసుకుంది. చీర చూసుకుంది. బ్లౌజు చూసుకుంది.

“నిన్నేమీ చేయలేదు. అమాంతం ఎత్తుకొని మంచమ్మీద పడుకోబెట్టాను… అంతే” కళ్లు మూసుకునే చెప్పాడు అనిరుద్ర. టైం చూసింది నాలుగున్నర కావస్తోంది.

కంగారుగా లేచి చీర సరిచేసుకొని బాత్రూంలోకి పరుగెత్తింది. స్నానం చేయాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే బాత్రూంలో నుండి బయటకు వచ్చింది. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడు అనిరుద్ర. తను స్నానం చేస్తుంటే బాత్రూం డోర్ పీప్ హోల్లో నుంచి చూస్తే.. వెంటనే సిగ్గుపడిపోయింది. అతను చూసేసినంతగా.

“ఎక్స్ క్యూజ్ మీ” అతని కళ్ల ముందు చేతులు పెట్టి పిలిచింది.

“ఏంటి? రాత్రి అసలే నాకు నిద్రలేదు” బద్దకంగా అన్నాడు అనిరుద్ర.

“నిద్రలేదా… ఏం చేశావేంటి?” అనుమానంగా అడిగింది.

“ఏం చేయలేదు కాబట్టే నిద్రలేదు… షుగర్ పేషెంట్ ముందు బందరు లడ్డు పెట్టినట్టయింది” అన్నాడు అనిమిషను ఉడికించాలని. .

‘అగ్రిమెంట్లో క్లియర్ గా ఉంది. మళ్లీ ఇలా మాట్లాడితే నేనూర్కోను… ఇక దయచేయండి” అంది అనిమిషం

“ఎక్కడికి?”

“ఎక్కడికేంటి? బయటకు”

“ఎందుకు… నాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది”

“నాకే కంపరంగా ఉంది. నేను స్నానం చేయాలి”