నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 3 121

“ఏంటి? ఇక్కడా… బావోదేమో… బెడ్ రూమ్లో స్నానం చేస్తే ఏం బావుంటుంది?”

“ఇదిగో ఇలాంటి జోక్స్ వేస్తే నాకు ఒళ్లు మండుతుంది. నేను బాత్రూమ్లోకి వెళ్లి స్నానం చెయ్యాలి”

“చేయ్… బాత్రూంకు బోల్ట్ లేదా.. ఫర్లేదు. ఎవ్వరూ రాకుండా నేను చూసుకుంటాను”

“నువ్వు రాకుండా చూసుకోవడానికే బయటకు వెళ్లమనేది”

“ఛఛ… నేనా టైప్ కాదు. పిలవని పేరంటానికి, ఇన్వయిట్ చేయని షవర్ బాత్ స్నానానికి వెళ్లే అలవాటు లేదు నాకు”

“అరె… మీకెలా చెప్పాలి… నేను స్నానం చేస్తుంటే పీప్ హోల్ నుంచి చూడరని గ్యారంటీ ఏమిటి??

“ఎంత మంచి ఐడియా ఇచ్చావ్… నిజానికి నాకా ఐడియానే తట్టలేదు. బాత్రూంలో ఈ ఫెసిలిటీ కూడా వుంటుంది కదూ” టక్కున అన్నాడు అనిరుద్ర..

“అంటే చూసేద్దామనే…” కోపంగా అంది అనిమిష

“నేనేం చూసేయను.. ఇంతోటి అందాలు కనిపించక ఇక్కడెవరూ మొహం వాచిలేరు” అన్నాడు అనిరుద్ర. .

“అంటే మీరు అందాలను కూడా చూసేశారా?” అంది ఉక్రోషంగా.

“మరి మాకేం పని? పొద్దస్తమానం అందాలు బాబోయ్… అంటూ విశాఖపట్నం అంతా రౌండేస్తాం.. చాల్చాల్లే.. వెళ్లవమ్మా… వెళ్లు” అంటూ చెయ్యి చూపించాడు.

“నువ్వు బయటకు వెళ్తేనే నేను బాత్రూంలోకి వెళ్తాను” మొండిగా అంది అనిమిష.

“నీ ఖర్మ…” అంటూ అనిరుద్ర లేచి బయటకు నడిచి గోడకు కొట్టిన బంతిలా వెనక్కొచ్చి పడ్డాడు.

“ఏంటీ… మళ్లీ వచ్చారు?”

“నేను రాలేదు. మీ యాంకర్ ఫ్రెండ్ తోసేసింది. డిటైల్స్ మొబైల్లో చెప్తుందిట” అన్నాడు. అప్పుడే అనిమిష మొబైల్ మోగింది.

“ఏయ్ అనిమిషా… నీకస్సలు బుద్ది ఉందా? బయట మీ బాస్, స్టాఫ్ ఉన్నారు. తెలుగు సినిమాల్లో వంద మందిని చితగ్గొట్టి కూడా క్రాఫ్ చెదిరిపోకుండా, బట్టలు నలగకుండా వుండే హీరోలా.. శోభనం గదిలో నుండి, అప్పుడే లాండ్రీ నుంచి తెచ్చిన డ్రెస్సేస్కొని వచ్చే శాల్తీలా అనిరుద్ర బయటకు వస్తే జనాలకు డౌట్ రాదా?” మొబైల్లో క్లాసు పీకింది ద్విముఖ.

అనిమిషకు అదీ నిజమే అనిపించింది. ఏం చేయాలా? అని ఆలోచిస్తుండగానే ఓ ఐడియా ఫ్లాషయింది.

“నేను కళ్లకు గంతలు కడతాను. నా సేఫ్టీ కోసం” అంది అనిమిషం

“సరే” అన్నాడు అనిరుద్ర.

అనిమిష అతని కళ్లకు గంతలు కట్టి బాత్రూంలోకి వెళ్లింది. అనిమిష బాత్రూంలో బట్టలు విప్పి స్టాండ్ మీద వేసి కూడా టెన్షన్గా పీప్ హోల్లో నుండి చూసింది. అనిరుద్ర తన పక్కనే వున్న ఫీలింగ్. చిత్రంగా కోపం రావడంలేదు. సిగ్గు ముంచుకు రావడంలేదు. చిన్నపాటి ఉద్వేగం… వేల వేల ప్రకంపనలయ్యాయి.