నాన్ సెన్స్ గా మాట్లాడకు. సెన్స్తో ఆలోచించిచు… Part 3 121

“ఈ డైలాగ్ వింటే రీడర్స్ అపార్ధం చేసుకుంటారు. ఇంకోమాట చెప్పు… ఈలోగా నేను మొహం కడుక్కొస్తాను… అలా బయటకెళ్లి కాఫీ తాగొద్దాం” అన్నాడు అనిరుద్ర.

“అదేంట్రా అనూ… ఫ్రెండొస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వొద్దంటుందా మీ ఆవిడ”

“అనదు.. ఆవిడ అనురాగదేవత… మట్టిలో మాణిక్యం…” “అమ్మోరు ఏమీ కాదు… పొగడ్తలు ఆపి విషయం చెప్పు”

“ఈ ఇంట్లో జరిగే ఖర్చులు ఫిఫ్టీ ఫిఫ్టీ… గెస్ట్లకు అయ్యే ఖర్చు ఎవరి గెస్ట్లు వస్తే వారే భరించాలి. ఆమె అకౌంట్లో కాఫీ తాగడం తప్పుకదరా…”

కార్తీక్ మోకాళ్ల మీద కూర్చున్నాడు.

“ఏం చేస్తున్నావురా…” కంగారుగా అడిగాడు అనిరుద్ర.

“నీ నిజాయితీ ముందు మోకరిల్లుతున్నాను. వెయ్యేళ్లు మీ చుట్టుపక్కల వాళ్ల ఆయుషు

పోసుకొని వర్ధిల్లరా…”

“థాంక్స్… పద” అంటూ తాళం కప్పతో బయటకు నడిచాడు అనిరుద్ర.

****