అలా సాయంత్రం పార్టీకి వెళ్లిన రామ్ అక్కడ చంద్రుణ్ని కాంతిలో ఇంకో చందమామ లాగా మెరిసిపోతున్న జాను నీ చూసి అలాగే చూస్తూ ఉండి పోయాడు, జాను వచ్చి సైగ చేస్తే ఈ లోకంలోకి వచ్చాడు అలా పార్టీ మధ్యలో కొంతమంది ఫ్రాన్స్ కుర్రాలు జాను నీ ఇబ్బంది పెట్టారు దాంతో కోపం వచ్చిన రామ్ వాళ్లని ఫాలో అవుతు వెళ్లాడు ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం టివి చూస్తున్న జాను కీ ఫోన్ వచ్చింది తన ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయింది అని ఎందుకు అని పెళ్లి ఇంటికి వెళ్లి చూసింది అప్పుడే జాను నీ కలవాలి అని రామ్ కూడా పెళ్లి ఇంటికి వెళ్లాడు, అప్పుడే అక్కడ అంత సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి ఉంది ఏమైంది అని చూస్తే మూడు శవాలను అంబులెన్స్ ఎక్కిస్తూ ఉన్నారు అప్పుడే తెలిసింది రామ్ రాత్రి వాళ్ల ముగ్గురు జాను ఏడిపించారు అని వాళ్లని కొరికి కొరికి చీల్చి చంపాడు రామ్ అప్పుడే తెలిసింది ఆ ముగ్గురు లో ఒకడు పెళ్లి కొడుకు అని దాంతో పెళ్లి ఆగిపోయింది, దాంతో ఎంక్వయిరీ చేస్తే తను దొరికిపోతా అని అర్థం అయిన రామ్ ఎవరికి తెలియకుండా సాయంత్రం ఫ్లయిట్ కీ ఇండియా బయలుదేరాడు అప్పుడే తన ఫ్రెండ్ పెళ్లి ఆగిపోయింది అని ఇండియా వెళ్లడానికి జాను కూడా airport కీ వచ్చింది అప్పుడు ఇద్దరు కలిసి ఒకే ఫ్లయిట్ లో ఇండియా కీ బయలుదేరారు అప్పుడు ఎందుకో రామ్ కీ నోట్లో ఏదో అడుగా ఉంది అని వెళ్లి washroom లో కక్కితే ఆ పెళ్ళి కొడుకు engagement రింగ్ పంటి మధ్య ఇరుకోని ఉంది దాని తీసి అక్కడే flush లో పడేసి తన పంటి కీ అంటుకున్న రక్తం మరకలు నీ neat గా బ్రష్ చేసి బయటకు వచ్చాడు రామ్.
రామ్, జాను ఫ్రాన్స్ నుంచి ఇండియా కీ వచ్చిన తరువాత రామ్ తన ఊరికి వెళ్లాడు అక్కడ మనోహర్ నీ కలిసి జరిగింది చెప్పాడు, దాంతో మనోహర్ తన అర చెయ్యి నీ గట్టిగా పిడికిలి బిగించి పెడితే రామ్ కీ ఊపిరి ఆడలేదు గింజుకుంటు ఉండగా మనోహర్ పిడికిలి వదిలాడు దాంతో రామ్ గట్టిగా దగ్గుతు మనోహర్ మీద కోపం గా “కన్న కొడుకును చంపాలి అని చూశావ్ అసలు మానవత్వం ఉందా నీకు” అని అన్నాడు, రామ్ చెప్పింది విని మనోహర్ కోపంగా “నీ ఆవేశం వల్ల అక్కడ ముగ్గురు చనిపోయారు నీ శక్తులు నీకు ఉన్నది ఒకరికి ఉపయోగపడే విధంగా ఉండడానికి నీ స్వార్థం కోసం వాడుకోవడం కాదు ఇలా ఉంటే నువ్వు ఎప్పటికీ సామ్రాట్ కాలేవు నీలో నాయకుడు అయ్యే లక్షణం ఒకటి కూడా లేదు నిస్వార్థం, దయా గుణం, ఆలోచన ఇవి ఏవి నీలో లేవు” అని అన్నాడు, దానికి రామ్ “నాకూ ఇవి ఏమీ లేవని ఎలా చెప్తున్నారు డాడ్” అని అడిగాడు, “వీటిలో ఏది ఉన్న నువ్వు వాళ్ళని మనిషి రూపం లో ఉండి శిక్షించే వాడివి ఇలా చంపవు అందుకే అంటారు రా వారసుడు అంటే ఆశ కీ పుట్టిన వాడు కాదు ఆశయం కీ పుట్టిన వాడు ఆ మాటకు అర్థం ఏంటో అర్థం అవుతుంది రా” అన్నాడు అది వినగానే రామ్ కోపంగా తన పంజా దెబ్బ తో తన పక్కనే ఉన్న రెండు చెట్లను కూల్చి వేశాడు అది చూసి మనోహర్ నవ్వాడు “డాడ్ వాడు పుట్టగానే మొహం కూడా చూపించుకోలేక ఇన్ని సంవత్సరాలు ఈ అడవుల్లో తల దాచుకొని ఇప్పుడు నీ కొడుకు మీద రిసెర్చ్ చేసిన వాడి లాగా మాట్లాడుతూ ఉన్నావు ఇద్దరం పుట్టింది నీకే నీ లక్షణాలే మాకు వస్తాయి అంతగా నీ పెద్ద కొడుకు గురించి భజన చేసుకోవాలి అనుకుంటే మమ్మల్ని వదిలేసి వెళ్లిపో నా అమ్మ నీ నేను జాగ్రత్తగా చూసుకుంటా” అన్ని అన్నాడు దానికి మనోహర్ నవ్వుతూ “నేను పోతే మీ అమ్మను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నావు కానీ నీతో పాటు పెరిగిన నీ కజిన్స్ నీ ఈ గూడెం జనం నీ కలిపి చూసుకుంటా అని అనలేదు ఇక్కడే నీ అర్హత తెలుస్తోంది అదే నా శ్రీను అయితే తన తల్లితో పాటు తన వాళ్ల కోసం తన ఒంట్లో చివరి రక్తం చుక్క ఉన్నంత వరకు పోరాడుతాడు mark my words son ఏదో ఒక రోజు నీకు అవసరం వస్తే వాడు కచ్చితంగా వస్తాడు” అని చెప్పి వెళ్లిపోయాడు మనోహర్.
దాంతో రామ్ ఆవేశం గా లక్ష్మి దగ్గరికి వెళ్లి తను ఊరి నుంచి వెళ్లిపోతున్న విషయం చెప్పి అక్కడి నుంచి ఢిల్లీ కీ వెళ్లి జాను నీ కలిసి ఇద్దరు కలిసి ప్రోగ్రాం మొదలు పెట్టాలి అని జాను వాళ్ల నాన్న నీ కలిశారు అయన కూడా ఓకే చేయడం తో ఇద్దరు కలిసి, హర్యానా, నుంచి తమిళనాడు వరకు ఉన్న ట్రైబల్ ప్రాంతాల్లో అడవి రుచులు దేశం కీ పరిచయం చేశారు, ఆ ప్రాసెస్ లో ఇద్దరికి ఒకరితో ఒకరు కలిసి పోయారు మెల్లగ ప్రేమలో పడ్డారు ఒక రోజు ఇద్దరు ఢిల్లీ వెళ్లారు అప్పుడు రామ్ తన కార్ నీ జాను నీ నడపమని చెప్పాడు దాంతో జాను కొంచెం భయపడి కార్ నడపడానికి ఒప్పుకోలేదు, దాంతో రామ్, జాను తో తన కళ్లలోకి చూడమని చెప్పి తన మీద నమ్మకం ఉందా అని అడిగాడు దానికి జాను ఉంది అని తల ఆడించింది నువ్వు నా కళ్లలోకి చూస్తూ drive చేస్తావు రోడ్డు సంగతి నేను చూసుకుంటా అని అన్నాడు, కాకపోతే జాను కీ తెలియని విషయం ఏంటి అంటే రామ్ తన werewolf technique తో జాను నీ కంట్రోల్ చేస్తున్నాడు అని దాంతో జాను వెళ్లి driving seat లో కూర్చుని రామ్ కళ్లలో చూస్తూ రోడ్డు వైపు చూడకుండా driving చేయడం మొదలు పెట్టింది అప్పుడు రామ్ కూడా రోడ్డు వైపు చూడకుండా తన sensing పవర్ తో జాను కీ డైరక్షన్ ఇస్తూ ఉన్నాడు అప్పుడు ఒక చోట రోడ్డు crossing వచ్చింది అవతలి వైపు నుంచి వేరే లారీ రావడంతో రామ్ హ్యాండ్ బ్రేక్ లాగి స్టీరింగ్ నీ తిప్పి కార్ drift కొట్టి లారీ నుంచి పక్కకు తీసుకోని వెళ్లాడు అలా సడన్ గా లారీ light వల్ల disturb అయిన జాను, రామ్ మైండ్ కంట్రోల్ నుంచి బయటకు వచ్చింది దాంతో ఒక్కసారిగా జాను ఏడ్వడం మొదలు పెట్టింది.

Rey idhi sex story na leka Esho cinema Ki script Rasi ikkada peduthunnava endhi ra Babu nee Loveda lo sodhi