ఊహిం 2 241

అక్కడికి..ఒక అరుదైన జాతికి చెందిన..చిలుక గోరికలు..ప్రతి శీతాకాలం లో వచ్చి వెళతాయి

వాటిని తన కెమెరా తో బంధించడానికి రోజు..ఆ దేవాలయానికి వెళుతున్నాడు.

ఒక చక్కని సాయంత్రం వేళా..ఆ అరుదైన పక్షి జాతిని చూసాడు..తన కెమెరా తో..క్లిక్ లాగబోతూ ఉంటే..

సరిగ్గా అప్పుడే ఒక అందమైన అమ్మాయి..కాజరహో లాగా చెక్కిన శిల్పం లా హ హా అని నవ్వుతూ వెనక్కి వెనక్కి నడుస్తూ వచ్చి..రాజా ని గుద్దుకుంది..

ఆ అమ్మాయి పేరే కాజల్

రాజా కొంచెం చిరాకు పేస్ పెట్టి..తిట్టబోయి..అమ్మాయి మొహం లో తొణికిసలాడుతున్న అమాయకత్వం అందం చూసి..సైలెంట్ అయ్యి ఆలా చూస్తూ వుండిపోయాడు.

కాజల్ “సారీ సర్ సారీ అని రిక్వెస్ట్ గా చెప్పి”..పక్కన ఉన్న స్నేహితురాళ్లు వైపు..చిరుకోపం తో చూస్తూ మందలించింది..

అప్పటి నుండి..రాజా..ఆ దేవాలయానికి.పక్షుల కోసం కాకుండా..కాజల్ కోసం వెళ్లడం మొదలెట్టాడు..కాజల్ ని ఫాలో అవ్వడం చేసాడు..

ఓసారి..కాజల్..తో కాజల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి “ఒసే ఆ అబ్బాయి చూసావా మన వెనుక వస్తున్నాడు.మొన్న గుద్దావ్ కదా గురుడికి ఎక్కడో గుచ్చుకుంది ఏమో..ఫాలో అవుతున్నాడు” అంది..

కాజల్ “ఏంటి అవునా.నన్ను ఫాలో అవుతున్నాడా” అని..సరా సరి రాజా దగ్గరకి వచ్చి,,”హే మిస్టర్ ఏంటి నాలుగు రోజుల నుండి చూస్తున్నా మొన్న సారీ చెప్పా కదా అయినా ఫాలో అవుతున్నావ్ ఏంటి” అంది..

రాజా అమాయకం గా ఏమి ఎరగనట్టు “మాడం నేను మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతా నేను ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ని..నాకు ఫోట్గ్రాఫీ అంటే..ఇష్టం..చుట్టూ పక్కల కొత్తగా అందం గా కనిపించిన వాటికీ క్లిక్ చేస్తా అంతే.”.అన్నాడు..(లోపల మనసులో నీకోసమే )

కాజల్ వెంటనే..కెమెరా లాక్కుని కెమెరా లో ఒక్కో పక్షి ఫోటో ఒక్కో ప్రకృతి అందం చూసి వావ్ సూపర్ అని థ్రిల్ అవుతూ..ఇందాక ఫాలో అవుతున్నాడు అని కవ్వించినా ఫ్రెండ్ ని చెడ మాడ తిట్టేసి..రాజా వైపు చూసి.సారీ అండి మళ్ళీ పొరపాటు అయ్యింది అంది రాజా నవ్వి పర్లేదు లెండి కొన్ని కొన్ని పరిచయాలు అపార్దాలతోనే మొదలవుతాయి.అని నా పేరు రాజా అని పరిచయం చేసుకున్నాడు..

కాజల్ కూడా తన పేరు చెప్పింది….ఇద్దరి పరిచయాలు అయ్యాక. కాసేపు మాట్లాడుకున్నారు..

………………………………………………………..

ఆలా…నాలుగు సంవత్సరాలు క్రితం సంఘటనలు నెమరేసుకుంటూ ఉంటే..

బయట గుమస్తా వచ్చి. .సర్ మీకోసం అనసూయ మాడం వచ్చారు అన్నాడు.

రాజా వెంటనే తేరుకుని లోపలకి రమ్మను అన్నాడు..

అనసూయ లోపలకి వచ్చి రాజా వైపు నవ్వుతూ..చూస్తూ సీఎం గారు..చనిపోయిన పాత సీఎం రాజేంద్ర వర్మ..గారి..ప్రమాదం కేసు దర్యాప్తు చెయ్యడానికి దర్యాప్తు బృందం వచ్చింది..అని ఇద్దరు ఆఫీసర్స్ ని చూపించింది..

ఈమె సీనియర్ హెడ్ ఆఫీసర్..స్నేహ..

స్నేహ : “నమస్తే సర్” అంది

ఇతను..ఆమె అసిస్టెంట్ జై..అని పరిచయం చేసింది..

జై: “నమస్తే సర్ ” అన్నాడు

రాజా ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి..చాలా పారదర్శకం గా దర్యాప్తు చెయ్యండి అన్నాడు..

స్నేహ “తప్పకుండా సర్.అసలు ఏం జరిగిందో ఎంక్వయిరీ చేసి..మొత్తం రిపోర్ట్ మీకు అందిస్తాం సర్ అని.తన అసిస్టెంట్ ని తీసుకుని వెళ్ళిపోయింది..

స్నేహ వెళ్ళిపోగానే అనసూయ రాజా వైపు ఓరగా చూస్తూ ముందుకు వంగి..రాజా చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కేస్తూ..”ఏంటి సర్ పరధ్యానం లో వున్నారు..ఏంటి కథ..ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన..అమ్మాయిని చూసి ఏమన్నా ఫ్లాట్ అయ్యారా ఏంటి” అంది..

రాజా నవ్వి “అదేం లేదు..అనసూయ వచ్చేవారం..మనం ఇంకా మనతో పాటు ఇద్దరు అధికారులు..ఆస్ట్రేలియా . జరుగనున్న పెట్టుబడి దారుల సమావేశానికి వెళుతున్నాం వారం రోజులు పర్యటన దానికి సంభందించిన ఏర్పాట్లు అన్ని అధికారులతో చర్చించు

అక్కడ ఏమేమి ప్రసగించాలో అది కూడా అధికారులతో అంతా మాట్లాడు అన్నాడు..
అనసూయ వావ్ ఆస్ట్రేలియా పర్యటన మీతోనే..అయితే ఎంత రొమాంటిక్ గా ఉంటుందో అని అంచనా వెయ్యొచ్చు అని కొంచెం ఎక్సైట్ అయ్యి సరే అధికారులతో మాట్లాడతా అని వెళ్ళిపోయింది..
చీఫ్ సెక్రెటరీ రాగానే రాజా కూడా ఆరోజు తన షెడ్యూల్ తో బిజీ అయ్యాడు.