జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 43

వెంటనే అంటీ వచ్చి నన్ను , అమ్మను పరిచయం చేస్తూ , వాళ్ళను మా ఇద్దరికీ పరిచయం చెయ్యగా ,ఏమి తెలియని వాడిలా పెద్దల పాదాలకు నమస్కరించి మామయ్య మీ కాలు నొప్పి ఎలా ఉంది అని చిన్నగా అడుగగా , అల్లుడు నువ్విచ్చిన సంతోషంతో ఈ నొప్పి ఏపాటిది అని చెప్పగా , పైకి లేచి కిషోర్ ను గట్టిగా కౌగిలించుకొని థాంక్స్ బావ అని చెప్పి ఏమి తెలియని వాడిలా వెనుక నిలబడగా , కిషోర్ నాన్నగారు అమ్మవైపు తిరిగి రెండు చేతులు జోడించి గౌరవంగా నమస్కరించి చెల్లెమ్మ , మా కుటుంబం మరియు మా అబ్బాయ్యి మీకు నచ్చారా అమ్మ , మీకు నచ్చితేనే మీ స్నేహితురాలి కుటుంబానికి మేము నచ్చినట్లు అని బండ గుద్ది చెప్పారు.

కాబట్టి తన కుటుంబం గురించి మొత్తం అమ్మకు చెప్పి మీకు మేము నచ్చాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాము , మీరు మనఃస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మాకు కూడా చాలా సంతోషం అని వినయంగా చెప్పగా , పక్కనే ఉన్న దివ్యక్క సంతోషాన్ని చూసి మా అమ్మాయికి మీ అంతటి మంచి కుటుంబం దొరకడం మా పూర్వ జన్మ సుకృతం అని ఎత్తుకున్న బుజ్జాయికి ప్రేమగా ముద్దు పెట్టి చెబుతుండగా అందరూ సంతోషిస్తూ పంతులు గారు నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూడండి అని సంతోషంగా గట్టిగా చెప్పగా , మొత్తం ఇద్దరి జాతకాలు చూసి రెండు రోజుల తరువాత సాయంత్రం 6 గంటలకు నిశ్చితార్థం మరియు రెండు నెలల తరువాత పెళ్లికి మంచి ముహూర్తం ఉందని చెప్పగా , అందరూ ఆనందంగా ఒప్పుకుంటూ వాటినే ఫిక్స్ చేసేస్తారు.

కిషోర్ మరియు దివ్యక్క ఒకరినొకరు చూసుకొని సంతోషంగా నవ్వుతుండగా ,కిషోర్ మరియు వాళ్ళ బావ నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకొని థాంక్స్ అండి , తరువాతి రోజు మీకోసం చాలా వెతికాము , కానీ మీ గురించి మాకు ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో చాలా విచారించాము , దేవుడి దయ వల్ల దేవుడి లాంటి మీతోనే మా బావమరిది వల్ల బంధుత్వం కుదిరింది , రేపు కచ్చితంగా బాబుతో మీ ఇంటికి వచ్చి అమ్మ గారి ఆశీర్వాదం తీసుకుంటే తప్ప నా మనసు కుదుటపడదు అని చెప్పగా , అలాగే అన్నయ్య అని సంతోషంగా మాట్లాడుతుండగా, అమ్మ మరియు అంటీ గుసాగుసలాడుతూ అన్నయ్య గారు ఒక గంటలో వంట చేస్తాము అందరూ కలిసి తిందాము అని చెప్పగా , సరే చెల్లెమ్మ మా వాళ్ళ సహాయం కూడా తీసుకొని తొందరగా కానివ్వండి అని చాలా ఆకలిగా ఉంది అని నవ్వుతూ చెప్పగా , అమ్మ , అంటీ దగ్గరికి వెళ్లి , అమ్మ నేను కృష్ణ వెళ్లి స్వీట్స్ తెస్తాము అని చెప్పగా , సరే కన్నయ్య తొందరగా వచ్చెయ్యండి అని ప్రేమగా చెప్పగా , బావకు ఇప్పుడే వస్తామని చెప్పి కారులో వెళుతుండగా , ఏరా ఇంకా అలాగే ఉన్నావు అని అడుగగా , లేదు రా మామ కొన్ని రోజుల క్రితం ఆయనే వచ్చి డబ్బు ఉంటేనే పెళ్లి అని గట్టిగా చెప్పి , ఈ రోజు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయి కుటుంబం తో సహా వచ్చి మా నాన్నను , అమ్మను క్షమించమని ప్రాధేయపడుతున్నాడు , నాకు ఇప్పటికి ఆశ్చర్యంగానే ఉందిరా మామ అని చెబుతుండగా , రేయ్ ఏమి భయపడాల్సిన అవసరం లేదు , చూస్తుంటే చాలా మంచి వారిలా కనిపిస్తున్నారు.

1 Comment

Comments are closed.