జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 53

బావ గారు ఇప్పుడు మీ తలకు తగిలిన దెబ్బ నొప్పి తగ్గిందా అని అడుగగా , ఇప్పుడు నొప్పి ఏమి లేదు బావ వారంలో మానిపోతుందని డాక్టర్ చెప్పాడని చెప్పగా , సంతోషంగా నవ్వుతూ అయితే పదండి వెళదాము అంకుల్ మరియు కృష్ణ ,దివ్యక్క కోసం కంగారుపడుతుంటారేమో అని చెప్పగా , కిషోర్ గుడిలోకి వెళ్లి పంతులుకు డబ్బు ఇచ్చేసి వాళ్ళ స్నేహితులందరిని తన కారు ఇచ్చి ఒప్పించి పంపించివేసి , పెళ్లి బట్టలు మార్చుకొని నా కారులో ముగ్గురం సిటీ వైపు వెల్లసాగాము.

ఇంట్లో ఇక్కడ జరిగినదంతా చెప్పవద్దని మరి మరి చెప్పి వీధి ప్రవేశం దగ్గరే దివ్యక్కను దింపి ఎలాగో నుదుటి మీద పెద్ద బొట్టు ఉండటంతో అంకుల్ ఎక్కడకు వెళ్ళావు అని అడిగితే గుడికి వెళ్ళాను అని చెప్పమని చెప్పి , కిషోర్ ను ఇంటి అడ్రస్ అడుగగా MVP కాలనీ అని చెప్పగా 20 నిమిషాలలో చేరుకొని , దారి చూపిస్తుండగా ఇంటి దగ్గరకు చేరుకొనగా బావ నువ్వు వేళ్ళు నేను కొద్దిసేపు తరువాత వచ్చి నాన్నను కలుస్తాను అని చెప్పి , కొద్దిగా ముందుకు నెమ్మదిగా వెల్తూ కారును ఖాళీ స్థలం ఉన్న చోట పార్క్ చేసి ఒక అర గంట తరువాత కిషోర్ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్ళాను.

ఇంటి దగ్గరికి చేరుకోగా మూడంతస్తుల పెద్ద భవనం , ఇంటి ముందు పెద్ద కాంపౌండ్ ఉన్నట్లుగా పెద్ద ప్రహరీ గోడ చాలా ఎత్తువరకు కట్టారు. సమయం వొంటి గంట అవుతుండగా లోపలికి వెళ్తుండగా సెక్యురిటి ఆపి ఎవరు కావాలని ప్రశ్నించగా సర్ ను అర్జంట్ గా కలవాలి అని చెప్పగా , నన్ను పై నుండి కింద వరకు చూసి కొద్దిగా నీట్ గా ఉండటంతో , తన టెంట్ లోపలికి వెళ్ళి ల్యాండ్ లైన్ నుండి కాల్ చేస్తూ సర్ మిమ్మల్ని అర్జంట్ గా కలవాలని ఒక అబ్బాయి వచ్చాడు సర్ అని చెప్పగా కొన్ని సేకనులు తరువాత ఫోన్ లో ఏదో చెప్పగా , నా దగ్గరికి వచ్చి సర్ పిలుస్తున్నారు లోపలికి వెళ్ళండి చిన్న గేట్ తెరిచి స్ట్రెయిట్ గా వెళ్లి రైట్ తీసుకోండి అని చెప్పగా , అతడు చెప్పినట్లు తలుపు దగ్గరికి వెళ్లి చెప్పులు విడిచి తెరిచే ఉండగా తలుపుకు చేతితో కొట్టి సర్ అని పిలువగా లోపలికి రా అని మాటలు వినబడటంతో వెళ్లగా కుడివైపున సోఫా లో కూర్చుని ఉన్న కిషోర్ నాన్న కాలు పాదం దగ్గర చిన్న కట్టు కట్టి ఉండటంతో దగ్గరకు వెళ్లగా కూర్చోమనగా , thank యు సర్ అని గౌరవించి కూర్చుంటూ ఆయన పక్కనే సోఫా లో నుండి పడిపోకుండా దిండ్లు అడ్డం పెట్టి పడుకోబెట్టిన బాబును చూసి చాలా సంతోషం వెయ్యసాగింది.

నాతో ఏమి పని డైరెక్ట్ గా పాయింట్ కు వచ్చెయ్యగా ,నేను కూడా లాగకుండా మీ అబ్బాయిగారు ప్రేమిస్తున్న దివ్య మా అక్క సర్ , వాళ్ళ పెళ్లి గురించి , సర్ మా అక్క చాలా మంచిది సర్, అత్త మామయ్యలను తల్లి దండ్రులుగా చూసుకుంటుంది సర్ , మెట్టినింటి గౌరవాన్ని కాపాడుతూ పెంచుతుంది సర్ అని చెబుతుండగా , చూడు బాబు నేను మీ ఇంటికి వచ్చి మొత్తం అంతా చెప్పేశాను , డబ్బు ఉంటేనే పెళ్లి అని అంటుండగా ,సోఫాలో నుండి లేచి ఆయన ముందు మోకాళ్లపై కూర్చొని కళ్ళు పట్టుకొని ,సర్ ప్లీస్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకోండి సర్ అని బతిమాలగా , చూడు బాబు డబ్బు లేకుండా పెళ్లి జరగదు ఇక నువ్వు బయలుదేరోచ్చు అని కరాఖండిగా చెబుతూ సెక్యురిటి అని కేక వేస్తుండగా ,

1 Comment

  1. 👌👌👌

Comments are closed.