జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 43

పడుకున్న బుజ్జాయికి మెలకువ వచ్చి గుక్క పెట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టగా , ఆయన ఎత్తుకోగా ఇంకా గట్టిగా ఏడుస్తూ గుక్క తిప్పుకుంటుండగా , వాళ్ళ ఆవిడను , కూతురిని పీలుస్తూ కాలికి కట్టు ఉండటం వల్ల లెవలేక పోతుండటంతో , సర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు పిలుచుకుని వస్తాను అని అడుగగా మూడో అంతస్తులో ఉన్నారు అని చెప్పగా , పైకి లేస్తుండగా ఇంకా గట్టిగా శ్వాశ కూడా పీల్చుకోకున్నట్లు ఏడవగా ,సర్ కళ్లల్లో నీళ్లు రాగా , సర్ నేను వాళ్లకు ఇస్తాను ఇతివ్వండి అని అడుగగా , తొందరగా అదిగో ఎదురుగా మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళమని నాకు అందించగా , నా చేతి స్పర్శ బుజ్జాయికి తగలగానే ఒక్కసారిగా ఏడవటం ఆపేసి నేను పూర్తిగా రెండు చేతుల్లోకి తీసుకోగా నవ్వడం మొదలెట్టాడు.

బాబు పుట్టిన తరువాత వీళ్ళ అమ్మ కంటే ఆస్పత్రికో ముందు ఎత్తుకున్నది నేనే కాబట్టి, సర్ కూడా ఆనందిస్తూ హమ్మయ్య అని తన కళ్ళను తుడుచుకుని గుండెలపై చెయ్యి వేసుకొని , నా బుజ్జి కన్నా అని ఎత్తుకోవడానికి అన్నట్లు చేతులు చాపగా , సర్ చేతిలోకి ఇవ్వగా మళ్ళీ ఎడవడంతో , అలాగే ఎత్తుకొని భుజంపై సున్నితంగా తట్టగా ఏడుపు ఆపి నిద్రపోగా నెమ్మదిగా సోఫా పై పడుకోబెట్టి , సోఫా మీద ఉన్న పెన్ , పేపర్ ను సర్ కు అందించి మీ అకౌంట్ నెంబర్ మరియు బ్యాంక్ పేరు రాయమనగా , మారు మాట్లాడకుండా రాయగా , వెంటనే మొబైల్ అందుకొని తలుపు దగ్గరికి వచ్చి అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఎక్కడ ఉన్నావు అని అడుగగా ఇప్పుడే భోజనం చేసి బ్యాంక్ లోకి వెళుతున్నాను అని చెప్పగా అకౌంట్ నెంబర్ మరియు బ్యాంక్ చెప్పి one crore అర్జంట్ గా ట్రాన్స్ఫర్ చెయ్యమని చెప్పగా , ఒక్క నిమిషం బేబీ అని వేగంగా కంప్యూటర్ దగ్గరికి వెళ్లి చక చకా టైప్ చేస్తూ అయిపోయింది బేబీ రెండు నిమిషాల్లో మెసేజ్ వస్తుంది అని చెప్పగా , లవ్ యు అమ్మ తరువాత కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి జేబులో మొబైల్ పెట్టుకొని,సర్ మీకు మనుషుల మంచితనం కంటే డబ్బే ఎక్కువ అయితే అలాగే కానివ్వండి అని చెబుతుండగా అతని జేబులో ఉన్న మొబైల్ కు మెసేజ్ వచ్చినట్లు శబ్దం రాగా , చూసుకోండి అని చెప్పగా , మొబైల్ తీసి one crore తన బ్యాంక్ అకౌంట్ లో పడినట్లు చూపెడుతుండగా , ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ నేను ఆడిగినది 50 లక్షలు మాత్రమే అని చెప్పగా ,అతడి ముందు మోకాళ్లపై కూర్చొని నాకు మా అక్క మీద ఉన్న ప్రేమ ఎంతిచ్చినా సరిపోదు.

మా అక్కయ్యను జాగ్రత్తగా చేసుకోండి అది చాలు అని చెప్పి, ఇక వెళ్ళొస్తాను సర్ అని చెప్పి బయటకు నడుస్తుండగా పై నుండి కిషోర్ మరియు వాళ్ళ అమ్మ మరియు అక్క మెట్లు దిగుతూ , వాళ్ళ అక్క నన్ను చూసి ఆశ్చర్యపోయి గట్టిగా అన్నయ్య అని పిలుస్తూ మెట్ల మీద పడిపోతుందని తెలిసి కూడా వేగంగా కిందకు వచ్చి sorry అన్నయ్య , నాన్న గారు ఆసుపత్రికి వచ్చిన తరువాత మీకు థాంక్స్ చెప్పడానికి మీ కోసం చాలా వెతుకుతూ ఇప్పటికి రోజు అదే తలుచుకుంటూ బాధపడుతున్నారు.

1 Comment

Comments are closed.