జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 43

సాయంత్రం 6 గంటల సమయంలో కిషోర్ కుటుంబం మొత్తం కృష్ణ ఇంటికి రాగా , అంటీ , అంకుల్ ఆశ్చర్యంగా చూస్తూ మౌనంగా ఉండిపోగా , కిషోర్ నాన్న గారు అంకుల్ దగ్గరకు వెళ్లి తన రెండు చేతులతో పట్టుకొని వొంగి , నన్ను క్షమించండి బావ గారు , మీ కుటుంబం మంచితనం తెలియక నేను మిమ్మల్ని కష్టపెట్టాను , పెద్ద మనసుతో నన్ను క్షమించి నయా పైసా కూడా కట్నం లేకుండా మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాము .

సర్ పైకి లేవండి అని చెప్పగా మీరు ముందు నన్ను క్షమించరాని అంటేనే నా మనసు కుదుటపడేది , అప్పుడే నేను లేచేది అని అంకుల్ చేతులు ఇంకా గట్టిగా పట్టుకొని ప్రాశ్చాత్తాపంతో చెప్పగా , ఆనందిస్తూ సర్ మిమ్మల్ని క్షమించే స్థాయి మాకు లేదు , కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి క్షమించాను లేవండి సర్ అని చెప్పగా , లేదు లేదు మీరు నన్ను క్షమించినట్లుగా లేదు అని చెబుతుండగా , నేను నా మనఃస్ఫూర్తిగా క్షమించాను సర్ అని చెప్పగా , బావగారు క్షమించానని చెప్పి ఇంకా సర్ అంటున్నారే అని అడుగగా , అంకుల్ బావగారు అని పైకి ఎత్తి కౌగిలించుకోగా ఇప్పుడు నా మనసు హాయిగా ఉంది బావగారు.

చూడండి బావగారు మీ అమ్మాయి మా ఇంటి కోడలిగా రావడం మా ఇంటిల్లిపాధికి చాలా చాలా ఇష్టం, ఇప్పుడు అడుగుతున్నాను నా కొడుకుకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం మీకు ఇష్టమేనా అని వెనక్కు జరిగి అడుగగా , అంతలో దివ్యక్క అందరూ ఉన్న దగ్గరికి సంతోషంగా రాగా , కిషోర్ అమ్మ మరియు అక్క ఇద్దరు వెళ్లి దివ్యక్క చేతికున్న కట్టును బాధతో చూస్తూ , ప్రేమగా చెంపను చేతితో నిమురుతూ నెమ్మదిగా ఇలాంటి పిచ్చి పనులు ఎప్పటికి చెయ్యకు తల్లి.

మీ మహేష్ అన్నయ్య తట్టుకోలేడు. అలాంటి అన్నయ్య దొరకడం నీకు మాత్రమే కాదు మాకు కూడా దేవుడితో సమానం అని మనఃసాక్షిగా తీవ్ర భావోద్వేగంతో చెప్పగా , దివ్యక్క కళ్ళల్లో అన్నయ్య పై ప్రేమతో కళ్లల్లో నీళ్లు కారసాగాయి. కిషోర్ వాళ్ళ నాన్న అత్తయ్య దగ్గరకు వెళ్లి చెల్లెమ్మ నన్ను క్షమించండి అని రెండు చేతులు జోడించి అడుగగా ,సంతోషంతో అన్నయ్య గారు మీరు…..

1 Comment

Comments are closed.