జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 43

చివరికి ఎలాగో నాన్న గారు మిమ్మల్ని కనుగొన్నారు. మిగతా వారంతా ఆశ్చర్యంగా మమ్మల్నే చూస్తుండగా , అమ్మ , ఒరేయ్ తమ్ముడు , ఈ అన్నయ్య లేకపోతే నేను , మీ బావ గారు మరియు నా కడుపులో ఉన్న మన బాబు బ్రతికి ఉండేవాళ్ళము కాదు , అని భావోద్వేగంతో చెప్పగా , కిషోర్ నా దగ్గరికి వేగంగా వచ్చి thank you సో మచ్ బావ అని చెబుతుండగా , కిషోర్ వాళ్ళ అమ్మ చేతులెత్తి మొక్కుతుండగా అమ్మ మీరు చాలా పెద్దవారు అని చేతులను కిందకు దించగా, కిషోర్ వాళ్ళ నాన్న తాను చేసిన తప్పుకు చాలా బాధపడుతూ నొప్పి ఉన్నా కూడా కట్టి పట్టుకొని కష్టంగా పైకి లేచి నా వెనుక నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి నా భుజం పై చెయ్యి వెయ్యగా , వెనుకకు తిరగగా కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ ప్రాశ్చాఅత్తాపం కలిగిన ముఖంతో తాను చేసిన పనికి సిగ్గుపడుతూ నిలబడలేక పడిపోతుండగా , సర్ అని పట్టుకొని నెమ్మదిగా పిలుచుకొని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఆయన ముందు కూర్చోగా నా తలపై చెయ్యి వేసి నా చేతిని పట్టుకొని నన్ను క్షమించమనే అర్హత కూడా నాకు లేదు.

మా బాబును చూసిన వెంటనే మీకు సహాయం చేసాను పెళ్లికి ఒప్పుకోండి అని నువ్వు గట్టిగా అడగవచ్చు , కానీ నీ మనసు చాలా పెద్దది అల్లుడు , నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలని ఉంది కాని నీ ఆయుష్షు తగ్గుతుందని ఆగిపోయాను. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. మీకు బంధువులు అవ్వడం మాకు గర్వకారణం, నీ మంచి మనసుతో నన్ను క్షమించి నువ్విచ్చిన కోటి రూపాయలు వెనక్కు తీసుకో అల్లుడు , నాకు పైసా కూడా కట్నం వద్దు.

మీ అక్కయ్య లక్ష్మి దేవిలా మా ఇంట్లో అడుగు పెడితే చాలు మాకు అదే సంతోషం అని హృదయపూర్వకంగా చెప్పగా , కిషోర్ , మరియు వాళ్ళ అక్క మరియు అమ్మ ఆశ్చర్యంగా చూస్తుండగా , అవునమ్మ దివ్యా మహేష్ కు అక్కయ్య అవుతుంది అని కిషోర్ చెబుతుండగా, సర్ అని అంటుండగా ఆపి మావయ్య అని పిలవమని బతిమాలగా , సరే మామయ్య గారు కట్నం కాకుండా మా అక్కకు గిఫ్ట్ ఇచ్చాననుకోండి అని చెబుతుండగా , కిషోర్ అక్కయ్య నాన్న ఏంటిది , మహేష్ దగ్గర మీరు కట్నం తీసుకున్నారా , ఇది చాలా పెద్ద తప్పు నాన్న , వెంటనే తిరిగి ఇచ్చెయ్యండి అని అందరూ మూకుమ్మడిగా చెబుతుండగా , అది నేను ఇష్ఠంగా ఇచ్చినది , దాని గురించి మరిచిపోండి అని ఒప్పించి , నాకు ఒక మాట ఇస్తారా, ఏంటని అందరూ నా వైపు చూస్తుండగా నేను ఇక్కడికి వచ్చి డబ్బు ఇచ్చి ఒప్పించానని ఎవ్వరికి , ముందుగా మా ఇంట్లో అస్సలు తెలియనివ్వకండి , మీ గురించి తప్పుగా అనుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పగా , కిషోర్ తండ్రి ఇంకా కృంగిపోతూ నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా మా పరువు గురించే ఆలోచిస్తున్నావు నువ్వు మా కంటే గొప్పవాడివి అల్లుడు అని నా కాళ్ళ మీద పడుతుండగా ఆపి , మామయ్యకు కౌగిలించుకోగా , మనఃస్ఫూర్తిగా ఆనందిస్తూ, ఇప్పుడే మా కుటుంబం మొత్తం మీ ఇంటికి వచ్చి సంతోషంగా పెళ్లి ఫిక్స్ చేస్తాము అని చెప్పగా , అత్యంత సంతోషంతో గుండెలపై చెయ్యి పెట్టుకొని థాంక్స్ మామయ్య , అమ్మ వాళ్ళు రాజమండ్రి వెళ్లారు 4 గంటలకళ్ల వస్తారు , మీరు సాయంత్రం వచ్చారంట అందరూ ఇంట్లో ఉంటాము అని చెప్పి బయలుదేరుతుండగా , అత్తయ్య నన్ను ఆపి సమయం కూడా అయ్యింది వంట రెడీగా ఉంది భోజనం చేసి వెళ్ళమని చెప్పగా , దాంతో అందరూ ప్రాధేయపడుతూ చెప్పగా , ఆత్మీయంగా , ప్రేమగా వడ్డించగా వద్దనలేక మామయ్య మరియు కిషోర్ తో పాటు కూర్చొని కడుపు నిండా భోజనం చేసి , అత్తయ్య భోజనాలు చాలా బాగున్నాయి , మా అక్కయ్య కూడా మీలాగే చేస్తుంది అని చెప్పగా , మా కోడలిని సొంత కుతురులా చూసుకుంటాము అల్లుడు అని చెప్పగా , కళ్లల్లో ఆనంద భాస్ఫాలు కారుతుండగా అత్తయ్య పాదాలు నమస్కరించి , థాంక్స్ అత్తయ్య అని చెప్పి అందరికి వెళ్ళొస్తానని సంతోషంగా చెప్పి , సోఫా లో పడుకున్న బుజ్జి బాబుకు తియ్యగా ముద్దు పెట్టి బయటకు వస్తూ ఈ విషయాలన్నీ ఎవ్వరికి చెప్పవద్దని మరి మరి చెప్పి, కిషోర్ కూడా నాతో పాటే కారు వరకు రాగా బావగారు సంతోషమేనా అని అడుగగా , భావోద్వేగంతో నన్ను గట్టిగా కౌగిలించుకొని నువ్వు మా కుటుంబానికి చేసిన సహాయానికి ఎలా రుణం తీర్చుకోవాలి మహేష్ అని అడుగగా , ఇప్పటినుండి మనం బంధువులం బావగారు మా అక్కయ్యకు మీ లాంటి మంచి కుటుంబం దొరికింది అది చాలు మాకు బావ అని గట్టిగా కౌగిలించుకున్నాను.

1 Comment

Comments are closed.