జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 66

పిల్లలిద్దరికి అమ్మకు , అక్కకు చెప్పొద్దని చెప్పగా , సర్ప్రైజ్ సూపర్ మామయ్య అని కారులోకి ఎక్కి ఊరు బయటకు వచ్చి నెమ్మదిగా పోనిస్తూ ఒక అర గంటలో” కొండకర్ల బర్డ్ sanctuary “కి చేరుకున్నాము. మహి ఆశ్చర్యంగా కారు దిగుతూ “ఎప్పటి నుండో ఇక్కడికి రావాలని మా స్నేహితులందరూ అనుకున్నాము కానీ కుదరలేదు బావ thank యు బావ” అని చిరునవ్వుతో సంతోషంగా చెప్పసాగింది.

పిల్లలిద్దరూ “మీకు surprise ఇవ్వాలని మామయ్య మీకు చెప్పొద్దన్నాడు, మాకు ముందే తెలుసు” అని గెంతులేస్తూ ఆనందంగా గర్వంగా చెప్పగా , పిల్లలందరి సంతోషాన్ని చూసి అత్తయ్య ఆనంద భాస్పాలు కారుస్తూ , “ఎంత కాలమైంది పిల్లలందరూ ఇలా సంతోషంగా నవ్వి” అని తనలో తాను అనుకుంటూ నన్ను గట్టిగా కౌగిలించుకొని “లవ్ యు బుజ్జి” అని చెప్పసాగింది. “మీ పెదవులపై నవ్వుకు , కళ్లల్లో సంతోషానికి నేను బానిసను అత్తయ్య , మీరు ఎంత సంతోషంగా ఉంటే నాకు అంత ఆనందం” అని చెప్పి వీపు నిమురుతూ తలపై ప్రేమగా ముద్దుపెట్టాను.

అత్తయ్యను ఒక పక్క భుజం పై చెయ్యి వేసి హత్తుకొని నడిపించుకుంటు లేక్ దగ్గరికి తీసుకుని వెళ్లగా చెక్క బోట్ రెడీగా ఉండటంతో అందరూ ఎక్కగా 5 మందికి అని డబ్బులు ఇవ్వగా, నీళ్లల్లో ముందుకు వెళుతూ రెండు పక్కల తూర్పు కనుమలు , పెద్ద పెద్ద పామ్ చెట్లు మరియు రకరకాల పక్షులు గుంపులు గుంపులుగా అందంగా ఎగురుతుండటం చూస్తూ ప్రకృతిని మనఃస్ఫూర్తిగా ఎంజాయ్ చెయ్యసాగాము.

పిల్లలు మామయ్య అది చూడు , ఇటు పక్క చూడు అని వేళ్ళతో చూపిస్తూ ఎప్పుడు లేని సంతోషంతో గడపసాగారు. ఒక గంట పాటు మొత్తం అన్ని బోట్ నడిపే వ్యక్తి చూపించి తిరిగి బోట్ ఎక్కిన ప్రదేశానికి రాగా , కిందకు దిగి ఒడ్డు దాగ్గరికి రాగా మామయ్య మళ్ళీ ఇంకొక్కసారి వెళదాము అని చెప్పగా , అందరి ముఖాలు చూడగా సంతోషంగా తల ఊపగా మళ్ళీ ఎక్కి అప్పటికంటే ఎక్కువ డబ్బు ఇచ్చి ఇంకా వేరేవి ఉన్నాయా అని అతడిని అడుగగా మీరు ఎక్కండి అని నవ్వుతూ చెప్పగా , కొద్దిగా ముందుకు వెళ్లి వేరే పక్కకు తీసుకుని వెళ్లి మొత్తం ఇంకా అందమైన వాటిని చూపించి ఒడ్డుకు రాగా 1:30 అవుతుండగా అందరికి ఆకలి వెయ్యగా, కారులోకి ఎక్కి ముందుకు పోనిస్తూ లేక్ వెంబడి ఉన్న పక్షుల గుంపులు తిలకిస్తూ మంచి ప్రదేశం కోసం చూడగా ఒక దగ్గర కొన్ని చెట్లు ఉండి, కింద ఆకులు మాత్రమే పడి కూర్చోవడానికి అనువుగా ఉండటంతో కారును ఒక పక్కకు ఆపి , అక్కడకు వెళ్లి ఆకులను చదునుగా చేసి డిక్కీలో ఉన్న బ్యాగు తీసుకొని వచ్చి , లోపల ఉన్న రెండు రగ్గులు పరిచి వాటి మీద టవల్ లను ఒక పక్క పెట్టి , మహి మరియు పిల్లల సహాయంతో భోజనం ఉన్న బాక్స్ లను తీసుకు వచ్చి అందరూ రగ్గుపై చుట్టూ కూర్చోనసాగాము.

1 Comment

  1. 👌👌👌

Comments are closed.