జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

సుమారు 8 గంటల సమయంలో ఒక్కొక్కరుగా నా దగ్గరకు రాగా , “ఇంకా అయిపోయినట్లుగా మీ మనసు చెప్పడం లేదా” అని అడుగగా “పో బావ” అని మహీీ నా భుజం పై కొడుతుండగా, అత్తయ్య కూడా రాగా అన్నింటికీ ఒకటే బిల్ వెయ్యమనగా బిల్ వేసి ఇవ్వగా కార్డ్ ద్వారా స్వైప్ చేసి జేబులో పెట్టుకొనగా సేల్స్ మెన్స్ ముగ్గురు అన్ని తీసుకొని మా వెనుక రాగా కారులో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అన్ని పెట్టించి ఎలాగోలా కూర్చొని పొద్దున్న వెళ్లిన రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసి 9:30 కల్లా ఇంటికి చేరుకున్నాము.

అప్పటికే అలసిపోయి ఉండటంతో కారులో నుండి అందరూ శక్తి లేనట్లు దిగి నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్లి తలుపు తీసి మహి లోపలికి వెళ్లి తలుపు పక్కనే ఉన్న స్విట్చెస్ అన్ని on చెయ్యగా బయట ఉన్న లైట్స్ కూడా వెలుగగా కాంపౌండ్ లో నల్లటి కవర్ కప్పి ఎత్తుగా ఉన్న దానిని ఆశ్చర్యంగా ఏమిటిది అని అందరూ దగ్గరకు వెళ్లగా మహి కవర్ ను లాగెయ్యగా , రెండు సైకిళ్లను మరియు స్కూటీ ని చూసి ఒక్కసారిగా చిన్నా సంతోషానికి అవధులు లేక పూర్తి ఎనర్జీ తో సంతోషం పట్టలేక గెంతులెయ్యసాగాడు.

చిన్నా సైకిల్ దగ్గరికి వెళ్లి చూడగా చాలా స్టైలిష్ గా తన స్కూల్ లోనే ఇలాంటి సైకిల్ ఎవరితోనూ లేదని దానిని ముట్టుకొని కాంపౌండ్ గేట్ పక్కన నిలబడిన నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా మీదకు ఎగురగా కొద్దిగా కిందకు వొంగి క్యాచ్ చెయ్యగా థాంక్స్ మామయ్య అని గట్టిగా హత్తుకుపోసాగాడు. నచ్చిందా చిన్నా అని అడుగగా నా బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి మామయ్య చాలా చాలా బాగుంది. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు అని ఆనందం లో మాటలు రానివాడిలా ఆగి ఆగి చెప్పసాగాడు.

చిన్నాను ఎత్తుకొని వర్షిని దగ్గరకు వెళ్లి వర్షిని ఇది నీదే నీకు నచ్చిందా అని అడుగగా నా నడుముపై చేతులు వేసి హత్తుకొని థాంక్స్ మామయ్య అని ఆనందపడసాగింది. ఇక చివరగా స్కూటీ ని చూపిస్తూ ఎలా ఉంది అని కళ్ళు ఎగరేయ్యగా వర్షిని వెనుక నన్ను కౌగిలించుకొని లవ్ యు బావ అని చెప్పింది. ఇదంతా అత్తయ్య ఆనంద భాస్పాలు కారుస్తూ నన్ను భావోద్వేగంతో , ఆరాధనగా చూస్తూ సంతోషంగా తన చేతితో కళ్లను తుడుచుకొంటు మా దగ్గరికి వచ్చి అందరిని తన చేతులతో సంతోషంగా చుట్టివేసింది.

1 Comment

Comments are closed.